డాక్టర్స్ డే
ప్రతి సంవత్సరము జూలై 1 వ తేదీన డాకటర్స్ డే ని జరుపుకుంటాం .
వైద్యోనారాయణో హరి అన్న నానుడి నిజము . రోగుల ప్రాణాలను కాపాడేందుకు వైద్యులు చేసే నిరంతర సేవకు ఈమాత్రం గుర్తింపు చాలదేమో ! ప్రతి వృత్తీ దేనికదే సాటి అయినప్పటికీ వైద్య వృత్తి వాటికి భిన్నమైనది . మృత్యువు చివర అంచులదాకా వెళ్ళిన వారికి ప్రాణం పోసే శక్తి ఈ వృత్తికి ఉంటుంది . అందుకే వైద్య వృత్తి పవిత్రమైనది . నిబద్దత , త్యాగనిరతి వైద్యులకు ఉండాలి . తమ వ్యక్తిగత జీవితాన్ని పక్కకు పెట్టేసి తెల్లకోటుకే ప్రాదాన్యమివ్వాలి . ఎదుటవ్యక్తి ప్రాణాలు కాపాడడానికి తపన పడేవాడే నిజమైన వైద్యుడు . మానవ సేవే మాధవ సేవ అన్నట్లు సాగే వైద్య వృత్తిలో ఎంతగా సేవానిరతి కలిగి ఉంటే అంతటి గొప్పవ్యక్తిగా గుర్తింపు . డాక్టర్లకు సహనము , ఓర్పు , సేవానిరతి , దయ ఉండాలి . .. అప్పుడే రాణిస్తారు . వైద్యుడు ఎల్లప్పుడు -AIR ను అనుసరించాలి . ఎ - అంటే Availability అన్నివేలలా రోగులకు అందుబాటులో ఉండాలి , ఏ అత్యవసర పరి్స్థితిలోనైనా తనకు వద్యం చేసే డాక్టర్ అందుబాటులో ఉన్నాడన్న , ఉంటాడన్న నమ్మకము రోగికి కలిగేటట్లు వైద్యులు మెలగాలి .. ఐ - అంటే Interest .. తను చేస్తున్న వృత్తి మీద వైద్యులకు అబిరుచి , నమ్మకము ఉండాలి . . . ఏదో జీవనోపాది కోసం పనిచేయకూడదు . అర్ - అంటే Regularity .. తను చేస్తున్న పని కి ఒక క్రమబద్దత ఉండాలి . నిర్ధిస్టమైన టైముటేబుల్ ఉండాలి . ప్రతి డాక్టరూ ఎల్లప్పుడు రోగికి మంచి చేయాలనే ఆలోచిస్తాడు . ఫీజు తీసుకున్నా .. తీసుకోకపోయినా తను చేసే సేవ ఒకేలా ఉంటుంది . రోగికి , వైద్యుడుకు నడుమ నమ్మకం అనే బంధము ఉండాలి .
వైద్యులకోసం ఒకరోజు :
అనుక్షణం ఆరోగ్యాన్ని , శరీరక , మానసిక స్థైర్యాల్ల్ని అందించే ఈ వైద్య నారాయణులకు ఏమిచ్చి రుణము తీర్చుకోవాలి? డాక్టరు చికిత్స చేసేశాడు - రోగి ఫీజు చెల్లించాడు అనుకుంటే ఆ ప్రాణదాత రుణము తీరిపోతుందా ? ఆ బంధము తెగిపోతుందా ? ఆ దాత పోసిన ఊపిరి అనుక్షణము కృతజ్ఞతను నింపుకునె పదేపదే గుర్తు చేస్తూ ఉండదూ ?... అందుకె ఈ వైద్యులకోసం ప్రపంచమంతా ఒక రోజు కేటాయించినది .. అదే ప్రపంచ డాకటర్స్ డే దినోత్సవం . వాళ్లను గుర్తు పెట్టుకునేందుకు ఈ రోజున డాక్టర్లందరూ సుఖ సంతోషాలు , ఆయురారోగ్యాలు , సిరి సంపదలతో చల్లగా ఉండాలని దేవుని ప్రార్ధించి శుభాకాంక్షలు తెలియజేస్తారు . అలా తెలియజేసేందుకు సంవత్సరము లో ఒకరోజు .
డాక్టర్స్ డే చరిత్ర :
1933 లో జార్జియ లోని విండార్ లో మార్చి 30 వ తేదీన తొలి డాక్టర్స్ డే ని పాటించారు . డా.చార్లెస్ బి.ఆల్మండ్ భార్య బ్రౌన్ ఆల్మండ్ వైద్యుల గౌరవార్ధము ఒక రోజు ను కేటాయించాలని నిర్ణైంచింది . గ్రీటింగ్ కార్డులు పంపడం , అశువులు బాసిన వైద్యులకు పూలతో నివాళులర్పించడం ద్వారా తొలి డాక్టర్స్ డే ఉత్సవం జరిపారు . జాతీయ డాక్టర్స్ డే నాడు ఎర్రని కార్నేషన్ పువ్వులను సాధారణం గా వాడేవారు .
యునైటెడ్ స్టేట్స్ లో ప్రతినిధుల సభ డాక్టర్స్ డే పాటిస్తూ1958 మార్చి 30 వ తేదీన తీర్మానం చేసింది .
1990 లో నేషనల్ డాక్టర్స్ డే పాటించాల్సిందిగా చట్టాన్ని ప్రవేశపెట్టారు .
1990 అక్టోబర్ 30 న అధ్యక్షుడు జార్జి బుష్ మార్చి 30 న ' నేషనల్ డాక్టర్స్ డే ' గా పేర్కొంటూచట్టం పై సంతకాలు చేశాడు .
మన భారత దేశములో ప్రతియేటా జూలై 1 న నేషనల్ డాక్టర్స్ డే ని జరుపుకుంటున్నాము . ప్రముఖ వైద్యుడు డా. బి.సి.రాయ్ గౌరవార్ధం ఈ రోజును నిర్ణయించారు . ఈయన 1882 జూలై 01 న జన్మించినారు . మన దేశములో వైద్య రంగానికి ఎనలేని సేవలందించిన ఆ జన్మదిన వేడుకలే డాక్టర్స్ డే ఉత్సవాలుగా జరుపుకుంటున్నాము . ఈయన పుట్టినరోజు .. మరణించిన రోజు ఒక్కరోజే .. అదే జూలై 01 వ తేదీ . 1962 జూలై 1 వ తేదీన చనిపోయారు .
డాక్టర్ బి.సి.రాయ్ 1882 వ సంవత్సరం జూలై ఒకటవ తేదీన బీహార్ రాష్ట్రం ,పాట్నా జిల్లాలోని బకిమ్ పూర్ లో జన్మించాడు.ఈయన పూర్తి పేరు బిధాన చంద్ర రాయ్.తండ్రి ప్రకాశ్ చంద్ర. . . ఎక్సైజ్ ఇంస్పెక్టర్ . బి.సి .రాయ్ తోబుట్టువులు ఐదుగురు . తన 14 వ యేట నే తల్లిని కోల్పోయారు .
అవివాహితుడైన బి.సి.రాయ్ తన ఆస్తులతో పాట్నాలో ఓ ట్రస్ట్ ఏర్పాటు చేసి సామాజిక సేవలలకు అంకితం చేసాడు .
బిధాన చంద్ర రాయ్ 1909-11 మధ్య కాలం లో ఇంగ్లండ్ లోని సెంట్ బెర్త్ లోమో కాలేజీ లో M.R.C.P మరియు F.R.C.S అనే డిగ్రీలు పొందడానికి చదువు కొనసాగించి 1911 లో స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత కోల్ కతా మెడికల్ కాలేజీ లో కొంతకాలం అధ్యాపకుడిగా పనిచేసారు.ఈయన జాదవ్ పూర్ టి.బి.హాస్పిటల్,ఆర్.జి.ఖార్ మెడికల్ కాలేజీ , కమలా నెహ్రూ హాస్పిటల్, విక్టోరియా ఇన్స్టిట్యూట్, చిత్తరంజన్ క్యాన్సర్ హాస్పిటల్ మొదలైన సంస్థలు నెలకొల్పాడు.1926 లో ప్రత్యేకంగా మహిళల కోసం , పిల్లల కోసం చిత్తరంజన్ సేవాసదన్ అనే వైద్య శాలను ఏర్పాటు చేసాడు.మహిళలకు నర్సింగ్ శిక్షణ కోసం ఒక శిక్షణా సంస్థనూ ఏర్పాటు చేసాడు.1925 లో రాజకీయ రంగ ప్రవేశం చేశాడు.బారక్ పూర్ అసెంబ్లీ నియోజక వర్గం నుంచి పోటీ చేసి గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ బెంగాల్ గా పేరొందిన సురేంద్రనాధ్ బెనర్జీని ఓడించాడు.1922-28 ల మధ్య కాలం లో కోల్ కతా మెడికల్ జర్నల్ కు సంపాదకత్వ బాధ్యతలు నిర్వర్తించాడు. 1928 లో అఖిలభారత కాంగ్రెస్ కమిటీ సభ్యులు అయ్యాడు.1933 లో కోల్ కతా నగరానికి మేయర్ గా ఎన్నికైనాడు. 1942 లో కోల్ కతా విశ్వ విద్యాలయానికి వైస్ ఛాన్సలర్ గా, 1943 లో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు అధ్యక్షుడిగా నియమింపబడ్డాడు. విద్యా, వైద్య రంగాలలో ఈయన సేవలకు 1944 లో గౌరవ డాక్టరేట్ ప్రధానం చేయబడింది. 1948 జనవరి 13 న పశ్చిమ బెంగాల్ ముఖ్య మంత్రి పదవిని చేపట్టారు.1961 లో ఫిబ్రవరి 4 న ఈయనను భారత రత్న వరించింది.వీరి జయంతి రోజైన జూలై ఒకటినే వర్ధంతి కూడా కావడమ్ విశేషం.ఈయన స్మారకార్ధం ప్రతీ ఏడూ జూలై ఒకటవ తేదీన వైద్యుల దినోత్సవం గా జరుపుకోవాలని భారత ప్రభుత్వం 1962 లో ప్రకటించింది.వివిధ రంగాలలో సేవలు అందించిన వారికి 1976 నుంచి డాక్టర్ బి.సి.రాయ్ పేరు మీద అవార్డులను ప్రధానం చేస్తున్నారు.
నేటి వైద్యులకు , వైద్యవిద్యార్ధులకు ఆదర్శప్రాయుడు డా.బి.సి.రాయ్ .
(బి.సి.రాయ్ జయంతి మరియు వర్థంతి సందర్భంగా)
* బి.సి.రాయ్ ఎప్పుడు జన్మించాడు--జూలై 1, 1882.
* బి.సి.రాయ్ పూర్తిపేరు--బిదన్ చంద్ర రాయ్.
* బి.సి.రాయ్ జన్మించిన ప్రదేశం--బీహార్ లోని పాట్లా జిల్లా బకింపూర్.
* బి.సి.రాయ్ ఏ నగరానికి మేయర్‌గా పనిచేశారు--కలకత్త (కోల్‌కత).
* బి.సి.రాయ్ ఏ విశ్వవిద్యాలయానికి వైస్-ఛాన్సలర్‌గా పనిచేశారు--కలకత్తా విశ్వవిద్యాలయానికి.
* 1925 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలో లో బి.సి.రాయ్ చేతిలో పరాజయం పాలైన ప్రముఖుడు--సురేంద్రనాథ్ బెనర్జీ.
* బి.సి.రాయ్‌కు భారతరత్న అవార్డు ఏ సం.లో లభించింది--1961.
* బి.సి.రాయ్ జయంతిని ఏ దినంగా జరుపుకుంటారు--వైద్యుల దినోత్సవం.
* బి.సి.రాయ్ పేరిట అవార్డులను ఏ సం. నుంచి ప్రధానం చేస్తున్నారు--1976.
* బి.సి.రాయ్ ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు--పశ్చిమబెంగాల్.
COMMENTS