IITs Offered Courses: స్టూడెంట్స్ కి అలర్ట్.. వివిధ ఐఐటీలు ఆఫర్ చేస్తున్న తాజా కోర్సులు ఇవే..
దేశంలోనిఐఐటీ (IITs)లు కొత్త కోర్సులనుఆఫర్ చేస్తున్నాయి. ఇందులో డేటా సైన్స్ (Data Science), మెడికల్ ఫిజిక్స్, బిజినెస్ అనలిటిక్స్, పీజీ సర్టిఫికేషన్, కంప్యూటర్ సైన్స్, బిజినెస్ మేనేజ్‌మెంట్ వంటి కోర్సులు ఉన్నాయి. కొన్నిటికి జేఈఈ స్కోర్ (JEE Score) తప్పనిసరి కాగా, మరి కొన్నిటికి 12వ తరగతి క్లియర్ చేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన విద్యార్థులుమాత్రమే ఈ కోర్సులకు దరఖాస్తు చేసుకోవాలి. వారి కుటుంబ వార్షిక ఆదాయం రూ. 8 లక్షల లోపు ఉండాలి. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఉంటుంది. అర్హత పరీక్షల్లో అత్యధిక స్కోర్‌తో ఉత్తీర్ణులైనవారు శిక్షణ ప్రోగ్రామ్ కింద అందించే స్టైఫండ్‌కు అర్హులు.
ఐఐటీ గౌహతి- పీజీ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్‌ఈ సంస్థ మూడు పీజీ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్‌ను ఆఫర్ చేస్తోంది. కంప్యూటింగ్ అప్లికేషన్స్, డీప్‌లెర్నింగ్ ఫర్ కంప్యూటర్ విజన్ అండ్ ఎక్స్‌ఆర్, యూఎక్స్ డిజైన్ అండ్ హెచ్‌సీఐపై సర్టిఫికేషన్ కోర్సులను ప్రారంభించనుంది. ఇందుకోసం కోర్సెరా(Coursera) సహకారం అందించనుంది.
అర్హత ఉన్న అభ్యర్థులు సెప్టెంబర్ 21, 2022లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. క్లౌడ్ కంప్యూటింగ్ అప్లికేషన్స్‌లోని క్లౌడ్ ఇంప్లిమెంటేషన్ డిజైన్, ప్లాన్, స్కేలింగ్‌లో అభ్యర్థులు ఎక్స్‌పర్ట్‌గా మారడంలో ఈ పోస్ట్ గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ కీలకంగా వ్యవహరిస్తుందని ఇన్‌స్టిట్యూట్ పేర్కొంది.
ఐఐటీ పాట్నా-కంప్యూటర్ సైన్స్, బిజినెస్ మేనేజ్‌మెంట్ కోర్సులు కంప్యూటర్ సైన్స్ స్ట్రీమ్‌లో మూడు అకడమిక్ కోర్సులు.. బిజినెస్ మేనేజ్‌మెంట్ స్ట్రీమ్‌లో మూడు కొత్త కోర్సులను ఈ ఇన్‌స్టిట్యూట్ ఆఫర్ చేస్తోంది. ఈ కోర్సులు 12వ తరగతి పాసైన విద్యార్థుల కోసం డిజైన్ చేశారు. ఈ కోర్సుల్లో చేరాలంటే జేఈఈ స్కోర్ తప్పనిసరి కాదు.
ఐఐటీ హైదరాబాద్- ఎంఎస్సీ ఇన్ మెడికల్ ఫిజిక్స్, మెడికల్ ఫిజిక్స్‌లో మూడేళ్ల మాస్టర్ ఆఫ్ సైన్స్ (MSc) ప్రోగ్రామ్‌ను ఐఐటీ -హైదరాబాద్ ఆఫర్ చేస్తోంది. రేడియేషన్ ఫిజిక్స్, క్లినికల్ ఇమ్మర్షన్ అండ్ షాడోవింగ్, ఇండస్ట్రీ/క్లినికల్ లెక్చర్స్, షార్ట్-టర్మ్ ప్రాజెక్ట్‌లు, 12-నెలల క్లినికల్ ఇంటర్న్‌షిప్ కోసం క్లినికల్ ఓరియంటేషన్‌ను అందించడం ప్రోగ్రామ్ లక్ష్యం.
ఐఐటీ రూర్కీ-బిజినెస్ అనలిటిక్స్‌లో ఎగ్జిక్యూటివ్ కోర్సు. ఈ ఇన్‌స్టిట్యూట్ బిజినెస్ అనలిటిక్స్‌లో ఆన్‌లైన్ ఎగ్జిక్యూటివ్ కోర్సును ఆఫర్ చేస్తోంది. డిజిటల్ సిల్క్ ట్రైనింగ్ సంస్థ సింప్లిలెర్న్ ద్వారా కోర్సును ఆన్‌లైన్‌లో డెలివరీ చేయనున్నారు. ఈ కోర్సులో చేరాలంటే జేఈఈ స్కోర్ తప్పనిసరి కాదు. ఈ కోర్సు ద్వారా అభ్యర్థులు డేటా బేస్డ్ బిజినెస్ నిర్ణయాలను ఎలా తీసుకోవాలో నేర్చుకుంటారు.
ఐఐటీ మద్రాస్- బీఎస్ ఇన్ ప్రోగ్రామింగ్ & డేటా సైన్స్. బీఎస్‌లో ప్రోగ్రామింగ్ అండ్ డేటా సైన్స్ కోర్సు కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది ఐఐటీ మద్రాస్. అలాగే బీఎస్‌లో నాలుగేళ్ల డేటా సైన్స్ అండ్ అప్లికేషన్స్ కోర్సు కూడా అందుబాటులో ఉంది. ఈ కోర్సుల్లో భాగంగా అభ్యర్థులు బిజినెస్ లేదా పరిశోధనా సంస్థలతో ఎనిమిది నెలల అప్రెంటిస్‌షిప్ లేదా ప్రాజెక్ట్‌లో పాల్గొననున్నారు. ప్రస్తుతం 12వ తరగతి చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
COMMENTS