Gas Agency : Good income with gas agency.
Gas Agency : గ్యాస్ ఏజెన్సీతో మంచి ఆదాయం. డీలర్షిప్ కావాలంటే ఏం చేయాలి ? పూర్తి వివరాలు.
గతంలో కట్టెల పొయ్యి మీదనే వంట చేసుకోవాల్సి పరిస్థితి. పొగ కళ్ళలోకి వెళ్లే బాధలు, ఎటైనా వెళ్తే పొయ్యి ఆరిపోతుందన్న బెంగ రెండూ ఉండేవి.
అంతేకాదు.. వర్షం పడిందా.. కట్టెలు తడిచాయా.. ఆరోజు పక్కింటికెళ్లి వంట చేసుకోవాల్సి వచ్చేది. కానీ, ఇప్పుడలా లేదు. గ్రామీణ, పట్టణ అన్న తేడా లేకుండా అందరి ఇళ్లలోనూ గ్యాస్ స్టవ్ లు దర్శనమిస్తున్నాయి. వీటి రాకతో ఐదు నుంచి పది నిమిషాల్లోనే చక చకా వంట తయారవుతోంది. జనాభా పెరుగుతోన్న కొద్దీ ఈ మార్కెట్ విస్తరిస్తోంది. ఈ క్రమంలో ఏదైనా మంచి బిజినెస్ ఐడియా కోసం వేచి చూస్తున్న వారికి ఇది ఉత్తమమని చెప్పాలి.
దేశంలో ప్రతి ఒక్కరు వంట గ్యాస్ సిలిండర్ కలిగి ఉండేలా కేంద్ర సర్కార్ ప్రత్యేక చర్యలు చేపడుతోంది. అందుకోసం ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం ద్వారా కోట్లాది పేద కుటుంబాలకు తక్కువ ధరకే గ్యాస్ కనెక్షన్ అందిస్తోంది. ఈ పథకం కింద కోటి కొత్త ఎల్‌పీజీ కనెక్షన్లను పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అంటే.. గతంలో కంటే ఇప్పుడు ఎక్కువ గ్యాస్ సిలిండర్లు అవసరం అవుతాయి. ఇప్పటికే పని చేస్తున్న గ్యాస్ ఏజెన్సీలపై భారం కూడా పెరుగుతుంది. ఈ కారణంగా కొత్త గ్యాస్ ఏజెన్సీలు కూడా ఎంతో అవసరం. ఇటువంటి పరిస్థితిలో గ్యాస్ ఏజెన్సీని ప్రారంభించడం మంచి వ్యాపారమని చెప్తున్నారు.. నిపుణులు.
చాలా మందికి ఇంతకుముందే ఇలాంటి ఆలోచన వచ్చింటది. కానీ, ఎలా తెరవాలి? ఏజెన్సీ ఎలా తీసుకోవాలి? ఒక సిలిండర్ పై కమీషన్ ఎంత ఉంటది? డీలప్‌షిప్ తీసుకున్నాక.. గ్యాస్ ఏజెన్సీని నడపాలంటే నియమ నిబంధనలు ఏంటి? అన్న వివరాలు తెలియక దాన్ని దాటవేస్తుంటారు. అలాంటి వారికకోసమే ఈ వార్త. గ్యాస్ ఏజెన్సీ ఎలా పొందాలి? నియమ నిబంధనలు, అర్హతలు ఏంటి? అన్న వివరాలను సమగ్రంగా తెలియజేయస్తున్నాం. దేశంలోని వంట గ్యాస్ పంపిణీ కంపెనీలు ఇండియన్ ఆయిల్- ఇండేన్, భారత్ పెట్రోలియం- భారత్ గ్యాస్, హిందుస్థాన్ పెట్రోలియం- HP గ్యాస్. ఇవి ప్రభుత్వ రంగంలోని కంపెనీలకు చెందిన గ్యాస్ కంపెనీలు. ఎక్కువుగా ఈ మూడే కనిపిస్తుంటాయి. ఇవి డిస్ట్రిబ్యూటర్ల నెట్ వర్క్ ద్వారా వంట గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేస్తుంటాయి. ఆయా కంపెనీల నియమ నిబంధనలు అనుసరించి లైసెన్స్ పొందాలి. ఏజెన్సీని నడిపించాలి.
దరఖాస్తు విధానం
ఏజెన్సీలను మంజూరు చేసేందుకు ఆయా కంపెనీలు ఎప్పటికప్పుడు దరఖాస్తులను స్వీకరిస్తుంటాయి. అందుకు అనుగుణంగా మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకు.. HP గ్యాస్ ఏజెన్సీని ప్రారంభించాలనుకునే అభ్యర్థులు హిందూస్తాన్ పెట్రోలియం వెబ్‌సైట్ లో లేదా ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకున్న తర్వాత సంబంధిత వ్యక్తి ఎంపికైతే ఇంటర్వ్యూకు పిలవబడతారు. ఇంటర్వ్యూ తర్వాత షార్ట్‌లిస్ట్ అయిన వ్యక్తుల జాబితా వెబ్‌సైట్‌లో ఉంచబడుతుంది. ఆ తర్వాత దీనికోసం అవసరమైన పత్రాలను అందించాల్సి ఉంటుంది. ఆ పత్రాలను పరిశీలించిన తర్వాత సంబంధిత కంపెనీ నేరుగా మీరు గ్యాస్ ఏజెన్సీ ఏర్పాటు చేసే స్థలం, స్టోరేజ్ గోడౌన్ ఏర్పాటు చేసే స్థలాన్ని పరిశీలిస్తుంది. స్వంత స్థలం లేకపోతే.. తప్పనిసరిగా 15 ఏళ్ల పాటు లీజుకు తీసుకున్న స్థలాలను అయినా కలిగి ఉండాలి.
ఆన్‌లైన్‌లో దరఖాస్తు ఇలా.
LPG డిస్ట్రిబ్యూషన్ కోసం దరఖాస్తులు వార్తాపత్రికల ద్వారా తెలియజేయబడతాయి. అలాంటి సమాచారం కోసం https://www.lpgvitarakchayan.in పోర్టల్ కూడా అందుబాటులో ఉంది. పట్టణ, శివారు ప్రాంతాల్లో గ్యాస్ ఏజెన్సీ ప్రారంభించాలంటే కనీసం.. రూ.40 నుంచి రూ.50 లక్షల వరకు ఖర్చు అవుతుంది. అదే.. గ్రామీణ ప్రాంతాల్లో అయితే రూ.15 నుంచి రూ. 20 లక్షల వరకు ఖర్చవుతుంది.
సిలిండర్ అమ్మకంపై కమిషన్.
కమిషన్ సిలిండర్ల సైజును బట్టి వేరు వేరుగా ఉంటుంది.14.2 కిలోల గ్యాస్ సిలిండర్‌ను విక్రయించినందుకుగానూ రూ.61 84 కమిషన్, 5 కిలోల సిలిండర్ విక్రయిస్తే రూ.30.09 కమిషన్ ను కంపెనీలు డిస్ట్రిబ్యూటర్లకు అందిస్తాయి. గ్యాస్ ఏజెన్సీని ఒక మండల ప్రాంతంలో ఏర్పాటు చేసుకుంటే చాలా లాభదాయకంగా ఉంటుంది. 10 నుంచి 12 గ్రామాలు ఉన్నపుడు రోజుకు 300 సిలిండర్లు అమ్మినా రూ. 18 నుంచి రూ. 20వేలు కమిషన్ రూపంలో పొందొచ్చు.
6303581805
ReplyDeleteKuruva Lakshmi
ReplyDelete