ITBP Recruitment: ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్‌లో సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులు.. నెలకు రూ. లక్ష జీతం
ITBP Recruitment: ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ITBP) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. భారత ప్రభుత్వ హోంమంత్రిత్వశాఖకు చెందిన ఈ పోలీస్ ఫోర్స్‌లో గ్రూప్ బి నాన్ గెజిటెడ్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..:
నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 37 సబ్ ఇన్‌స్పెక్టర్లు (ఓవర్‌సీర్) పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో 32 పురుషులు, 05 మహిళల పోస్టులు ఉన్నాయి.
పైన తెలిపన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు మెట్రిక్యులేషన్/ సివిల్ ఇంజినీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
అభ్యర్థుల వయసు 20 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.
ముఖ్యమైన విషయాలు..:
ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
అభ్యర్థులను ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ (పీఈటీ), ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (పీఎస్‌టీ), రాత పరీక్ష, డాక్యుమెంటేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 35,400 నుంచి రూ. 1,12,400 వరకు చెల్లిస్తారు.
దరఖాస్తుల స్వీకరణ 16-07-2022న మొదలు కానుంది. చివరి తేదీగా 14-08-2022ని నిర్ణయించారు.
FOR NOTIFICATION CLICKHERE
FOR FULL DETAILS CLICKHERE
COMMENTS