మీ ఆండ్రాయిడ్ ఫోన్ బ్యాక్అప్ ఇలా
మీ దగ్గర ఆండ్రాయిడ్ ఫోన్ ఉన్నట్లయితే అందులో ముఖ్యమైన డేటా మొత్తం ఏమాత్రం మిస్ కాకుండా బ్యాకప్ తీసుకోవడం చాలా మంచిది . ఎంత ఖరీదైన ఫోన్ అయినా రెండు , మూడేళ్ల తర్వాత సరిగా పనిచేయదు . కొన్నిసార్లు అది సడెన్‌గా పనిచేయడం మానేయొచ్చు . Googleడ్రైవ్‌లో విలువైన సమాచారం ఉంటే దానిని తిరిగి పొందలేకపోతామన్న భయం ఇకపై అనవసరం . డేటాని ముందుగానే బ్యాకప్ చేసుకోవడానికి అనేక మార్గాలున్నాయి . . అవేమిటంటే . . .
సెట్టింగ్స్ బ్యాకప్
మీ Android phone లో ఉన్న ముఖ్యమైన సెట్టింగ్స్ అన్నీ ఒకేచోట బ్యాకప్ తీసుకోవడం కోసం Google Driveలో ఒక ప్రత్యేకమైన సెట్టింగ్ అందిస్తోంది .
దీనికిగాను మీరు చేయాల్సిందల్లా మీ ఫోన్లో Google డ్రైవ్ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకుని , అందులో బ్యాకప్ అనే విభాగంలోకి వెళ్లి Backup to Google Drive అనే ఆప్పన్ సెలెక్ట్ చేసుకోండి .
అందులో భాగంగా మీ ఫోన్లో ఉన్న కాల్ హిస్టరీ , కాంటాక్ట్ , వైఫై పాస్వర్డ్లు , హోమ్స్ర్కీన్ అరేంజ్మెంట్ , ఎస్ఎంఎస్లు వంటి ముఖ్యమైనసెట్టింగ్స్ అన్నీ మీ Google , డ్రైవ్ అకౌంట్ లోకి బ్యాకప్ తీసుకోవడానికి ఇది అవకాశం కల్పిస్తుంది .
ఫొటోలు బ్యాకప్
ఫోన్లో ఉన్న ముఖ్యమైన ఫోటోలు అన్నీ బ్యాకప్ కావాలంటే , దీనికోసం Google Photos అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకుంటే సరిపోతుంది . ఆటోమేటిక్ గా మీ ఫోన్లో ఎప్పటికప్పుడు తీసే ఫోటోలు అన్నీ మీ Google ఫొటోస్ అకౌంట్లోకి వాటంతటవే బ్యాకప్ అవుతుంటాయి . స్టోరేజ్ స్పేస్ ఆదా చేసుకోవటం కోసం వాటిని మీఫోన్లో | తొలగించుకోవచ్చు . క్లౌడ్‌లో అవి సురక్షితంగా ఉంటాయి .
ఆండ్రాయిడ్ కాంటాక్ట్
మీ ఫోన్లో ఉన్న కాంటాక్ట్స్ అన్నీ బ్యాకప్ తీసుకోవచ్చు . దీనికోసం అనేక అప్లికేషన్స్ Google Play Storeలో లభిస్తున్నాయి . వాటిని ఇన్స్టాల్ చేసుకుంటే , మీ ఫోన్లోనే ఒక ప్రత్యేకమైన ఫైల్ రూపంలో కాంటాక్ట్స్ ను సేవ్ చేసుకోవచ్చు . అంతేకాదు , మీ ఫోన్లో సేవ్ చేసే అన్ని కాంటాక్టులు Google Contact9లోకి సేవ్ అయ్యేలానూ ఏర్పాటు చేసుకోవచ్చు లేదా ప్రత్యేకంగా గూగుల్ కాంటాక్ట్స్ అప్లికేషన్లో కూడా గూగుల్ ప్లే స్టోర్‌లో లభిస్తుంది .
టెక్స్ట్ మెసేజీలు
ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా ఫోన్లో ఉన్న అన్ని టెక్స్ మెసేజ్‌లు ఆటోమేటిక్‌గా బ్యాకప్ తీయడం అంటే Google డ్రైవ్ ఒక ఆపన్ను అందిస్తున్న విషయం తెలిసిందే .
దాంతోపాటు Google ప్లే స్టోర్‌లో SMS Backup & Restore అనే మరొక అప్లికేషన్ లభిస్తోంది .
అదీ చాలా సమర్ధవంతంగా అన్ని టెక్స్ట్ మెసేజీలు బ్యాకప్ , రీస్టోర్ చేయగలుగుతుంది .
వాట్సప్ సంస్థకు Google సంస్థతో ఉన్న ఒప్పందం ప్రకారం , ఫోన్లోని వాట్సాప్ మెసేజీలు , ఫోటోలు , వీడియోలు ఆన్నీ Google అకౌంట్లో ఆటోమేటిక్‌గా బ్యాకప్ అవుతాయి అన్న విషయం తెలిసిందే .
పైన చెప్పుకున్న ఆప్లికేషన్స్ మాత్రమే కాకుండా , పూర్తిగా ఫోన్లో ఉన్న డేటా మొత్తాన్నీ ఒకే చోట బ్యాకప్ తీయాలంటే గనుక Gi Cloud అనే అప్లికేషన్ బాగా ఉపయోగపడుతుంది .
COMMENTS