Brecullosis : పశువులలో ప్రమాదకరంగా మారుతున్న బ్రూసెల్లోసిస్ వ్యాధి
Brecullosis : పాడి పశువులు, జీవాలు, మేకలు, పందులతో పాటు మనుషులకూ అంటుకుంటుంది. దీంతో పాడిపరిశ్రమ, మాంస పరిశ్రమలు తీవ్రంగా నష్టపోయే ప్రమాదముంది. ఈ వ్యాధి బ్రూసెల్ల అనే సూక్ష్మజీవి వల్ల వస్తుంది. ఈ సూక్ష్మజీవి వృద్ధి చెందేందుకు తక్కువ వాతావరణ ఉష్ణోగ్రత, అపరిశుభ్రమైన పరిస్థితులు, పేదరికం దోహదపడుతాయి.
వ్యాధికారక సూక్ష్మజీవితో కలుషితమైన మేతమేయడం ద్వారా, నీరు తాగడం ద్వారా వ్యాధి వ్యాప్తి చెందుతుంది. గాయాలతో ఉన్న చర్మం ద్వారా వ్యాప్తిస్తుంది. వ్యాధిగ్రస్త మగ పశువు వీర్యాన్ని గర్భధారణకు ఉపయోగించినప్పుడు సోకుతుంది. ఈ వ్యాధి సోకిన పశువుల్లో ఐదో నెలలో ఈసుకుపోవడం. మాయవేయకపోవడం, గర్భాశయ సంబంధిత వ్యాధులు రావడం. తీవ్రమైన, దీర్ఘకాలిక జ్వరం రావడం. కీళ్లవాపులు, నొప్పులు. వృషణాల వాపు, మగ పశువుల్లో వంధత్వం కలగడం వంటి సమస్యలు కనిపిస్తాయి. ఈ వ్యాధి సంక్రమిస్తే సరైన చికిత్స లేదు.
బ్రూసెల్లోసిస్, గాలికుంటు వ్యాధి కారణంగా ప్రతి ఏటా దేశంలోని రైతులకు 50వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతుంది. బిలియన్ డాలర్ల వరకు నష్టం వాటిల్లుతుంది. ఇప్పటికే ఈ వ్యాధిపై సర్వత్రా అందోళన వ్యక్తమౌతుంది. ఎందుకంటే ఇది పశువులతోపాటు మనుషులకు సోకే ప్రమాదం పొంచి ఉండటమే కారణం. దీనిపై అటే కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. జాతీయ పశువ్యాధి నియంత్రణ కార్యక్రమం ద్వారా టీకాలు వేసే కార్యక్రమం చేపట్టింది.
ఈ టీకా కార్యక్రమంలో భాగంగా 51 కోట్ల పశువులకు గాలికుంటు వ్యాధికి టీకాలు, 4 నుండి 8మాసాల వయస్సున్న 3.6కోట్ల పెయ్య దూడలకు బ్రూసెల్లోసిస్ వ్యాధికి టీకాలు వేయనున్నారు. వ్యాధి నివారణగాను నాలుగు నుంచి 8 నెలల వయసున్న ఆడ దూడలకు టీకాలు వేయించుకోవాలి. భారత ప్రభుత్వం గాలికుంటు ,బ్రూసెల్లోసిస్ నియంత్రణకు ప్రతి రాష్ట్రానికి 13,343 కోట్ల రూపాల అర్ధిక సహాయంతో 5సంవత్సరాల కాలంలో టీకా వేసేకార్యక్రమానికి ఖర్చు చేయనున్నారు.
ఇలాంటి వ్యాధుల విషయంలో రైతాంగం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. పశువుల పాకను పరిశుభ్రంగా ఉంచాలి. వ్యాధిగ్రస్త పశువును మంద నుంచి తొలగించాలి. బ్రూసెల్లోసిస్ అంటు, ప్రమాదకరమైన వ్యాధి. ఇది పాడి పశువులు, జీవాలు, మేకలు, పందులతో పాటు మనుషులకూ వచ్చే ప్రమాదం ఉంది. టీకాలు వేసుకోవడం ద్వారానే నివారించవచ్చు.
COMMENTS