మీ ఆధార్ కార్డ్ ఎక్కడ ఉపయోగించారో తెలుసుకోవాలా?
Want to know where your Aadhaar card is used : ఆధార్ కార్డు లేకుండా ఏపని జరగని విధంగా కాలం మారిపోయింది. బ్యాంక్ అకౌంట్ మొదలుకొని ప్రతి చిన్న విషయానికి కూడా ఆధార్ కార్డ్ ఖచ్చితంగా అవసరం అవుతోంది. అయితే, ప్రతి ఒక్కరికి వారి ఆధార్ కార్డు ఎక్కడ ఎందుకు ఉయోగించారో గుర్తుండకపోవచ్చు. అంతేకాదు, ఇంకెవరైనా వారి ఆధార్ కార్డ్ ఉపయోగిస్తున్నారా? అనే అనుమానం కూడా ఉండవచ్చు.
కానీ వాస్తవానికి, ఇప్పటి వరకు మీ ఆధార్ కార్డు ఏవిధమైన అవసరాలకి వాడబడిందో తెలుసుకోవడం చాలా సులభం. మీ ఆధార్ కార్డ్ ఎక్కడ, ఎందుకు ఉపయోగించారు అనేవిషయాన్ని తెలుసుకోవడానికి మీరు అనుసరించవలసిన విధానాన్ని స్టెప్ బై స్టెప్ ఇక్కడ చూడవచ్చు.
ఈ క్రింది విధంగా చేయాలి
1. ముందుగా ప్రభుత్వ అధికారిక UIDAI యొక్క
https://resident.uidai.gov.in లింక్ ఓపెన్ చేయాలి.
2. ఇక్కడ మీరు పైన సూచించిన ఎంపికల్ల్లో My Aadhaar లోకి వెళ్ళాలి
3. ఇక్కడ మీరు Aadhaar Services లోకివెళ్ళి అందులో Aadhaar Authentication History ని ఎంచుకోవాలి
4. పేజ్ ఓపెన్ అయిన తరువాత సూచించిన దగ్గర మీ 12 అంకెల
ఆధార్ కార్డు నంబర్ నమోదు చేయాలి మరియు అక్కడ ఇచ్చిన సెక్యూరిటీ కోడ్ కూడా నమోదు చేసి ఎంటర్ చేయాలి.
5. ఈ విధంగా చేసినతరువాత మీకు మీ యొక్క నమోదుకాబడిన (Registered) మొబైల్ నంబర్ కి OTP వస్తుంది.
ఈ OTP కేవలం
ముందుగా నమోదు చేయబడిన మొబైల్ నంబరుకు మాత్రమే వస్తుంది.
6. మీ మొబైల్ కి వచ్చిన OTP ఎంటర్
చేసిన తరువాత మీరు ఆధార్ పేజీ వివరాల్లోకి వెళతారు, ఇక్కడ
మీరు మీకు సంబంధించిన వివరాలను చూడొచ్చు.
7. అయితే , ఇక్కడ మీరు ఏయే వివరాలు కావాలనుకుంటున్నారో వాటిని మీరు ఎంచుకోవలసి ఉంటుంది.
8. ఉదాహరణకి : డేట్
ఎంచుకోవడం ద్వారా ఈ డేట్ పరిధిలో ఏవిధమైన సౌకర్యాలకు ఈ కార్డు వాడబడిందో తెలుస్తుంది.
9. అయితే ఇక్కడ ఎవరు వాడారన్న విషయం మాత్రం తెలుసుకునే వీలులేదు.
COMMENTS