తాటి ముంజలతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలివే
These are the health benefits of Thati Munjalu: వేసవిలో దొరికే ముఖ్యమైన పండ్లలో తాటి ముంజలు కూడా ఒకటి. ఈ పండు శరీరానికి కలిగించే చలువ వల్ల దీన్ని 'ఐస్ యాపిల్' అని కూడా అంటారు. ఎండాకాలం ప్రారంభం కాగానే తాటి ముంజలు మార్కెట్లో లభిస్తాయి. తాటి ముంజల్లో ఉండే పోషకాలు ఆరోగ్యానికి
ఎన్నో రకాలుగా మేలు చేస్తాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
- వేసవిలో చలువ కోసం తాటి ముంజల్ని తినడం చాలా అవసరం. ఈ పండులో క్యాలరీలు తక్కువ మొత్తంలో, శరీరానికి కావాల్సిన శక్తి ఎక్కువ మొత్తంలో ఉంటాయి.
- తాటి ముంజలు తింటే ఎండాకాలంలో వేడికి ముఖంపై వచ్చే చిన్న చిన్న మొటిమల నుంచి ఉపశమనం పొందొచ్చు.
- ముంజల్లో నీటి శాతం అధికంగా ఉండటం వల్ల వీటిని తింటే డీహైడ్రేషన్ సమస్య నుంచి ఉపశమనం పొందొచ్చు.
- వేసవిలో శరీరానికి కావాల్సిన ఖనిజాలు, చక్కెరలను ఇవి బ్యాలన్స్ చేస్తాయి. వీటిలో అధిక మొత్తంలో ఉండే విటమిన్ బి, ఐరన్, క్యాల్షియం శరీరానికి చాలా అవసరం.
- తాటి ముంజలు తినడం గర్భిణులకూ మంచిదే. ప్రెగ్నెన్సీ సమయంలో కొంతమందికి ఏది తిన్నా జీర్ణం కాదు. అలాంటి వారు ముంజల్ని తినాలి. ఫలితంగా జీర్ణవ్యవస్థ చురుగ్గా పనిచేస్తుంది.
అంతేకాకుండా.. ఈ సమయంలో ఎదురయ్యే మలబద్ధకం, ఎసిడిటీ లాంటి ఆరోగ్య సమస్యల్ని కూడా ముంజలు దూరం చేస్తాయి.
- తాటి ముంజల్లో శరీరానికి కావాల్సిన ఎ, బి, సి విటమిన్లు, ఐరన్, జింక్, ఫాస్ఫరస్, పొటాషియం.. వంటివి పుష్కలంగా ఉంటాయి. వీటిలో అధిక మొత్తంలో నీరు ఉండటం వల్ల శరీర బరువును తగ్గించడంలో ఇవి సహాయపడతాయి.
- ముంజలు చికెన్పాక్స్తో బాధపడే వారికి దురద నుంచి ఉపశమనం అందించి, శరీరాన్ని చల్లగా ఉంచుతాయి.
- తాటి ముంజలు కాలేయ సంబంధ సమస్యల్ని కూడా తగ్గిస్తాయి. ఈ పండులో అధిక మొత్తంలో ఉండే పొటాషియం మన శరీరంలో ఉండే విషపదార్థాలను
తొలగిస్తుంది.
- వివిధ రకాల ట్యూమర్స్, బ్రెస్ట్ క్యాన్సర్ కణాలను అభివృద్ధి చేసే ఫైటోకెమికల్స్, ఆంథోసయనిన్ లాంటి వాటిని నిర్మూలిస్తాయి. ఈ పండుని ఎక్కువగా తినడం వల్ల క్యాన్సర్ల నుంచి కూడా దూరంగా ఉండొచ్చు.
- శరీరానికి కావాల్సిన మినరల్స్, న్యూట్రియంట్ల శాతాన్ని బ్యాలన్స్ చేయడంలో కూడా ముంజలు కీలక పాత్ర పోషిస్తాయి.
- తాటి ముంజల పొట్టులో ఎన్నో రకాల పోషకాలుంటాయి. అనారోగ్యంతో బాధపడుతున్న
వారికి అవి చాలా అవసరం. అలాగే ఈ పొట్టు వల్లే శరీరానికి ఎక్కువ చలువ చేస్తుంది. కాబట్టి తాటి ముంజల్ని పొట్టు తీయకుండా తింటేనే ఆరోగ్యానికి మంచిది.
COMMENTS