షాకింగ్ న్యూస్... కస్టమర్లు ఆ పేమెంట్ చేస్తే డబ్బులు చెల్లించాలి..!2022
PhonePe Shocking News ... Customers have to pay money if they make that payment : Wallmart యొక్క డిజిటల్ పేమెంట్ యాప్ PhonePe వినియోగదారులకు షాక్కించింది. ఇప్పటి వరకు అన్ని రకాల ప్రెమెంట్స్ ని ఉచితంగా అఫర్ చేసిన ఫోన్ పే, ఇకనుండి 50 రూపాయల కంటే పైన చేసే మొబైల్ రీఛార్జ్ కోసం ఛార్జ్ చేస్తుంది. అంటే, రూ.50 పైబడిన రీఛార్జ్ ప్లాన్ ను రీఛార్జ్ చేసే ప్రతిసారి మీరు PhonePe ప్రోసెసింగ్ ఛార్జ్ చెల్లించాల్సి వస్తుంది. దీనికోసం 1 రూపాయి నుండి 2 రూపాయల వరకు ఛార్జ్ చేయనున్నట్లు తెలిపింది.
ఈ విధంగా UPI ఆధారిత ట్రాన్సాక్షన్ కోసం ఛార్జ్ వసులును ప్రారంభించిన మొట్టమొదటి డిజిటల్ పేమెంట్ యాప్ గా PhonePe నిలుస్తుంది. ఇతర పోటీదారు యాప్స్ ఇప్పటికి ఈ సర్వీస్ ను ఉచితంగానే అఫర్ చేస్తున్నాయి. అయితే, PhonePe యాజమాన్యం మాత్రం ఇది ఒక చిన్న ఎక్స్ పరిమెంట్ పనిగానే చెబుతోంది. కేవలం మొబైల్ రీఛార్జ్ విభాగంలో అవలంభిస్తున్న చిన్న ఎక్స్ పరిమెంట్ అని దీని గురించి పేర్కొంది.
ఇందులో, 50 రూపాయల కంటే తక్కువ రీఛార్జ్ పైన ఎటువంటి రుసుము కూడా ఛార్జ్ చేయదు. అయితే, 50 నుండి 100 రూపాయల వరకు చేసే రీఛార్జ్ పైన 1 రూపాయి, 100 పైబడిన రీఛార్జ్ పైన 2 రూపాయలు ప్రోసెసింగ్ ఫీజ్ క్రింద వసూలు చేస్తోంది. ఈ ప్రోసెసింగ్ ఫీజ్ గురించి PhonePe అధికారిక ప్రతినిధి వివరిస్తూ 'ఇది పూర్తిస్థాయి నిర్ణయం లేదా అప్డేట్ కాదు ఇది కేవలం ఎక్స్ పరిమెంట్' మాత్రమే అని తెలిపారు. ఎక్స్ పరిమెంట్
COMMENTS