రాత్రివేళ తలస్నానం చేసేవారికి అలర్ట్..ఆ డేంజర్
Alert for those who bath at night..that danger : తలస్నానం చేయడం జుట్టు ఆరోగ్యానికి చాలా మంచిది. వారానికి రెండు, మూడు సార్లు తలస్నానం చేయడం వల్ల జుట్టు శుభ్రపడడమే కాకుండా ఆరోగ్యకరంగా పెరుగుతుంది. అందంగా ఉంటుంది.
రాత్రుళ్లు తలస్నానం చేయడం వల్ల తల తడిగా ఉన్నప్పుడే పడుకుంటారు. అయితే, తడి జుట్టు త్వరగా ఊడుతుంది. పడుకున్న సమయంలో అటు ఇటూ తిరుగుతూ ఇష్టమైన పొజిషన్లో పడుకుంటారు. దీంతో జుట్టు ఎక్కువగా చిక్కుబడి ఊడిపోయే ప్రమాదం ఉంటుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి.
చాలా మంది ఉదయం వేళల్లో తలస్నానం చేసేందుకు టైమ్ లేదని సాయంత్రం సమయాల్లో చేస్తుంటారు.
దీని వల్ల ఉదయానికి తల ఆరుతుంది. చక్కగా టైమ్‌కి తయారై వెళ్లొచ్చు. అనుకుంటారు. కానీ, ఇది అంతగా మంచిది కాదని చెబుతున్నారు
నిపుణులు. ఎందుకంటే ఇలా స్నానం చేయడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. అదే విధంగా తలస్నానం చేసి రాత్రి పడుకున్నప్పుడు తలగడ, బెడ్‌కి వెంట్రుకలు ఎక్కువగా అంటుకుంటాయి. దీంతో అవి కూడా తడిగా మారి బ్యాక్టీరియా ఎక్కువగా తయారవుతుంది.
దీంతో జుట్టు సమస్యలు మరింత తీవ్రం అవుతాయి. దీంతో పాటు తడి జుట్టుతో రాత్రి వేళల్లో పడుకున్నప్పుడు జుట్టు మొత్తం ముద్దలా తయారవుతుంది.
కాబట్టి తలస్నానం ఉదయం వేళల్లోనే చేయడం మంచిది.
రాత్రి సమయాల్లో తలస్నానం చేసి పడుకోవడం వల్ల అలర్జీలు పెరిగి తలసమస్యలు ఎక్కువగా మారతాయి. ఎందుకంటే తలస్నానం చేయడం వల్ల జుట్టు తేమగా ఉండి చుండ్రు, జుట్టురాలడం,
ఇన్ఫెక్షన్స్ వంటి సమస్యలు ఎదురవుతాయి. ఇవన్నీ జుట్టు ఊడిపోవడానికి కారణంగా మారతాయి. రాత్రి వేళల్లో తడిజుట్టుతో పడుకోవడం అందానికే కాదు.. ఆరోగ్యానికి కూడా అంత మంచిది కాదు.. ఎందుకంటే ఇలా చేయడం వల్ల మైగ్రేన్, తలనొప్పి వంటి సమస్యలు వస్తాయి. సైనస్ ఉన్నవారికి కూడా ఇది అంత మంచిది కాదు.. తేమగా ఉండి నిద్రపోయిన సందర్భంలో ఆ ఎఫెక్ట్ తలపై ఎక్కువగా ఉంటుంది. ఈ కారణంగా ఆరోగ్య సమస్యలు కూడా ఎక్కువ అవుతాయి. కొన్ని సందర్భాల్లో రాత్రి సమయాల్లో కచ్చితంగా తలస్నానం చేయాల్సి వస్తుంది. అలాంటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మరిచిపోవుద్దు..
అవేంటంటే.. జుట్టు పూర్తిగా ఆరే వరకూ ఉండాలి. ఆ తర్వాత దువ్వుకోవాలి. తడి జుట్టుపైనే కండీషనర్, హెయిర్ సీరమ్‌ని రాయాలి. ఇలా చేయడం వల్ల జుట్టు అందంగా మారుతుంది.
COMMENTS