Bumper offer for Jio users! 100 GB free storage under welcome offer
జియో యూజర్లకు బంపర్ ఆఫర్ !! వెల్‌కమ్ ఆఫర్ కింద 100 జీబీ ఉచిత స్టోరేజీ.
రిలయన్స్ 47వ వార్షిక సాధారణ సమావేశం గురువారం జరిగింది. ఈ సందర్భంగా దాదాపు 35 లక్షల మంది వాటాదారులను ఉద్దేశించి ఛైర్మన్ ముకేశ్ అంబానీ ప్రసంగించారు.
ఫొటోలు, వీడియోలు, డాక్యుమెంట్ల వంటి డిజిటెల్ కంటెంట్‌ను జియో యూజర్లు భద్రంగా దాచుకునేలా జియో క్లౌడ్ స్టోరేజీని దీపావళి నుంచి ప్రారంభించనున్నట్లు చెప్పారు.
వెల్‌కమ్ ఆఫర్ కింద 100జీబీ క్లౌడ్ స్టోరేజీని ఉచితంగా అందిస్తున్నట్లు ముకేశ్ అంబానీ చెప్పారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను భారతదేశంలో ప్రతీ ఒక్కరికి అందుబాటులోకి తెస్తామని ప్రకటించారు.
కంపెనీలో జారీ చేసే అదనపు వాటాలను ఇప్పటికే ఉన్న షేర్ హోల్డర్లకు ఉచితంగా ఇవ్వడాన్ని బోనస్ ఇష్యూ లేదా బోనస్ షేర్లు అంటారు. ఇప్పటికే వాటాదారుల వద్ద ఉన్న షేర్ల ఆధారంగా దీనిని కేటాయిస్తారు. అంటే రిలయన్స్ వాటా ఒకటి ఉంటే.. బోనస్ వాటా ఒకటి లభించనుంది. షేర్‌హోల్డర్లకు 1:1 నిష్పత్తిలో బోనస్ వాటాలు ఇచ్చే ప్రతిపాదనను ఆమోదించేందుకు కంపెనీ బోర్డు సెప్టెంబర్ 5వ తేదీన సమావేశం కానుంది.
సెట్ టాప్ బాక్స్ కోసం జియో టీవీ ఓఎస్ !! కాల్‌లోనే AI సేవలు:
జియో ఫైబర్ ద్వారా అటు ఇంటర్నెట్‌తో పాటు డిజిటల్ ఛానెళ్లను అందిస్తున్న రిలయన్స్ జియో .. కొత్తగా జియో టీవీ ఓఎస్‌ను ప్రకటించింది. జియో సెట్ టాప్ బాక్స్ కోసం దీన్ని తీసుకొచ్చింది. 47వ వార్షిక సాధారణ సమావేశంలో భాగంగా ఆకాశ్ అంబానీ ఈ విషయం తెలిపారు. కొత్త జియో టీవీ ఓఎస్ ద్వారా 4కె యూహెచ్‌డీ, డాల్బీ అట్మాస్, డాల్బీ విజన్ సాధ్యమవుతుందని ఆకాశ్ అన్నారు. అంతేకాదు జియోటీవీ ఓఎస్‌లో భాగంగా సెట్ టాప్ బాక్స్ రిమోట్‌లోనే కొత్తగా ఏఐ బటన్ ఇస్తున్నారు. ‘హెలో జియో’ పేరిట దీన్ని తీసుకొచ్చారు.
వాయిస్ కమాండ్స్ ద్వారా సెట్ టాప్ బాక్స్‌ను కంట్రోల్ చేయొచ్చు. ఇందుకోసం రిమోట్‌లోనే ఓ మైక్ బటన్ ఇచ్చారు. వాల్యూమ్ తగ్గించడం, పెంచడం వంటివి చేయొచ్చు. అంతేకాదు.. అమెజాన్ ప్రైమ్, డిస్నీ+ హాట్‌స్టార్ వంటి యాప్స్‌ను కూడా యాక్సెస్ చేయొచ్చని తెలిపారు. అలాగే జియో ఫోన్‌కాల్ AI సర్వీసులనూ ప్రారంభిస్తున్నట్లు ఆకాశ్ అంబానీ ప్రకటించారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ నెంబర్ కేటాయించారు. ఈ కాల్‌లో కాల్స్‌ను రికార్డు చేసుకోవచ్చు. ఆ కాల్ రికార్డులు జియో క్లౌడ్‌లో ఆటోమేటిక్‌గా స్టోర్ అవుతాయి. కాల్ రికార్డును కావాలంటే వేరే భాషలో ట్రాన్స్‌స్క్రైబ్ చేసుకోవచ్చని ఆకాశ్ తెలిపారు. జియో క్లౌడ్ నుంచి ఎప్పుడైనా వీటిని వినియోగించుకోవచ్చని చెప్పారు.
COMMENTS