BSF Recruitment: Jobs in Border Security Force.. per month Rs. Chance to get salary more than 80 thousand.
BSF Recruitment: బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెలకు రూ. 80 వేలకు పైగా జీతం పొందే అవకాశం.
కేంద్ర ప్రభుత్వ సంస్థ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్‌లో పలు విభాగాల్లో ఉన్న హెడ్ కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్‌లో భాగంగామ మొత్తం 247 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* వీటిలో హెడ్ కానిస్టేబుల్ (రేడియో ఆపరేటర్) (217), హెడ్ కానిస్టేబుల్ (రేడియో మెకానిక్) (30) ఖాళీలు ఉన్నాయి.
పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టుల ఆధారంగా 60 శాతం మార్కులతో పదో తరగతి, ఐటీఐ లేదా ఇంటర్మీడియట్(ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్) ఉత్తీర్ణతతో పాటు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.
* అభ్యర్థుల వయసు 18 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను రాత పరీక్ష, ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్, డిక్టేషన్ టెస్ట్, పేరాగ్రాఫ్ రీడింగ్ టెస్ట్ (హెచ్‌సీ ఆర్‌వోలకు మాత్రమే), డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
* ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 25,500 నుంచి రూ. 81,100 వరకు చెల్లిస్తారు.
* ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణకు 12-05-2023ని చివరి తేదీగా నిర్ణయించారు.
* రాత పరీక్షను 04-06-2023 తేదీన నిర్వహించనున్నారు.
Important Links:
FOR NOTIFICATION CLICKHERE
FOR APPLY ONLINE CLICKHERE
COMMENTS