Traffic Rule: If you cut this traffic challan, you have to pay a huge fine. Otherwise, you have to go to jail for three years
Traffic Rule: ఈ ట్రాఫిక్ చలాన్ కట్ చేస్తే భారీ ఫైన్ కట్టాల్సిందే.. లేకుంటే మూడేళ్లు జైలుకు వెళ్లాల్సిందే.. అసలు ఈ రూల్స్ ఏంటంటే..
అది పల్లెటూరు అయినా.. నగరమైనా సరే ఈ రోజుల్లో టూ వీలర్స్, ఫోర్ వీలర్స్ అనే హాబీ చిన్నప్పటి నుంచి మొదలవుతుంది. మీ ఇంట్లో వాహనం ఉన్నప్పుడు ఇలాంటి సమస్య ఎక్కువగా ఉంటుంది. కొన్నిసార్లు తల్లిదండ్రులు తమ పిల్లలకు యుక్తవయస్సు రాకముందే వాహనం నేర్పడం మనం చాలా సార్లు చూస్తుంటాం. ఇది చట్టం ప్రకారం తప్పు మాత్రమే కాదు బాధ్యతారాహిత్యం కూడా.. ఎందుకంటే ఇలా నేర్పించిన తల్లిదండ్రులు.. ఆ తర్వాత ఏదైన అవసరం కోసం కానీ అలా తిరిగి రావడానికి తమ వాహనాలను ఇస్తుంటారు. ఏమైవుతందిలే.. డ్రైవ్ చేయడం వస్తుందిగా అని ధీమాగా ఉంటారు. ఇది ధీమా కాదు నేరం, జరగబోయే అనర్థాన్ని ముందుగా ఊహించరు తల్లిదండ్రులు. మైనర్ పిల్లవాడు వాహనం నడుపుతూ ప్రమాదాన్ని గురవుతే.. ఏ దైనా యాక్సిడెంట్ జరిగితే.. తర్వాత చింతించాల్సింది వారే.. ఈ విషయం తెలిసి కూడా వారికి నేర్పిస్తారు.. నడపమంటూ ప్రోత్సహిస్తారు. ఇలా చేయడం చట్ట ప్రకారం నేరం. ఆ మైనర్ వాహనం నడుపుతూ పట్టుబడితే భారీ చలాన్తోపాటు జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉంది.
బైకులు, కార్లు నడుపుతున్న యువకులు, మైనర్లు కొంతమంది తల్లిదండ్రులతో పోట్లాడి ద్విచక్రవాహనాలను కొనాలంటూ ఒత్తిడి తెస్తుంటారు. తాము కాలేజీకి బస్సులో వెళ్తున్నామని.. స్నేహితులంతా బైకుల్లో వస్తుండటంతో తమ పరువు పోతోందని ఇంట్లో గోల పెడుతున్నవారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది.
ఎంత వరకు ఫైన్ పడొచ్చంటే..
18 ఏళ్లు నిండని పిల్లలు ఎవరైనా వాహనం నడుపుతూ పట్టుబడి.. చట్టం ప్రకారం వారిపై అధికారులు చర్యలు తీసుకుంటారు. మైనర్ వ్యక్తులు లెర్నింగ్ లైసెన్స్ లేకుంటే, మోటారు వాహనాల చట్టం, 1988లోని సెక్షన్ 199A ప్రకారం వాహనం ఎవరి పేరు మీద రిజిస్టర్ చేయబడిందో వారికి రూ. 25,000 వరకు జరిమానా పడుతుంది. జరిమానాతోపాటు జైలు శిక్ష విధించబడుతుంది. జైలు శిక్ష 3 సంవత్సరాలపాటు శిక్ష విధించే రూల్ కూడా ఉంది.
ఇక్కడ నియమం ఉంది:
మోటారు వాహనాల చట్టం ప్రకారం, 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు చెల్లుబాటు అయ్యే లైసెన్స్ లేకుండా 50 సిసి కంటే ఎక్కువ ఇంజిన్ ఉన్న వాహనాన్ని నడపలేరు. వాహనం ఇంజిన్ పవర్ కెపాసిటీ 50సీసీ కంటే ఎక్కువగా ఉంటే లెర్నింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. అదే సమయంలో.. ఎవరైనా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాన్ని గంటకు 25 కిమీ వేగంతో నడపవచ్చు. దీనికి ఎలాంటి లైసెన్స్ లేదా రిజిస్ట్రేషన్ అవసరం లేదు. కానీ, పిల్లవాడు చాలా చిన్నగా ఉండి.. డ్రైవ్ చేయలేకపోతే.. పిల్లల భద్రతతో పాటు ఇతరుల భద్రతను దృష్టిలో ఉంచుకోవడం తల్లిదండ్రుల బాధ్యత అవుతుంది. పిల్లలు చట్టం నిర్దేశించిన వయోపరిమితిని దాటితే తప్ప, వాహనం నడపడానికి అనుమతించకూడదు.
COMMENTS