Whatsapp Trick: టైప్ చెయ్యకుండానే మెసేజెస్ పంపించాలా..!2022
Whatsapp Trick: Send messages without typing: ఈ స్మార్ట్ రోజుల్లో కూడా చాటింగ్ చెయ్యాలంటే టైపింగ్ వాడుతున్నారా? వాస్తవానికి, టైప్ చెయ్యకుండానే మీరు మీకు కావలసిన సందేశాన్ని పంపించవచ్చు. దీనికోసం మీరు మీ ఫోన్ లో ఉండే అసిస్టెంట్ ఫీచర్ ను ఉపయోగించుకోవచ్చు. ఇప్పటికే మీరు మీ వాట్సాప్ లో ఈ ఫీచర్ ను ఉపయోగిస్తుంటే చాలా మంచిది. ఒకవేళ మీకు కనుక ఈ ఫీచర్ ను మీ ఫోన్ లో మీ వాట్సాప్ తో ఎలా ఉపయోగించాలో తెలియక పొతే, ఇక్కడ నుండి ఈజీగా తెలుసుకోవచ్చు మరియు మీరు కూడా మీ వాట్సాప్ మెసేజిలను టైప్ చెయ్యకుండానే పంపించవచ్చు.
ముందుగా, ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లలో గూగుల్ అసిస్టెంట్ మరియు iOS ఫోన్లలో సిరి సహాయంతో మెసెసింగ్ యాప్ ఒపెన్ చెయ్యకుండానే మెసేజిలను పంపించవచ్చు. అలాగే, మెసేజింగ్ యాప్ తెరవకుండానే మెసేజిలను చదివే అవకాశం వుంది. ఇప్పుడు సరిగ్గా ఇలాంటి ఫీచర్ ను వాట్సాప్ కూడా తీసుకొచ్చింది
మీ వాట్సాప్ లో ఈ ఫీచర్ ను యాక్టివేట్ చెయ్యాలనుకుంటే గూగుల్ యస్ మరియు వాట్సాప్ నోటిఫికేషన్ లకు యాక్సెస్ ఇవ్వాల్సివుంటుంది. ఒకవేళ మీకు ఈ ఫీచర్ అవసరం లేదనుకుంటే సెట్టింగ్ లోకి వెళ్లి ఎప్పుడైనా యాక్సెస్ ను నిలిపి వేయవచ్చు. మీ ఫోన్లో ఈ ఫీచర్ ను యాక్టివేట్ చెయ్యాలనుకుంటే ఈ క్రింద విధంగా చేయండి.
వాట్సాప్ లో ఈ ఫీచర్ కోసం ఇలా చేయండి:
ముందుగా మీ ఫోన్లో గూగుల్ అసిస్టెంట్ ను యాక్టివేట్ చేయాలి. గూగుల్ అసిస్టెంట్ యాక్టివేట్ అయిన తరువాత మీరు మీ కాంటాక్ట్స్ లో ఎవరికి వాట్సాప్ మెసేజ్ పంపించాలనుకుంటున్నారో సూచించండి. తరువాత, గూగుల్ అసిస్టెంట్ మీరు ఏ సందేశం పంపాలనుకుంటున్నారో, లేదా మీరు ఏమి రాయాలనుకుంటున్నారో అడుగుతుంది. తరువాత, వర్చువల్ అసిస్టెంట్ మీరు చెప్పిన టైప్ చేసి చూపుతుంది. ఈ మెసేజ్ ను Send చెయ్యమని చెప్పిన వెంటనే మెసేజ్ సెండ్ చేయబడుతుంది.
COMMENTS