WARDS IN NEW MUNICIPALITIES
కొత్త మున్సిపాల్టీల్లో వార్డు విభజన - నేడే నోటిఫికేషన్
వార్డుల విభజనకు నేడు నోటిఫికేషన్ ఇవ్వనున్న మున్సిపల్ కమిషనర్లు - కొత్త మున్సిపాల్టీల్లో వార్డుల విభజనకు ఇవాళ నోటిఫికేషన్ - 18 నూతన పురపాలకసంఘాల్లో వార్డులు విభజన ప్రక్రియ.
Division of Wards in New Municipalities Notification : రాష్ట్రంలోని కొత్త మున్సిపాల్టీల్లో వార్డుల విభజనకు కసరత్తు మొదలైంది. ప్రతిపాదనలు తయారు చేసిన పురపాలక శాఖ ఇవాళ నోటిఫికేషన్ ఇవ్వనుంది. రాష్ట్రవ్యాప్తంగా 18 నూతన మున్సిపాల్టీలను ప్రభుత్వం ఇటీవల ఏర్పాటు చేసింది. మరో 5 కార్పొరేషన్లు, 7 మున్సిపాల్టీల్లో సమీప గ్రామాలు విలీనమయ్యాయి. కొత్త మున్సిపాల్టీలు, విలీనమైన ప్రాంతాల్లో వార్డుల ఏర్పాటు కోసం ఇవాళ నోటిఫికేషన్ విడుదల చేసి 19 రోజుల్లో ప్రక్రియ పూర్తి చేసేలా షెడ్యూలు నిర్ణయించారు.
ఈనెల 11 వరకు ప్రజలు, ప్రజాప్రతినిధుల నుంచి అభ్యంతరాలను స్వీకరించనున్నారు. ఈనెల 12 నుంచి 16 వరకు అభ్యంతరాలను పరిశీలించి పరిష్కరిస్తారు. ఈనెల 17, 18 తేదీల్లో వార్డుల విభజనను ఆమోదించిందేందుకు కలెక్టర్లకు పంపిస్తారు. కలెక్టర్లు ఆమోదించిన జాబితాను ఈనెల 18న పురపాలక శాఖ కమిషనర్‌కు, 19న ప్రభుత్వానికి నివేదిక పంపిస్తారు. కొత్త వార్డులపై ఈనెల 21న తుది నోటిఫికేషన్ ఇవ్వనున్నారు.
ఓఆర్ఆర్ లోపల ఉన్న మున్సిపాల్టీలు వాయిదా :
అవుటర్ రింగు రోడ్డు లోపల ఉన్న మున్సిపాల్టీల్లో వార్డుల విభజనను పక్కన పెట్టారు. ఓఆర్ఆర్ వరకు ఉన్న మున్సిపాల్టీలను కార్పొరేషన్లుగా ఏర్పాటు చేసి.. పట్టణ పునర్వ్యవస్థీకరణ చేయాలని.. ప్రభుత్వం భావిస్తున్నందున అక్కడ వార్డుల విభజనను వాయిదా వేయాలని నిర్ణయించారు. కొత్త మున్సిపాల్టీల్లో వార్డుల విభజన తర్వాత.. జూన్ నెలాఖరు వరకు రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేసి.. ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని పురపాలక శాఖ భావిస్తోంది.
COMMENTS