You can get rid of the smell of utensils with things you have at home. Do you know how?
ఇంట్లో ఉండే వాటితోనే పాత్రల వాసన పోగొట్టొచ్చు.. ఎలాగో తెలుసా..?
నిమ్మకాయ తొక్కలో సహజమైన తీపి వాసన ఉంటుంది. ఇది దుర్వాసనను పోగొట్టడంలో సహాయపడుతుంది. ముందు ఒక పాత్రలో నీళ్లు పోసి మరిగించాలి. ఆ నీళ్లలో నిమ్మకాయ తొక్క వేయాలి. పాత్రలో దుర్వాసన ఎక్కువగా ఉంటే 15 నుండి 20 నిమిషాలు మరిగించాలి. అలా చేసిన తర్వాత నీళ్లతో పాత్రను శుభ్రంగా కడిగితే వాసన పూర్తిగా పోతుంది.
లవంగాల్లో సహజ యాంటీసెప్టిక్ లక్షణాలు ఉంటాయి. ఇవి బాక్టీరియా, దుర్వాసనను తగ్గించడంలో సహాయపడతాయి. దుర్వాసనతో ఇబ్బంది ఇస్తున్న పాత్రలో కొన్ని లవంగాలు వేసి నీళ్లు పోయాలి. ఈ నీళ్లు బాగా మరిగించాలి. తర్వాత ఆ నీళ్లతో పాత్రను శుభ్రం చేస్తే దుర్వాసన తగ్గిపోతుంది. ఈ విధానం చాలా సులభంగా పనిచేస్తుంది.
పుదీనా ఆకుల వాసన శక్తివంతంగా ఉంటుంది. ఇది దుర్వాసనను తగ్గించడంలో సహాయపడుతుంది. ఒక పాత్రలో కొద్దిగా నీళ్లు పోసి కొన్ని పుదీనా ఆకులు వేసి మరిగించాలి. ఆ నీళ్లను దుర్వాసన ఉన్న పాత్రలో వేసి కొంతసేపు ఉంచాలి. తర్వాత కడిగితే ఫ్రెష్ వాసన వస్తుంది.
కాఫీ పొడిలో ఉండే వాసన పదార్థాలు దుర్వాసనను తుడిచిపెట్టేస్తాయి. గోరువెచ్చని నీళ్లు తీసుకొని దుర్వాసన ఉన్న పాత్రలో పోయాలి. ఆ నీళ్లలో కాఫీ పొడి చల్లి శుభ్రం చేయాలి. కొన్ని నిమిషాల పాటు అలా ఉంచిన తర్వాత కడిగితే వాసన తొలగిపోతుంది.
వెనిగర్ లో సహజమైన యాసిడిటీ ఉంటుంది. ఇది మరకలు తొలగించడంలో తోడ్పడుతుంది. దుర్వాసన ఉన్న పాత్రలో తగినంత నీళ్లు పోసి అందులో కొద్దిగా వెనిగర్ కలిపి కొంతసేపు నానబెట్టాలి. తర్వాత కడిగితే దుర్వాసనతో పాటు మొండి మరకలు కూడా పోతాయి.
బేకింగ్ సోడా ఎలాంటి వాసన అయినా తటస్థం చేసే శక్తి కలిగి ఉంటుంది. పాత్రలో కొద్దిగా బేకింగ్ సోడా చల్లి, వేడి నీళ్లు పోయాలి. దాన్ని 15 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. తర్వాత ఎప్పటిలా కడిగితే మిగిలిన దుర్వాసన పూర్తిగా పోతుంది.
నిమ్మరసం సహజమైన క్లీనింగ్ లక్షణాలు కలిగి ఉంటుంది. దుర్వాసన ఉన్న పాత్రపై నిమ్మరసాన్ని రుద్దాలి. కొన్ని నిమిషాలు అలాగే ఉంచాలి. తర్వాత కడిగితే పాత్రలో తీపి, తాజా వాసన మిగిలి ఉంటుంది. ఇది సహజమైన మార్గం కావడం వల్ల ఆరోగ్యానికి హానికరం కాదు.
ఇవి ఇంట్లో అందరికీ అందుబాటులో ఉండే పదార్థాలు. వేరే ఎలాంటి ఖర్చు లేకుండా ఈ పద్ధతులు ప్రయత్నించవచ్చు. ఒక్కసారి ఈ చిట్కాలు పాటించి చూడండి. వంట పాత్రలు ఎప్పుడూ తాజాగా ఉంటాయి.
COMMENTS