Babies who eat their mother's flesh immediately after birth.
ఈ జీవి సృష్టిలో విచిత్రమైనది సుమా.. పుట్టిన వెంటనే తల్లి మాంసాన్ని తినేసే పిల్లలు.
భూమి మీద పడిన వెంటనే తనకు జన్మ నిచ్చిన తల్లిని తినే జీవి ఉందని తెలుసా.. మాంసాహార జీవులైన చిరుత, సింహం పులి వంటివి కావు. ఒక చిన్న జీవి.. తనకు జన్మనిచ్చిన తల్లిని తినేస్తుంది. అది భూమి మీద ఉన్న విషపు జీవుల్లో ఒకటి. అంతేకాదు వీటి విషం అత్యంత ఖరీదైనది. ఒక లీటరు విషం కోట్లాది రూపాయలు విలువ జేస్తుంది. ఎందుకంటే మనుషులకు వచ్చే అనేక వ్యాధులను ఈ చిన్న జీవి విషం తో చేసే మందులు నయం చేస్తాయట. అదేమిటో కాదు… గోడ మీద బొమ్మ గొలుసుల బొమ్మ.. వచ్చిపోయేవారికి వడ్డించే బొమ్మ అని చిన్నతనంలో చెప్పుకునే పొడుపు కదని విప్పితే సమాధానం వచేస్తుంది.
అవును భూమి మీద విషపూరితమైన జీవుల్లో ఒకటి తేళ్లు. వీటిల్లో సుమారు 2000 జాతులు ఉన్నాయి. ఒక తేలు మిమ్మల్ని కరిస్తే, మీరు సాధారణంగా చనిపోరు. అయితే విపరీతమైన నొప్పిని అనుభవిస్తారు. అయితే మధ్య, దక్షిణ అమెరికాల్లో నివసించే మార్కాటాక్సిన్ తేళ్లు మాత్రం అత్యంత ప్రమాదకరమైనవి. వీటి విషంతో వైద్యం కూడా చేస్తున్నారు. కొత్త రక్తకణాల ఏర్పాటుకు, గుండె బైపాస్ శస్త్రచికిత్సకి ఉపయోగించే విషయంపై పరిశోధనలు చేస్తున్నారు. అయితే ఏ వాతావరణంలోనైనా జీవించగల తేలు సంవత్సరానికి ఒకసారి తిని బతుకుతుంది. ఆహారం అందుబాటులో లేకపోతే జీర్ణక్రియ మందగిస్తుంది. తేలు విషం నుంచి మందులు తయారు చేస్తారు. తేలు విషానికి మన వ్యాధులను నయం చేసే శక్తి ఉంది. అందుకే తేలు విషానికి అధిక డిమాండ్ ఉంది. ప్రస్తుతం ఒక గ్రాము తేలు విషం 80,000 రూపాయల వరకు అమ్ముడవుతోంది. అంటే లీటరు తేలు విషం ధర రూ. 80 కోట్లు. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన విషంగా ఖ్యాతిని సంపాదించింది. అందుకే టర్కీలోని ప్రయోగశాలలలో తేళ్లను పెంచుతున్నారు.
తేలు ఆకారం వింతగా ఉండటమే కాదు.. దీని జీవన విధానం కూడా వింతగా ఉంటుంది. ఇక ఆడ తేలు ఒకేసారి అనేక పిల్లలకు జన్మనిస్తుంది. ఈ పిల్లలు పుట్టిన వెంటనే తల్లి భుజం మీదకు ఎక్కుతాయి. తన పిల్లలని మోస్తున్న తల్లికి పిల్లలు వేసే శిక్ష ఏమిటో తెలుసా..
పుట్టిన కొద్ది సేపటికే తల్లి మీదకు ఎక్కిన పిల్ల తేళ్లు .. తల్లి మాంసాన్ని తినడం మొదలు పెడతాయి. తల్లి మరణించేవరకు అలా శరీరాన్ని తింటూనే ఉంటాయట ఈ పిల్ల తేళ్ళు. ఇలా ఎందుకు అంటే అదే ప్రకృతిలోని జీవుల జీవన ధర్మం అని చెప్పాలేమో..
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)
COMMENTS