UPSC- National Defence Academy & Naval Academy Examination (II)-2025
UPSC NDANA 2025: యూపీఎస్సీ- నేషనల్ డిఫెన్స్ అకాడమీ & నావల్ అకాడమీ ఎగ్జామినేషన్ (II)-2025.
దేశ రక్షణలో భాగస్వాములు కావాలని ఆశించే యువతరానికి.. దేశానికి సేవ చేయడంతోపాటు మంచి ఉద్యోగ జీవితంలో స్థిరపడాలనుకునే వారికి ఇలాంటి ఉద్యోగాలు చక్కటి అవకాశాలు. ఈ ఖాళీల భర్తీకి యూపీఎస్సీ ఏటా రెండుసార్లు నేషనల్ డిఫెన్స్ అకాడమీ అండ్ నేవల్ అకాడమీ (ఎన్డీఏ అండ్ ఎన్ఏ) (నోటిఫికేషన్ నం. 10/2025-NDA-II) పేరుతో పరీక్షలు నిర్వహిస్తోంది. 2025 సంవత్సరానికి రెండో విడత నోటిఫికేషన్ వెలువడింది. దీని ద్వారా త్రివిధ దళాల విభాగాల్లో 1 జులై 2026 నుంచి ప్రారంభమయ్యే 156వ కోర్సులో, 118వ ఇండియన్ నేవల్ అకాడమీ(ఐఎన్ఏసీ) కోర్సులో ప్రవేశాలు పొందవచ్చు. కోర్సు విజయవంతంగా పూర్తి చేస్తే ఉద్యోగాలు ఇస్తారు. అర్హత, ఆసక్తి ఉన్న అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు యూపీఎస్సీ ఆన్లైన్ అప్లికేషన్ పోర్టల్ ద్వారా ఆన్లైన్లో జూన్ 17వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి.
ప్రకటన వివరాలు...
* యూపీఎస్సీ- నేషనల్ డిఫెన్స్ అకాడమీ & నావల్ అకాడమీ ఎగ్జామినేషన్ (2)-2025
మొత్తం ఖాళీలు: 406
1. నేషనల్ డిఫెన్స్ అకాడమీ (NDA): 370 పోస్టులు
ఆర్మీ వింగ్: 208 (మహిళలకు 10 సహా)
నేవీ వింగ్: 42 (మహిళలకు 05 సహా)
ఎయిర్ ఫోర్స్ వింగ్: 120
* ఫ్లయింగ్ బ్రాంచ్: 92 (మహిళలకు 02 సహా)
* గ్రౌండ్ డ్యూటీలు (టెక్): 18 (మహిళలకు 02 సహా)
* గ్రౌండ్ డ్యూటీలు (నాన్-టెక్): 10 (మహిళలకు 02 సహా)
2. నావల్ అకాడమీ (10+2 క్యాడెట్ ఎంట్రీ స్కీమ్): 36 పోస్టులు
* మొత్తం: 36 (మహిళలకు 04 సహా)
అర్హత: ఆర్మీ వింగ్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు ఏదైనా గ్రూపులో ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి. ఎయిర్ ఫోర్స్, నేవీ పోస్టులకు 10+2 క్యాడెట్ ఎంట్రీ స్కీమ్ (ఇండియన్ నేవల్ అకాడమీ) ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే ఫిజిక్స్, మ్యాథ్స్ సబ్జెక్టులతో ఇంటర్ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. దీంతోపాటు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు ఉండాలి. ప్రస్తుతం ద్వితీయ సంవత్సరం చదువుతున్నవారూ అర్హులే.
వయోపరిమితి: అభ్యర్థులు 1 జనవరి, 2007కి ముందు, 1 జనవరి, 2010కి తర్వాత పుట్టి ఉండకూడదు.
ఎంపిక విధానం: అభ్యర్థుల ఎంపిక రెండు దశల్లో జరుగుతుంది. రాత పరీక్ష, ఇంటెలిజెన్స్- పర్సనాలిటీ టెస్ట్, ఎస్ఎస్బీ టెస్ట్/ ఇంటర్వ్యూ, మెడికల్ టెస్టు తదితరాల ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. రాత పరీక్ష(ఆబ్జెక్టివ్)లో రెండు పేపర్లు ఉంటాయి. మొత్తం 900 మార్కులకు నిర్వహిస్తారు. పేవర్-1 మ్యాథమేటిక్స్- 300 మార్కులు (సమయం రెండున్నర గంటలు), పేపర్-2 జనరల్ ఎబిలిటీ- 600 మార్కులుంటాయి(సమయం రెండున్నర గంటలు). రుణాత్మక మార్కులుంటాయి. రాత పరీక్షలో అర్హత పొందిన వారికి సర్వీస్ సెలక్షన్ బోర్డు(ఎస్ఎస్బీ) ఆధ్వర్యంలో యూపీఎస్సీ ఇంటెలిజెన్స్ అండ్ పర్సనాలిటీ టెస్టులు నిర్వహిస్తుంది. ఈ విభాగానికీ 900 మార్కులు కేటాయించారు. ఇందులో ఆఫీసర్స్ ఇంటెలిజెన్స్ రేటింగ్, పిక్చర్ పర్సెప్షన్ అండ్ డిస్ర్కిప్షన్ టెస్ట్ నిర్వహిస్తారు. ఇందులో అర్హత సాధించిన వారికి ఇంటర్వ్యూ, గ్రూప్ టెస్టులు, గ్రూప్ డిస్కషన్ తదితర టాస్కులు నిర్వహిస్తారు. రాత పరీక్ష, ఎస్ఎస్బీ నిర్వహించిన ఇంటర్వ్యూలో వచ్చిన మొత్తం మార్కుల ఆధారంగా తుది ఎంపికలు జరుగుతాయి.
కోర్సులు: నేషనల్ డిఫెన్స్ అకాడమీ అండ్ నేవల్ అకాడమీ (ఎన్డీఏ అండ్ ఎన్ఏ), ఆర్మీ 10+2 టెక్నికల్ ఎంట్రీ, నేవీ 10+2 బీటెక్ క్యాడెట్ ఎంట్రీ పరీక్షలో మెరిట్ సాధిస్తే డిగ్రీ కోర్సులకు ఎంపికవుతారు. అలా ఎంపికైనవారు బీఏ, బీఎస్సీ, బీటెక్ కోర్సుల్లో తాము ఎంచుకున్న దాన్ని ఉచితంగా చదవచ్చు.
శిక్షణ: తుది అర్హత సాధించిన అభ్యర్థులు నేషనల్ డిఫెన్స్ అకాడమీ, పుణెలో చదువు, శిక్షణ పొందుతారు. అనంతరం ఆర్మీ క్యాడెట్లను దేహ్రాదూన్‌లోని ఇండియన్ మిలటరీ అకాడమీకి; నేవల్ క్యాడెట్లను ఎజిమలలోని ఇండియన్ నేవల్ అకాడమీకి; ఎయిర్ ఫోర్స్ క్యాడెట్లను హైదరాబాద్‌లోని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అకాడమీకి సంబంధిత ట్రేడ్ శిక్షణ కోసం పంపుతారు. అభ్యర్థి ఎంపికైన విభాగాన్ని బట్టి ఈ శిక్షణ ఏడాది నుంచి 18 నెలల వరకు ఉంటుంది. కోర్సు విజయవంతంగా పూర్తి చేసుకున్న అభ్యర్థులను ఉద్యోగాల్లోకి తీసుకుంటారు. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్సులో ప్రారంభ స్థాయి ఆఫీసర్ ఉద్యోగాలైన లెఫ్టినెంట్, సబ్-లెఫ్టినెంట్, ఫ్లయింగ్ ఆఫీసర్/ గ్రౌండ్ డ్యూటీ ఆఫీసర్ హోదాతో కెరియర్ ప్రారంభం అవుతుంది.
దరఖాస్తు విధానం: దరఖాస్తులను https://upsconline.nic.inలో ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
* కొత్త దరఖాస్తు పోర్టల్ 2025 మే 28 నుంచి అమలులోకి వస్తున్నట్లు యూపీఎస్సీ పేర్కొంది.
New Portal Usage: Candidates must freshly register via the new Online Application Portal (Account Creation → Universal Registration → CAF → Exam-Specific Module).
దరఖాస్తు రుసుం: రూ.100 (ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది).
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: అనంతపురం, హైదరాబాద్, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, హనుమకొండ (వరంగల్ అర్బన్).
ముఖ్య తేదీలు..
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: 28-05-2025.
దరఖాస్తుకు చివరి తేదీ: 17-06-2025.
పరీక్ష తేదీ: 14-09-2025.
కోర్సు ప్రారంభం: 01-07-2026.
యూపీఎస్సీ- కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (1), 2025
ముఖ్యాంశాలు:
* యూపీఎస్సీ- నేషనల్ డిఫెన్స్ అకాడమీ అండ్ నేవల్ అకాడమీ (ఎన్డీఏ అండ్ ఎన్ఏ) 2025 సంవత్సరం రెండో విడత నోటిఫికేషన్ వెలువడింది.
* అర్హులైన అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు జూన్ 17వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
* ఆధార్ కార్డును ఐడీ పత్రంగా యూపీఎస్సీ సిఫార్సు చేసింది. (అభ్యర్థులు ఆధార్‌కార్డును తమ గుర్తింపు పత్రంగా ఉపయోగించాలి. ఇది గుర్తింపు వెరిఫికేషన్, ఆథెంటికేషన్లు సులువుగా పూర్తయ్యేందుకు ఉపయోగపడుతుంది. అన్ని పరీక్షలకూ శాశ్వతమైన, ఏకరూపమైన గుర్తింపుగా ఉపయోగపడుతుంది)
* దరఖాస్తు ఒకసారి సమర్పించిన తరువాత ఉపసంహరణకు అనుమతిలేదు.
Important Links:
FOR NOTIFICATION CLICKHERE.
FOR WEBSITE CLICKHERE.
FOR APPLY CLICKHERE.
FOR LATEST JOB NOTIFICATIONS CLICKHERE
COMMENTS