Punjab & Sindh Bank Jobs
Punjab and Sind Bank: పంజాబ్ &సింధ్ బ్యాంక్‌లో ఉద్యోగాలు.
భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన పంజాబ్ & సింధ్ బ్యాంక్ ఒప్పంద ప్రాతిపదికన MSME రిలేషన్షిప్ మేనేజర్ల పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. నైపుణ్యం కలిగిన నిపుణుల ద్వారా MSME వ్యాపార కార్యకలాపాలను మెరుగుపరచడం ఈ నియామక ప్రక్రియ లక్ష్యం. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు జూన్ 18వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
పోస్ట్ పేరు- ఖాళీలు:
* MSME రిలేషన్షిప్ మేనేజర్: 30
(యూఆర్: 13; ఈడబ్ల్యూఎస్: 03; ఓబీసీ: 08; ఎస్సీ: 04; ఎస్టీ: 02)
విద్యార్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
ప్రాధాన్యం: మార్కెటింగ్ లేదా ఫైనాన్స్‌లో పూర్తికాల ఎంబీఏ చేసిన వారికి ప్రాధాన్యం ఇస్తారు.
పని అనుభవం: భారతదేశంలోని ఏదైనా బ్యాంక్, NBFC లేదా ఆర్థిక సంస్థలో MSME బ్యాంకింగ్‌లో రిలేషన్షిప్ మేనేజర్‌గా కనీసం 3 సంవత్సరాల అనుభవం.
వయోపరిమితి: 01.05.2025 తేదీ నాటికి 25 - 35 ఏళ్లు ఉండాలి. అభ్యర్థి 02.05.1992, 01.05.2000 (ఈ తేదీలతో సహా) మధ్య జన్మించి ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఉద్యోగ ప్రదేశం: భారతదేశంలో ఎక్కడైనా (బ్యాంక్ నిర్ణయం మేరకు).
ఒప్పంద నిబంధనలు:
* ప్రారంభ నియామకం: 1 సంవత్సరం
* పనితీరు ఆధారంగా 3 సంవత్సరాల వరకు పొడిగించవచ్చు.
* జీతం: అర్హతలను అనుసరించి నిర్ణయిస్తారు.
* ప్రొబేషన్ కాలం: 6 నెలలు
* సిబిల్ స్కోర్ అవసరం: కనీసం 650
ఉద్యోగ బాధ్యతలు:
- * MSME వ్యాపార విస్తరణ
- * క్లయింట్లతో సంబంధాలను పెంపొందించడం
- * క్లయింట్ల సమగ్ర పరిశీలన (Due diligence)
- * బ్యాంకింగ్ ఉత్పత్తుల క్రాస్-సెల్లింగ్
- * పోటీదారులు, మార్కెట్ విశ్లేషణ
- * MSME ఆన్‌బోర్డింగ్‌లో బ్రాంచ్ కార్యకలాపాలకు మద్దతు
దరఖాస్తు ప్రక్రియ: ఆన్లైన్ ద్వారా.
దరఖాస్తు ఫీజు: జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.850. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ.100.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, స్క్రీనింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా.
ముఖ్యమైన తేదీలు:
* ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం: 29 మే 2025.
* దరఖాస్తు చేయడానికి చివరి తేదీ: 18 జూన్ 2025.
మరికొన్ని ముఖ్యాంశాలు:
- * దరఖాస్తు చేయడానికి ముందుఅర్హతలను చెక్ చేసుకోండి.
- * కనీసం 650 సిబిల్ స్కోర్ ఉండాలి.
- * నోటిఫికేషన్ లో పేర్కొన్న ప్రకారంస్కాన్ చేసిన పత్రాలనుసిద్ధం చేసుకోండి.
- * సరైనవ్యక్తిగత వివరాలతో దరఖాస్తు చేయండి. అప్లై చేసిన తర్వాత ఎటువంటి మార్పులు అనుమతించరు.
- * ఒకటి కంటే దరఖాస్తులు చేయకూడదు. ఆ విధంగా చేస్తే దరఖాస్తు తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంది.
Important Links:
FOR NOTIFICATION CLICKHERE.
FOR WEBSITE CLICKHERE.
FOR LATEST JOB NOTIFICATIONS CLICKHERE
COMMENTS