ADARSHA VIDYALAYA NOTIFICATION 2025
ఆదర్శ పాఠశాలల్లో ఇంటర్ ప్రవేశాలు - కార్పొరేట్ స్థాయిలో విద్య, వసతి.
ఆదర్శ పాఠశాలల్లో ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలు - ఇంటర్‌లో దరఖాస్తులకు 20 తుది గడువు- రిజర్వేషన్, మెరిట్ ఆధారంగా ఎంపిక.
Adarsha Vidyalaya Notification 2025 : కార్పొరేట్ స్థాయిలో ఇంగ్లీష్ మీడియంలో బోధనకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆదర్శ పాఠశాలలు పేద విద్యార్థులకు బాసటగా నిలుస్తున్నాయి. 6-10వ తరగతితోపాటు ఇంటర్ విద్యను ఫ్రీగా అందిస్తుండటంతో గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారు. రాబోయే విద్యా సంవత్సరంలో వీటిలో ఇంటర్ ప్రథమ సంవత్సర ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.
వారందరికి వసతి గృహం : 2013 జూన్లో ఆదర్శ పాఠశాలలను ప్రభుత్వం ప్రారంభించింది. ఇందులో 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు ఇంగ్లీష్ మీడియంలో బోధిస్తున్నారు. పదో తరగతి పాటు ఇంటర్‌లో ఉత్తమ ఫలితాలు సాధించడంలో జిల్లాల వారీగా మిగిలిన ప్రభుత్వ విద్యాలయాలతో పోలిస్తే ఆదర్శ పాఠశాలలు ముందంజలో నిలిచాయి. ఫలితంగా తల్లిదండ్రులు తమ పిల్లలను వాటిల్లో చేర్పించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. వీటిలో 9,10 తరగతులతో పాటు ఇంటర్ చదువుతున్న బాలికలకు వసతి సౌకర్యం కల్పిస్తున్నారు. వసతి గృహానికి 3 కిలో మీటర్ల నుంచి ఆపై దూరంగా గలవారికి ఈ వసతి సదుపాయముంది.
పూర్తి వివరాలు :
ఆదర్శ పాఠశాలల్లో ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలను ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఈ నెల 20న చివరి తేదీగా ప్రకటించారు.
22న దరఖాస్తుల పరిశీలనతో పాటు ఎంపికైన వారి జాబితాను సిద్ధం చేయనున్నారు.
రిజర్వేషన్, మెరిట్ ఆధారంగా 26న ఎంపికైనవారి జాబితాను ప్రదర్శిస్తారు.
27 నుంచి 31వ వరకు విద్యార్హత ధ్రువపత్రాలను పరిశీలించి ప్రవేశాలు కల్పిస్తారు. జూన్ 2 నుంచి తరగతులు ప్రారంభంకానున్నాయి.
ప్రతి గ్రూపులో 40 సీట్ల చొప్పున 4 గ్రూపుల్లో 160 మందికి ప్రవేశాలు ఉంటాయి.
పదో తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక చేయనుండగా, అల్పాదాయ వర్గాలవారికి ప్రాధాన్యతనిస్తారు.
COMMENTS