TS Inter Results 2025
ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ ఫలితాలు వచ్చేశాయ్.. రిజల్ట్స్ ఇక్కడ చెక్ చేసుకోండి.
Telangana Inter Results 2025: దాదాపు నెల రోజులుగా లక్షలాది మంది విద్యార్ధులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ఇంటర్ ఫలితాలు మంగళవారం (ఏప్రిల్ 22) మధ్యాహ్నం 12 గంటలకు విడుదలైనాయి. ఈ మేరకు రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఫలితాలు విడుదల చేశారు. ఫలితాలను ఈ కింది డైరెక్ట్ లింక్ ద్వారా చెక్ చేసుకోండి..
తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ఫస్ట్, సెకండ్ ఇయర్ పబ్లిక్ పరీక్షల ఫలితాలు 2025 మంగళవారం (ఏప్రిల్ 22) విడుదలయ్యాయి. నాంపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఫలితాలు విడుదల చేశారు. విద్యార్ధులు తమ ఫలితాలను టీవీ9 తెలుగు వెబ్ సైట్ ఇక్కడ లో నేరుగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేసి మార్కుల మెమోలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అలాగే ఇంటర్ బోర్డు అధికారిక వెబ్ సైట్ లో కూడా చెక్ చేసుకోవచ్చు. తాజా ఫలితాల్లో ఎప్పటి మాదిరి గానే అమ్మాయిలు అదరగొట్టారు. టాప్ ర్యాంకులన్నీ అమ్మాయిలే కైవసం చేసుకున్నారు. అలాగే ఫలితాలను ఐవీఆర్ పోర్టల్ 9240205555 ఫోన్‌నంబర్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు. ఇంటర్‌లో ఫస్టియర్‌లో 66.89 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా, సెకండియర్‌లో 71.37 శాతం ఉత్తీర్ణత నమోదైంది.
తెలంగాణ ఇంటర్ 2025 ఫలితాలు
కాగా 2024-25 విద్యా సంవత్సరానికి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 9.97 లక్షల మంది విద్యార్థులు ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ పబ్లిక్ పరీక్షలు రాశారు. ఈ పరీక్షలు మార్చి 5 నుంచి 25వ తేదీ వరకు జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా 1532 పరీక్ష కేంద్రాల్లో మొత్తం 9.50 మంది విద్యార్థులకు ఈ పరీక్షలు జరిగాయి. వారిలో 4.88 లక్షల మంది ఫస్టియర్ విద్యార్థులు.. 5 లక్షలకుపైగా సెకండియర్ విద్యార్థులు ఉన్నారు. ఈసారి గ్రేడ్లకు బదులు మార్కులను ఇస్తున్నట్లు ఇప్పటికే ఇంటర్ బోర్డు వెల్లడించింది.
పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చిన విద్యార్ధులు, ఫెయిల్ అయిన విద్యార్ధులు సప్లిమెంటరీ పరీక్షలకు హాజరుకావచ్చు. ఆయా తేదీలను ఇంటర్ బోర్డు ఈ రోజే వెల్లడిస్తుంది. అలాగే విద్యార్ధుల మార్కుల్లో అనుమానాలు ఉన్నట్లయితే ఫీజు చెల్లించి రీ వాల్యుయేషన్, రీ కౌంటింగ్‌కు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
Board of Intermediate Education, Telangana. March- 2025 Results
💥First Year Results ClickHere
💥Second Year Results ClickHere
💥First Year Vocational Results ClickHere
💥Second Year Vocational Results ClickHere
COMMENTS