MARRIAGE REGISTRATION CERTIFICATE
మీకు మ్యారేజ్ సర్టిఫికెట్ ఉందా? - లేదంటే ఇలా అప్లై చేసుకోండి.
మీసేవ కేంద్రం లేదా రిజిస్ట్రేషన్ శాఖ వెబ్‌సైట్ ద్వారా స్లాట్ బుకింగ్ సౌకర్యం - ఆధారాలు సమర్పిస్తే అరగంటలో జారీ కానున్న వివాహ రిజిస్ట్రేషన్ ధ్రువపత్రం.
Marriage Registration Certificate in Telangana : ప్రస్తుత పరిస్థితుల్లో వివాహ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ఎంతో అవసరం. భవిష్యత్తులో ఇది వివిధ సందర్భాల్లో చాలా ఉపయోగపడుతుంది. పెళ్లి చేసుకున్న చాలా మందికి ఈ విషయంపై అవగాహన లేక సంబంధిత కార్యాలయాల్లో తమ వివాహాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకోవడం లేదు. హిందూ వధూవరులు పెళ్లి చేసుకున్న తర్వాత ధ్రువీకరణ పత్రం పొందాలంటే మొదటగా రిజిస్ట్రేషన్ శాఖ వెబ్‌సైట్ లేదా మీసేవ కేంద్రం ద్వారా రూ.200 ఫీజు చెల్లించి స్లాట్ బుక్ చేసుకోవాలి. వెబ్‌సైట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
అరగంటలో ధ్రువీకరణ పత్రం :
పెళ్లి ఫొటోలు, వయసు ధ్రువీకరణ పత్రాలు, వధూవరుల ఆధార్, ముగ్గురు సాక్ష్యులు, వారి ఆధార్ వివరాలను సంబంధిత రిజిస్ట్రేషన్ కార్యాలయంలో సమర్పిస్తే అధికారులు అన్ని పత్రాలను పరిశీలించి అరగంటలో వివాహ ధ్రువీకరణ పత్రం జారీ చేస్తారు.
అభ్యంతరాలను పరిశీలించిన తర్వాత :
ప్రత్యేక వివాహ చట్టంలోని సెక్షన్-5 ప్రకారం రిజిస్టర్ కార్యాలయాల్లో దండలు మార్చుకొని ఒక్కటి కావాలనుకున్న ప్రేమ జంటలు ముందుగా సాధారణ ఫొటోలతో పాటు మిగిలిన అన్ని పత్రాలతో అప్లై చేసుకుంటే అమ్మాయి, అబ్బాయి స్వస్థలాల్లోని సబ్ రిజిస్ట్రర్ కార్యాలయాలకు వారి వివరాలను పంపి ఏవైనా అభ్యంతరాలుంటే పరిశీలిస్తారు.
ఇతర మార్గాల్లో వివాహం :
ఎటువంటి అభ్యంతరాలు లేకపోతే నెల రోజుల కాల వ్యవధి తర్వాత సబ్ రిజిస్ట్రర్ కార్యాలయంలోనే దండలు మార్పించి, 30 నిమిషాల్లో వివాహ ధ్రువీకరణ పత్రాన్ని జారీ చేస్తారు. సెక్షన్-16 ప్రకారం హిందూ సంప్రదాయం ప్రకారం కాకుండా ఇతర మార్గాల్లో వివాహం చేసుకుంటే నెలరోజుల పాటు గడువు విధించి, విచారణ జరిపిన అనంతరం ధ్రువీకరణ పత్రం ఇస్తారు.
COMMENTS