IIT VS NIT VS IIIT FEE COMPARISON
IIT - NIT - IIIT వీటి మధ్య తేడా ఏంటి? - అడ్మిషన్ ఎలా పొందాలి? - ఎందులో ఫీజు తక్కువ??
ఐఐటీ Vs ఎన్ఐటీ Vs ఐఐఐటీ మధ్య అడ్మిషన్, ఫీజుల వివరాలిలా!
IIT vs NIT vs IIIT Fee Comparison : దేశంలో ప్రతిష్టాత్మక విద్యాసంస్థలుగా పేరొందిన ఐఐటీ(IIT), ఎన్ఐటీ(NIT), ఐఐఐటీ(IIIT)ల్లో చదవాలనే కోరిక చాలా మంది యువతకు ఉంటుంది. ఈ విద్యాసంస్థల్లో కోర్సులు పూర్తి చేసిన వారికి మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తుంటాయి. అయితే, ఈ ఇంజినీరింగ్ ఇన్స్టిట్యూట్స్లో సీటు పొందడం అంత సులుభమేమి కాదు. జేఈఈ వంటి అత్యంత కఠినమైన పరీక్షల్లో మంచి మార్కులు సాధించి బెటర్ ర్యాంకులు పొందాలి. అప్పుడే వాటిల్లో అడ్మిషన్ పొందడానికి అవకాశం ఉంటుంది. అయితే, ఇంజినీరింగ్ విద్యలో మేటి విద్యాసంస్థలుగా పేరొందిన ఈ ఇన్స్టిట్యూట్స్లో సీటు పొందాలంటే అడ్మిషన్ ప్రాసెస్ ఏంటి? ఎందులో ఎంత ఫీజు చెల్లించాల్సి ఉంటుంది? వంటి పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
Indian Institute of Technology(ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ) :
ఐఐటీ(IIT)లు దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఇంజినీరింగ్ కళాశాలలు. వీటిల్లో విద్యనభ్యసించాలని చాలా మందికి ఉంటుంది. అయితే, ఇందులో సీటు సంపాదించాలంటే JEE Mains పరీక్షలో మంచి ర్యాంకు సాధించాలి. అప్పుడే IITలో అడ్మిషన్ దొరుకుతుంది. ఇవి యూజీ, పీజీ, డాక్టోరల్ ప్రోగ్రామ్స్‌ను ఆఫర్ చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే ఐఐటీలు ఇంజినీరింగ్, సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధిత కోర్సులను అందిస్తున్నాయి.
ఫీజు వివరాలిలా :
ఐఐటీల్లో బీటెక్ ఫీజు విషయానికొస్తే ఏడాదికి 2.2 లక్షల నుంచి 3.2 లక్షల మధ్య చెల్లించాల్సి ఉంటుంది.
హాస్టల్ మెస్ ఛార్జీల కోసం అదనంగా మరో లక్షా 50 వేల నుంచి రెండు లక్షల వరకు ఖర్చు అవుతాయి.
ఇలా లెక్కేసుకుంటే నాలుగు సంవత్సరాల బీటెక్ కోర్సుకు మొత్తంగా సుమారు 10 లక్షల నుంచి 14 లక్షల వరకు డబ్బులు అవసరం పడుతాయి.
National Institute of Technology(నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ) :
దేశంలో ఇంజినీరింగ్ విద్యా విభాగంలో IITల తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకమైన విద్యాసంస్థలుగా NITలు పేరొందాయి. ఐఐటీలో సీటు రానివారు ఎన్ఐటీలను ఎంపిక చేసుకుంటుంటారు. ఇవి కూడా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోనే నడుస్తాయి.
ఫీజు వివరాలు :
ఎన్ఐటీల్లో బీటెక్ కోర్సుల యాన్యువల్ ఫీజు వచ్చేసరికి 1.4 లక్షల నుంచి 2.4 లక్షల వరకు ఉంటుంది.
అదనంగా, హాస్టల్, మెస్ ఫీజులు సంవత్సరానికి 1.2 లక్షల నుంచి 2.2 లక్షల వరకు ఖర్చు కావొచ్చు.
ఈవిధంగా నాలుగేళ్ల బీటెక్ కోర్సు కంప్లీట్ చేయడానికి ఒక్కో విద్యార్థి సుమారు 8 లక్షల నుంచి 10 లక్షల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది.
Indian Institute of Information Technology(ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) :
ట్రిపుల్ ఐటీ(IIIT)లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త సహకారంతో నడుస్తాయి. ఇంజినీరింగ్ విభాగంలో ఐఐటీ, ఎన్ఐటీల తర్వాత పేరొందిన విద్యా సంస్థలు ఐఐఐటీలు. ట్రిపుల్ ఐటీలు ప్రధానంగా ఇన్ఫర్మేషన్, టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్ సంబంధిత రంగాలలో కోర్సులను అందిస్తాయి. జేఈఈ మెయిన్స్ ర్యాంకు ఆధారంగా అడ్మిషన్ ప్రక్రియ ఉంటుంది. అయితే, జేఈఈలో తక్కువ ర్యాంకు వచ్చినప్పటికీ వీటిలో సీటు పొందే అవకాశం ఉంటుంది. ఈ విద్యా సంస్థలు కూడా యూజీ, పీజీ, డాక్టోరల్ ప్రోగ్రామ్స్ ఆఫర్ చేస్తున్నాయి.
ఫీజు వివరాలిలా :
ట్రిపుల్ ఐటీలో యాన్యువల్ ఫీజు వచ్చేసరికి 1.5 లక్షల నుంచి 3 లక్షల మధ్య ఉంటుంది.
ఇక హాస్టల్, మెస్ ఫీజుల విషయానికొస్తే సంవత్సరానికి 1. 2 లక్షల నుంచి 2.5 లక్షల మధ్య చెల్లించాల్సి ఉంటుంది.
ఈ లెక్కన నాలుగేళ్లకు సుమారు 8 లక్షల నుంచి 14 లక్షల వరకు ఖర్చు అయ్యే ఛాన్స్ ఉంటుంది.
COMMENTS