DEET APP IN TELANGANA
మీరు నిరుద్యోగులా? - అయితే ఈ యాప్ డౌన్లోడ్ చేసుకొని జాబ్ పొందండి!
ఏఐ సాంకేతికతతో డీట్ యాప్ తీసుకువచ్చిన ప్రభుత్వం - పరిశ్రమల్లో ఖాళీల వివరాలను యువత తెలుసుకునే అవకాశం - డీట్ ద్వారా నేరుగా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు.
Deet App with Artificial Intelligence In Telangana : నిరుద్యోగ యువతీయువకులకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి తెలంగాణ ప్రభుత్వం కొత్తగా డీఈఈటీ(డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్ఛేంజి ఆఫ్ తెలంగాణ) యాప్‌ను ఏఐ సాంకేతికతతో అందుబాటులోకి తీసుకొచ్చింది. నిరుద్యోగుల మొబైల్ ఫోన్లకు ఆయా కంపెనీలు నేరుగా సమాచారం పంపించి ఇంటర్య్వూలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నారు.
ఉద్యోగ అవకాశాల కోసం యువత కంపెనీలు, కంప్యూటర్ సెంటర్ల చుట్టూ తిరుగుతుంటారు. ఇదే అదునుగా భావించి కొన్ని బోగస్ కంపెనీలు యువతను నమ్మించి దారుణంగా మోసం చేసి నట్టేట ముంచిన సందర్భాలు ఉన్నాయి. వీటన్నింటి నేపథ్యంలో యువతకు భరోసా ఇవ్వడానికి సర్కార్ కొత్తగా డీఈఈటీ యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది.
ఎప్పటికప్పుడు కంపెనీల ఖాళీల సమాచారం :
వివిధ పరిశ్రమల్లో ఖాళీలు ఏర్పడితే వారు ఈ యాప్ ద్వారా నేరుగా ఎవరైతే డీట్ యాప్‌లో ఉద్యాగాల కోసం ఎదురుచూస్తుంటారో వారి ఫోన్‌కు సమాచారం అందిస్తారు. సదరు ఉద్యోగానికి అవసరమైన విద్యార్హత, ఖాళీల వివరాలు, వేతనం, ఇంటర్వ్యూ పరీక్షల వివరాలను పంపిస్తారు. ఫోన్ ద్వారా సమాచారం తెలుసుకునే నిరుద్యోగులు నేరుగా ఇంటర్వ్యూకు వెళ్లి ఎంపిక కావచ్చు. ఇందులో మధ్యవర్తుల ప్రమేయం అస్సలు ఉండదు.
డీట్ యాప్‌లో పరిశ్రమలు వాటి వివరాలను యాప్‌లో ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది. దీని వల్ల ఖాళీల వివరాలు ఎక్కడెక్కడ ఉన్నాయనే విషయాన్ని యువత తెలుసుకునే అవకాశం ఉంది. వాస్తవానికి ఈ యాప్‌ను 2024 నవంబరులో ప్రారంభించారు. కానీ ఎక్కువ ప్రచారం లేకపోవడం వల్ల అనుకున్న స్థాయిలో ఎవరికీ తెలియలేదు. దీంతో డీట్ యాప్‌కు ఆర్టిపిషియల్ ఇంటెలిజెన్స్ జోడించి మళ్లీ ఇప్పుడు అందుబాటులోకి తీసుకొచ్చారు.
ఇలా లాగిన్ కావాలి :
ఉద్యోగావకాశాల కోసం చూసే అభ్యర్థులు www.tsdeet.com వెబ్‌సైట్‌లో లాగిన్ కావాలి. పేరు, మొబైల్ నంబరు, మెయిల్, పుట్టిన తేదీ లాంటి వివరాలతో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. విద్యార్హత, టెక్నికల్ కోర్సులు, వ్యక్తిగత వివరాలు, ఇంటి నంబర్లను పొందుపరచాలి. మీరు ఆశించే ఉద్యోగం వివరాలను నమోదు చేసుకోవాలి. యాప్‌లోనూ అచ్చం ఇలాగే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
COMMENTS