COINS REMOVED FROM CHILDREN THROATS
సర్జరీ లేకుండానే చిన్నారుల గొంతుల్లో ఇరుకున్న నాణేలు తీస్తున్న వైద్యుడు- ఎక్కడో తెలుసా?
నాణెం మింగిన 300మంది చిన్నారులను రక్షించిన వైద్యుడు- ఆపరేషన్ లేకుండా 5నిమిషాల్లో కాయిన్ తొలగింపు- ఫీజు తెలిస్తే షాక్!
Doctor Removing Coins From Children Throats : చాలా మంది చిన్నారులు అనుకోకుండా కరెన్సీ నాణేలను మింగేస్తుంటారు. ఆ కాయిన్స్ గొంతులో ఇరుక్కొని పిల్లలు మరణించిన సందర్భాలు ఉన్నాయి. లేదంటే వైద్యులు శస్త్రచికిత్స చేసి ఆ నాణేన్ని బయటకు తీస్తారు. అయితే మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ వైద్యుడు మాత్రం ఎటువంటి సర్జరీ చేయకుండానే నిమిషాల వ్యవధిలోనే పిల్లల గొంతులో ఇరుక్కున్న నాణేలకు తీసేస్తారు. ఇప్పటివరకు ఇలా చేసి 300 మందికి పైగా చిన్నారుల ప్రాణాలను కాపాడారు. నాణేలు మింగితే గుర్తొచ్చేది ఆయనే!
ఛతర్‌పుర్ జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రిలో గత ఐదేళ్లుగా మనోజ్ చౌదరి అనే వైద్యుడు పనిచేస్తున్నారు. ఎవరైనా చిన్నారి కాయిన్ మింగేస్తే ఠక్కున మనోజే గుర్తుకువస్తారు. వెంటనే ఆయన్ను సంప్రదిస్తే 5 నిమిషాల్లోనే చిన్నారి గొంతులో నుంచి నాణేన్ని ఎటువంటి సర్జరీ అవసరం లేకుండా సక్సెస్‌ఫుల్‌గా బయటకి తీసేస్తారు. అందుకు ఫీజుగా పిల్లల గొంతు నుంచి వచ్చే నాణేలనే తీసుకుంటారు. ఈ క్రమంలో వందలాది మంది చిన్నారుల ప్రాణాలను కాపాడుతున్న మనోజ్‌పై ప్రశంసలు వెల్లువెత్తున్నాయి.
పని పట్ల నిబద్ధత
మనోజ్ చౌదరి తన పని విషయంలో చాలా అప్రమత్తంగా ఉంటారు. నిబద్ధతతో వైద్య వృత్తిని కొనసాగిస్తున్నారు. ఆరోగ్యం విషమంగా ఉన్న పేషెంట్ ఎవరైనా వస్తే వెంటనే వారికి చికిత్స చేస్తారు. దీంతో ఆయనపై ప్రజలకు అభిమానం, నమ్మకం ఎక్కువ. చిన్నారుల గొంతుల్లో ఇరుక్కుపోయిన నాణేలను తీయడంలో దిట్ట కావడం వల్ల మనోజ్ పేరు మరింత మార్మోగిపోతోంది. అలాగే చిన్నపిల్లల గొంతుల ఇరుకున్న నాణేన్నే ఫీజుగా తీసుకుంటారు. అంటే దాదాపు ఉచితమే అని చెప్పాలి. దీంతో మనోజ్‌ను పేద ప్రజలు దేవుడిలా భావిస్తున్నారు.
"ఇప్పటివరకు కాథెటర్ సహాయంతో ఫుడ్ పైప్ నుంచి 330 నాణేలను తొలగించాను. దీనికి నేను ఎటువంటి ఫీజు వసూలు చేయను. గొంతు భాగంలో ఇరుక్కుపోయిన నాణేల్ని తీస్తాను. పిల్లలకు తల్లిదండ్రులు నాణేలు ఇవ్వొదు. అవి వారు మింగేస్తే గొంతులో ఇరుక్కుపోతాయి. పిల్లవాడు ఒకవేళ నాణేం మింగేస్తే అతడిని తినడానికి, తాగడానికి ఏం ఇవ్వకూడదు. వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాలి." అని డాక్టర్ మనోజ్ చౌదరి తెలిపారు.
COMMENTS