CASTE CERTIFICATE APPLICATION STATUS
క్యాస్ట్ సర్టిఫికెట్‌కు అప్లై చేశారా? - మరి, అప్రూవ్ అయిందా లేదా? - మీ ఫోన్లోనే ఈజీగా తెలుసుకోండి!
- నిరుద్యోగులు, విద్యార్థులకు కీలకంగా మారుతున్న కుల ధ్రువీకరణ పత్రాలు - మీ అప్లికేషన్ స్టేటస్‌ను ఇలా చెక్ చేసుకోండి!
How to Check Caste Certificate Application Status: మన దేశంలో కేంద్ర, రాష్ట్రాలు ప్రభుత్వాలు అందిస్తున్న పలు ప్రయోజనాలను పొందాలంటే కొన్ని సర్టిఫికెట్లు కచ్చితంగా ఉండాల్సిందే. అలాంటి వాటిలో కుల ధ్రువీకరణ పత్రం(Caste Certificate) ఒకటి. ఉద్యోగాల్లో రిజర్వేషన్లు, రైతులకు సబ్సిడీ, విద్యార్థులకు స్కాలర్ షిప్స్, ప్రభుత్వ పథకాల్లో లబ్ధి, విద్యా సంస్థల్లో ప్రవేశం పొందడం ఇలా ఎన్నో విషయాల్లో కుల ఈ ధ్రువీకరణ పత్రం కంపల్సరీ.
ప్రస్తుతం చాలా మంది ఈ సర్టిఫికెట్స్ కోసం అప్లై చేస్తున్నారు. నిరుద్యోగులు రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తు చేసుకుంటున్నారు. విద్యార్థులు కాలేజీల్లో అడ్మిషన్స్, స్కాలర్షిప్స్ కోసం అప్లై చేస్తున్నారు. వీరందరికీ క్యాస్ట్ సర్టిఫికెట్ అవసరం కావడంతో, అది లేనివాళ్లంతా కార్యాలయాలకు వెళ్లి అప్లై చేస్తున్నారు.
ఇంత వరకు పని ఈజీగానే పూర్తయినప్పటికీ, ఆ తర్వాత తిప్పలు పడాల్సి వస్తోంది. ఎందుకంటే సర్టిఫికెట్ మంజూరు అయ్యిందా? లేదా? అనే వివరాలు తెలియక మీసేవ కేంద్రాల చుట్టూ తిరగాల్సి వస్తోంది. ఇలా పలు మార్లు వెళ్లాల్సి రావడం ఇబ్బంది ఉంటుంది. మీరు కూడా ఈ పరిస్థితిలో ఉంటేగనక, ఇకపై అలా తిరగాల్సిన అవసరం లేదు. మీ అప్లికేషన్ స్టేటస్‌ను కేవలం ఒక్క క్లిక్‌తో తెలుసుకోవచ్చు. అదీ మీ ఫోన్లోనే! మరి ఆ ప్రాసెస్ ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.
క్యాస్ట్ సర్టిఫికెట్ స్టేటస్:
మీ ఫోన్లో క్రోమ్ ఓపెన్ చేసి TG MeeSeva అని టైప్ చేసి సెర్చ్ చేయాలి. ఆ తర్వాత స్క్రీన్ మీద పలు వెబ్‌సైట్స్ కనిపిస్తాయి. అందులో అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేయాలి. డైరెక్ట్ స్క్రీన్ కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి
హోమ్‌పేజీలోనే కుడివైపు కాలమ్‌లో " Know Your Application Status" అనే విభాగానికి వెళ్లండి.
టెక్స్ట్ కాలమ్‌లో దరఖాస్తు సమయంలో మీసేవలో ఇచ్చిన రశీదులోని అప్లికేషన్ నెంబర్ టైప్ చేయండి. ఉదాహరణకు CND022253947112
నెంబర్ ఎంటర్ చేసి పక్కనే ఉన్న "GO"పై క్లిక్ చేయండి.
ఇప్పుడు కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో స్క్రీన్ మీద కనిపించే టెక్ట్స్‌ను అక్కడ సూచించిన బాక్స్‌లో ఎంటర్ చేసి Submit ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
స్క్రీన్‌పై మీ కుల ధ్రువీకరణ పత్రం అప్లికేషన్ స్టేటస్ చూపుతుంది. అందులో రిమార్క్స్ దగ్గర Approved అని ఉంటే మీకు సర్టిఫికెట్ మంజూరు అయినట్లే. ఒకవేళ Pending లేదా NA అని వస్తే కొంచెం టైమ్ పడుతుందని అర్థం.
మీ సర్టిఫికెట్ అప్రూవ్డ్ అని వస్తే మీరు అప్లై చేసిన మీసేవకు వెళ్లి ప్రింట్ తీయించుకోవచ్చు. అక్కడ అయితే ఫ్రీగా ప్రింట్ తీస్తారు. వేరే మీసేవకు వెళితే అందుకు తగిన డబ్బులు తీసుకుంటారు.
సర్టిఫికెట్ వెరిఫై చేసుకోవడం ఎలా? :
చాలా మంది కొత్తగా కాకుండా గతంలో ఎప్పుడో ఒకసారి అంటే రెండు, మూడు సంవత్సరాల క్రితం తీసుకుని ఉంటుంటారు. అయితే వాటిని భద్రపరిచే క్రమంలో చినగడం లేదా పోవడం జరుగుతుంటాయి. ఈ క్రమంలో మళ్లీ కొత్తవాటికి అప్లై చేస్తుంటారు. అయితే 10 సంవత్సరాల లోపు తీసుకున్న సర్టిఫికెట్ పోతే కొత్తదానికి అప్లై చేసుకోనవసరం లేదు. మీ దగ్గర ఉన్న మీ సేవ సర్టిఫికెట్ నెంబర్ ప్రింట్ తీయించుకోవచ్చు. అందుకోసం మీరు ముందుగా అప్లికేషన్ నెంబర్ మీ దగ్గర ఉంచుకోవాలి.
మీ ఫోన్లో క్రోమ్ ఓపెన్ చేసి TG Meeseva అని టైప్ చేసి సెర్చ్ చేయాలి. ఆ తర్వాత స్క్రీన్ మీద పలు వెబ్‌సైట్స్ కనిపిస్తాయి. అందులో అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేయాలి. డైరెక్ట్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
హోమ్‌పేజీలోనే కుడివైపు కాలమ్‌లో Meeseva Cetrificate(Application No) అనే విభాగానికి వెళ్లండి.
టెక్స్ట్ కాలమ్‌లో మీ దగ్గర ఉన్న మీసేవ సర్టిఫికెట్ నెంబర్‌ను ఎంటర్ చేసి సెర్చ్ బటన్‌పై క్లిక్ చేయండి.
ఇప్పుడు కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో స్క్రీన్ మీద కనిపించే టెక్ట్స్‌ను అక్కడ సూచించిన బాక్స్‌లో ఎంటర్ చేసి Submit ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
మీ సర్టిఫికెట్‌కు సంబంధించిన వివరాలు స్క్రీన్ మీద కనిపిస్తాయి. వాటిని ఒకసారి చూసుకుని మీసేవకు వెళ్లి ప్రింట్ తీయించుకుంటే సరి.
COMMENTS