Do you have the habit of sitting in a dark room? Beware your brain function will slow down soon
Brain Health: చీకటి గదిలో కూర్చునే అలవాటు మీకూ ఉందా? జాగ్రత్త మీ మెదడు పనితీరు త్వరలోనే మటాష్..
చురుకైన జీవనశైలిని కలిగిఉన్నప్పటికీ ఆరోగ్యకరమైన ఆహారం, మానసిక వ్యాయామం ఉంటేనే మెదడు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి వీలుంటుంది. అయితే మనకు తెలియకుండానే చేసే కొన్ని తప్పులు మన మెదడు ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తాయి. అలాంటి అనవసరమైన అలవాట్లు మన మెదడును దెబ్బతీసి ఆరోగ్యాన్ని మరింత దిగజార్చుతాయి. మన మెదడుకు ఏ అలవాట్లు హాని తలపెడతాయో ఆ వివరాలు ఇక్కడ తెలుసుకుందాం..
శరీరంలోని ప్రతి భాగం ముఖ్యమైనదే. వాటిని ఆరోగ్యంగా ఉంచాలంటే, మన జీవనశైలి కూడా బాగుండాలి. ముఖ్యంగా మెదడు ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కూడా చాలా ముఖ్యం. దాని పనితీరు పదునుగా ఉంటేనే జ్ఞాపకశక్తి బాగా ఉంటుంది. మనం చురుకైన జీవనశైలిని కలిగిఉన్నప్పటికీ ఆరోగ్యకరమైన ఆహారం,మానసిక వ్యాయామం ఉంటేనే మెదడు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి వీలుంటుంది. అయితే మనకు తెలియకుండానే చేసే కొన్ని తప్పులు మన మెదడు ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తాయి. అలాంటి అనవసరమైన అలవాట్లు మన మెదడును దెబ్బతీసి ఆరోగ్యాన్ని మరింత దిగజార్చుతాయి. మన మెదడుకు ఏ అలవాట్లు హాని తలపెడతాయో ఆ వివరాలు ఇక్కడ తెలుసుకుందాం..
మెదడుకు హాని కలిగించే అలవాట్లు ఇవే..
చీకటిలో ఎక్కువసేపు కూర్చోవడం
సాధారణంగా, కొంతమంది వెలుగు కంటే చీకటినే ఇష్టపడతారు. వాళ్ళు బోర్ కొట్టినా కూడా చీకటి ప్రదేశానికి వెళ్లి నిశ్శబ్దంగా కూర్చుంటారు. మరికొందరు చీకటిలో కూర్చుని మొబైల్ ఫోన్లు లేదా టీవీ చూస్తుంటారు. ఇవన్నీ తెలియకుండానే మన మెదడును దెబ్బతీస్తాయి.
అతిగా ప్రతికూల లేదా చెడు వార్తలను చూడటం
కొంతమంది తరచుగా నేర వార్తలను చదవడానికి చాలా ఉత్సాహంగా ఉంటారు. కొంతమంది చెడు వార్తలు వినడానికి, చూడటానికి ఇష్టపడతారు. ఇతరులతో పోలిస్తే వీరి మెదళ్ళు త్వరగా దెబ్బతింటాయని నిపుణులు అంటున్నారు.
బిగ్గరగా హెడ్‌ఫోన్‌లు పెట్టుకునే అలవాటు
ప్రయాణించేటప్పుడు లేదా పని చేస్తున్నప్పుడు పాటలు లేదా వీడియోలు వినే అలవాటు చాలా మందికి ఉంటుంది. అది తప్పు కాదు. కానీ కొంతమంది అవసరానికి మించి శబ్దం పెంచి వింటారు. అలాంటి అభ్యాసం కొంతమందికి చాలా ఆనందదాయకంగా ఉండవచ్చు. కానీ అది మన మెదడుకు హాని కలిగిస్తుందని మనం మర్చిపోకూడదు.
వ్యక్తులకు దూరంగా ఉండటం
కొంతమందికి ఎప్పుడూ మొబైల్‌లో ఉండటం లేదా టీవీ చూడటం లేదా ఒంటరిగా కూర్చోవడం అలవాటు. వారికి ఇతరులతో కలిసి మెలగాలనే కోరిక ఉండదు. ఇలాంటి అలవాటు ఉన్నవారి మెదళ్ళు త్వరగా దెబ్బతింటాయి.
మొబైల్ లేదా టీవీ ఎక్కువగా చూడటం
నేటి కాలంలో చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ మొబైల్, టీవీకి బానిసలవుతున్నారు. ఎక్కడికి వెళ్ళినా టీవీ, మొబైల్ ఫోన్లు చూస్తూ సమయం వృధా చేసే వారు ఎక్కువ అవుతున్నారు. అలాంటి అలవాటు మనకు తెలియకుండానే మన మెదడును దెబ్బతీస్తుంది.
ఎక్కువ చక్కెర తినడం
కొంతమంది ఏ రకమైన ఆహారంకైనా చక్కెర కలుపుకుని తీసుకుంటారు. ఉప్పు, పులుపు, కారంగా ఉండే వంటకాలతో సహా ప్రతి వంటకానికి చక్కెర కలుపుతారు. మనం ఇలా ఎక్కువ చక్కెర తింటే మన మెదడు దెబ్బతింటుంది.
రోజంతా కదలకుండా కూర్చోవడం
పనిలో విశ్రాంతి లేకుండా ఒకే చోట కూర్చోవడం కూడా మెదడు ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు అంటున్నారు.
తగినంత నిద్ర లేకపోవడం
రాత్రిపూట తగినంత నిద్ర రాకపోవడం కూడా మంచిది కాదు. కొంతమంది రాత్రిపూట ఫోన్లు చూస్తూ నిద్రపోవడం మర్చిపోతారు. ఇలాంటి వారి మెదళ్ళు ఆరోగ్యంగా ఉండవు.
కాబట్టి, మెదడు ఆరోగ్యంగా పనిచేయడానికి ఆరోగ్యకరమైన జీవనశైలిని అవలంబించాలి. అందుకు ఈ విధమైన చెడు అలవాట్లను కూడా వదులుకోవాలి. లేకపోతే,అది మన మెదడుకే హాని కలిగిస్తుంది. కాబట్టి ఈరోజే అలాంటి చెడు అలవాట్లను మానేయడం మంచిది.
COMMENTS