BANK HOLIDAYS IN MAY 2025
2025 మే నెలలోని బ్యాంకు సెలవుల పూర్తి లిస్ట్ ఇదే!
2025 మే నెలలో 12 రోజుల పాటు బ్యాంకులకు సెలవు- ఈ హాలీ డేస్‌లో బ్యాంకింగ్ కార్యకలాపాలు ఎలా చేయాలంటే?
Bank Holidays In May 2025 : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) 2025 మే నెలకు సంబంధించిన బ్యాంక్ సెలవుల జాబితాను విడుదల చేసింది. దీని ప్రకారం, దేశంలోని వివిధ బ్యాంకులకు 12 రోజుల పాటు సెలవులు ఉన్నాయి. వీటిలో కొన్ని జాతీయ సెలవులు, మరికొన్ని ప్రాంతీయ సెలవులు ఉన్నాయి. అందువల్ల బ్యాంక్ కస్టమర్లు ఈ సెలవులను దృష్టిలో ఉంచుకుని, తమ అవసరాలకు అనుగుణంగా బ్యాంకింగ్ కార్యకలాపాలను ప్లాన్ చేసుకోవడం మంచిది.
2025 మే నెలలోని బ్యాంక్ సెలవుల జాబితా ఇదే!
మే 1 (గురువారం) : కార్మికుల దినోత్సవం, మహారాష్ట్ర డే, గుజరాత్ డే
మే 4 (ఆదివారం) :
మే 9 (శుక్రవారం) : రవీంద్రనాథ్ టాగూర్ జయంతి సందర్భంగా పశ్చిమ బెంగాల్‌లోని బ్యాంకులకు సెలవు.
మే 10 (శనివారం) : రెండో శనివారం
మే 11 (ఆదివారం) :
మే 12 (సోమవారం) : బుద్ధ పూర్ణిమ సందర్భంగా కర్ణాటకలోకి బ్యాంకులకు సెలవు.
మే 16 (శుక్రవారం) : సిక్కిం స్టేట్ డే సందర్భంగా సిక్కింలోని బ్యాంకులు ఈ రోజు పనిచేయవు.
మే 18 (ఆదివారం) :
మే 24 (శనివారం) : నాలుగో శనివారం
మే 25 (ఆదివారం) :
మే 26 (సోమవారం) : కాజీ నజ్రుల్ ఇస్లాం జన్మదినం సందర్భంగా త్రిపురలోని బ్యాంకులకు సెలవు.
మే 29 (గురువారం) : మహారాణా ప్రతాప్ జయంతి సందర్భంగా రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, హరియాణాల్లోని బ్యాంకులకు సెలవు.
సెలవు దినాల్లో ఆర్థిక లావాదేవీలు జరపడం ఎలా?
మే నెలలో 12 రోజులపాటు బ్యాంకులకు సెలవులు ఉన్నప్పటికీ, ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ సేవలు మాత్రం యథావిధిగా కొనసాగుతాయి. అలాగే యూపీఐ, ఏటీఎం సేవలు కూడా ఎప్పటిలానే అందుబాటులో ఉంటాయి. కనుక బ్యాంక్‌లకు వెళ్లకుండానే సులువుగా మీ ఆర్థిక లావాదేవీలను చక్కబెట్టుకోవచ్చు.
నోట్ : ఆర్‌బీఐ అధికారిక సెలవుల జాబితాను ప్రకటించినప్పటికీ, కొన్ని పరిస్థితుల్లో ఆ తేదీలు మారవచ్చు. ఉదాహరణకు, రాష్ట్రాలు, స్థానిక ప్రభుత్వాల నిర్ణయాలను బట్టి ప్రాంతీయ సెలవులు మారవచ్చు. లేదా ఊహించని సంఘటనల వల్ల షెడ్యూల్ మారవచ్చు. కనుక కచ్చితమైన సమాచారం కోసం ఆర్‌బీఐ అధికారిక వెబ్‌సైట్‌ను చూడాల్సి ఉంటుంది.
COMMENTS