74 Posts in Rashtriya Chemicals and Fertilizers Limited
RCF Ltd: రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్‌లో 74 పోస్టులు.
రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ (RCF Ltd), భారత ప్రభుత్వం ఆధ్వర్యంలోని నవరత్న సంస్థ, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థుల కోసం ప్రత్యేక రిక్రూట్‌మెంట్ డ్రైవ్ కింద వివిధ కేటగిరీ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.
పోస్టు వివరాలు: ఖాళీలు
1. ఆపరేటర్ ట్రైనీ (కెమికల్)- 54
2. బాయిలర్ ఆపరేటర్ గ్రేడ్ III- 3
3. జూనియర్ ఫైర్‌మెన్ గ్రేడ్ II- 2
4. నర్స్ గ్రేడ్ II- 1
5. టెక్నీషియన్ ట్రైనీ (ఇన్‌స్ట్రుమెంటేషన్)- 4
6. టెక్నీషియన్ ట్రైనీ (ఎలక్ట్రికల్)- 2
7. టెక్నీషియన్ ట్రైనీ (మెకానికల్)- 8
మొత్తం పోస్టులు: 74
అర్హత: పోస్టును అనుసరించి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో టెన్త్ లేదా బీఎస్సీ నర్సింగ్. బీఎస్సీ, ఇంజినీరింగ్ (కెమిస్ట్రీ/ఫిజిక్స్), డిప్లొమా (కెమికల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్) ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.వయోపరిమితి: 01.02.2025 నాటికి ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులు 35 ఏళ్లు(నర్స్ గ్రేడ్ II పోస్టుకు 36ఏళ్‌లు), ఓబీసీ అభ్యర్థులకు 33 ఏళ్లు మించకూడదు.
జీతం: నెలకు ఆపరేటర్/టెక్నీషియన్ ట్రైనీ, నర్స్ గ్రేడ్ II పోస్టులకు రూ.46,300; బాయిలర్ ఆపరేటర్ గ్రేడ్ IIIకు రూ.42,100; జూనియర్ ఫైర్‌మెన్ గ్రేడ్ IIకు రూ.37,900.
దరఖాస్తు ఫీజు: ఓబీసీ అభ్యర్థులకు రూ.700; ఎస్సీ/ ఎస్టీ, మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ టెస్ట్ + స్కిల్ టెస్ట్ ఆధారంగా ఉంటుంది.
పరీక్షా కేంద్రాలు: ముంబయి, నాగ్‌పూర్.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తు చివరి తేదీ: 05.04.2025.
Important Links:
FOR NOTIFICATION CLICKHERE.
FOR WEBSITE CLICKHERE.
FOR LATEST JOB NOTIFICATIONS CLICKHERE
COMMENTS