CURRY LEAVES BUTTERMILK RECIPE
ఒంట్లో వేడిని తగ్గించే "కరివేపాకు మజ్జిగ" - ఐదే ఐదు నిమిషాల్లో రెడీ - ఒక్క గ్లాసు తాగారంటే ఆ కిక్కే వేరు!
ఈ స్టైల్లో బటర్ మిల్క్ ప్రిపేర్ చేసుకోండి - సమ్మర్లో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు మీ సొంతం!
Curry Leaves ButterMilk at Home : వేసవి ప్రారంభంలోనే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఉదయం 10 దాటకముందే జనం ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. దీంతో మండుతున్న ఎండల తాకిడికి ఒళ్లంతా నీరసంతో ఉంటుంది. ఈ క్రమంలోనే మెజార్టీ పీపుల్ వేడి నుంచి ఉపశమనంతో పాటు, ఒంట్లో వేడిని తగ్గించుకునేందుకు, తక్షణ శక్తిని పొందేందుకు పెరుగుతో చేసే పదార్థాలను తీసుకుంటుంటారు. అందులో ముఖ్యంగా ఎక్కువ మంది మజ్జిగ తాగడానికి ఇష్టపడతారు.
అలాగని, రోజూ మజ్జిగను ఒకే తీరులో తాగాలన్నా బోరింగ్ ఫీల్ వచ్చేస్తుంది. అందుకే ఈసారి సరికొత్త రుచిలో "కరివేపాకుతో బటర్ మిల్క్"ని ప్రిపేర్ చేసుకోండి. ఒక్కసారి ఇలా చేసుకొని తాగారంటే డైలీ ఇదే తీరులో కావాలంటారు. అంత రుచికరంగా ఉంటుంది ఈ మజ్జిగ. పైగా కరివేపాకు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అంతేకాదు, దీని కోసం ఎక్కువ శ్రమించాల్సిన పనిలేదు. ఐదే ఐదు నిమిషాల్లో సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి, అదెలాగో ఇప్పుడు చూద్దాం.
కావాల్సిన ఇంగ్రీడియంట్స్ :
కరివేపాకు - గుప్పెడు
ఉప్పు - అరటీస్పూన్
జీలకర్ర పొడి - అరటీస్పూన్
అల్లం - అర అంగుళం ముక్క
పెరుగు - 1 కప్పు
సింపుల్గా ప్రిపేర్ చేసుకోండిలా :
ఇందుకోసం ముందుగా తాజా కరివేపాకును తీసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి.
అనంతరం మిక్సీ జార్ తీసుకొని అందులో కడిగి పెట్టుకున్న కరివేపాకును కాడల నుంచి దూసి వేసుకోవాలి.
ఆపై అందులో ఉప్పు, జీలకర్ర పొడి, అల్లం, పెరుగు, తగినన్ని వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
ఆ తర్వాత మిశ్రమం చిక్కగా ఉందనిపిస్తే మరికొద్దిగా నీళ్లు వేసుకొని కలుపుకోవాలి.
అనంతరం గ్లాసులలో పోసుకొని చివర్లో కొద్దిగా కొత్తిమీర తరుగు వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలు.
అంతే, ఎంతో రుచికరంగా ఉండే హెల్దీ "కరివేపాకు బటర్ మిల్క్" మీ ముందు ఉంటుంది!
మరి, నచ్చితే మీరూ సమ్మర్లో ఇలా మజ్జిగ చేసుకొని తాగండి. ఒక్కసారి తాగారంటే డైలీ ఇదే తీరులో మజ్జిగ కావాలంటారు.
కరివేపాకుతో ఆరోగ్య ప్రయోజనాలు :
కరివేపాకులో కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, జింక్, పీచు పోషకాలతో పాటు విటమిన్-సి, విటమిన్-బి, విటమిన్-ఇలు సమృద్ధిగా ఉంటాయి. కాబట్టి దీన్ని తీసుకోవడం ద్వారా బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు.
ముఖ్యంగా కరివేపాకులో విటమిన్-ఎ అధికంగా ఉండడం వల్ల దీన్ని తీసుకోవడం ద్వారా కంటి చూపును మెరుగుపరచుకోవచ్చంటున్నారు నిపుణులు. అలాగే, దీనిలో చర్మాన్నీ, జుట్టునీ ఆరోగ్యంగా-అందంగా ఉంచే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలం. కాబట్టి, జుట్టు ఆరోగ్యానికి ఇది ఎంతో మేలు చేస్తుందంటున్నారు.
బరువు తగ్గాలనుకునేవారూ కరివేపాకు తినడం ద్వారా మంచి ప్రయోజనం ఉంటుందంటున్నారు. ముఖ్యంగా దీనిలో ఉండే ‘కార్బజోల్ ఆల్కలాయిడ్స్’ బరువు నియంత్రణలో ఎంతగానో సహాయపడుతుందంటున్నారు నిపుణులు. ఇంకా శరీరంలోని వ్యర్థాల్నీ బయటకు పంపిస్తూ, జీర్ణశక్తిని పెంచడంలోనూ కరివేపాకు ముందు వరుసలో ఉంటుందని సూచిస్తున్నారు.
COMMENTS