Notification for 1673 jobs in Telangana High Court.
TG High Court Jobs: టెన్త్ అర్హతతో తెలంగాణ హైకోర్టులో 1673 ఉద్యోగాలకు నోటిఫికేషన్.. ఎలా ఎంపిక చేస్తారంటే
తెలంగాణ రాష్ట్ర హైకోర్టులో సబార్డినేట్ సర్వీస్ కోసం వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ తెలంగాణ హైకోర్టు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 1673 స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3, జూనియర్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, అసిస్టెంట్, ఎగ్జామినర్, టైపిస్ట్, ఆఫీస్ సబార్డినేట్, కంప్యూటర్ అపరేటర్, సిస్టమ్ అనలిస్ట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం పోస్టుల్లో 1277 టెక్నికల్ పోస్టులు, 184 నాన్-టెక్నికల్ పోస్టులు, తెలంగాణ జ్యుడీషియల్ మినిస్టీరియల్ పోస్టులు, సబార్డినేట్ సర్వీస్ కింద 212 పోస్టులు ఉన్నాయి. ఆసక్తి కలిగిన అభ్యర్థులు జనవరి 31వ తేదీలోగా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు.
పోస్టుల వివరాలు ఇలా..
తెలంగాణ హైకోర్టు పరిధిలో పోస్టులు
కోర్టు మాస్టర్ అండ్ పర్సనల్ సెక్రటేరియస్ పోస్టుల సంఖ్య: 12
కంప్యూటర్ అపరేటర్ పోస్టుల సంఖ్య: 11
అసిస్టెంట్ పోస్టుల సంఖ్య: 42
ఎగ్జామినర్ పోస్టుల సంఖ్య: 24
టైపిస్ట్ పోస్టుల సంఖ్య: 12
కాపిస్ట్ పోస్టుల సంఖ్య: 16
సిస్టమ్ అనలిస్ట్ పోస్టుల సంఖ్య: 20
ఆఫీస్ సబార్డినేట్ పోస్టుల సంఖ్య: 75
తెలంగాణ జ్యుడీషియల్ మినిస్టీరియల్, సబార్డినేట్ సర్వీస్ పరిధిలో పోస్టుల వివరాలు..
నాన్ – టెక్నికల్ పోస్టుల సంఖ్య: 1277
టెక్నికల్ పోస్టుల సంఖ్య: 184
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పదోతరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత పనిలో అనుభవం కూడా కలిగి ఉండాలి. అభ్యర్ధుల వయోపరిమితి18 నుంచి 34 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడీబ్ల్యూడీ అభ్యర్థులకు పదేళ్ల వరకు గరిష్ఠ వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్ ద్వారా జనవరి 31, 2025వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు కింద రూ.600, ఎస్టీ/ ఎస్సీ/ ఈడబ్ల్యూఎస్, ఎక్స్ సర్వీస్‌మెన్, పీడబ్ల్యూబీడీఎస్ అభ్యర్థులకు రూ.400 చొప్పున చెల్లించవల్సి ఉంటుంది. కంప్యూటర్ ఆధారిత పరీక్ష నెలలో రాత పరీక్షలు ఉంటాయి.
Important Links:
FOR NOTIFICATION CLICKHERE.
FOR LATEST JOB NOTIFICATIONS CLICKHERE
COMMENTS