Stains on clothes do not go away..? Try this with alum
దుస్తులపై మొండి మరకలు పోవట్లేదా..? పటికతో ఇలా ట్రై చేసి చూడండి.. మెరుపు ఖాయం..!
బట్టలపై పడ్డ మరకలు ఒక్కోసారి చుక్కలు చూపిస్తుంటాయి. ఎంత క్లీన్ చేసినా అస్సలు పోవు.. అలాంటి మరకలతో ఇక మనకు ఇష్టమైన దుస్తులు ధరించాలంటే కష్టంగా మారుతుంది. కానీ, పటిక ఉపయోగించి ఈ మరకలను సులభంగా తొలగించవచ్చని మీకు తెలుసా..? పటిక మరకలను తొలగించడమే కాదు…బట్టల మెరుపును కూడా కాపాడుతుంది. పటిక నీళ్లలో వేసి బట్టలు ఉతకడం వల్ల బట్టలు ఎక్కువ కాలం కొత్తవిగా ఉంటాయి. పటికను ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం..
దుస్తులపై మొండి మరకలను సహజంగానే తొలగించేందుకు పటిక అద్భుతంగా ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులో లక్షణాలు మరకలను తొలగించటంలో మేలు చేస్తాయి. దీన్ని ఉపయోగించడం ద్వారా, ఆ క్లాత్ ఫైబర్ చెడిపోకుండా అన్ని మరకలను సులభంగా తొలగించవచ్చు.
బట్టలపై టీ మరకలను తొలగించడంలో పటికను ఉపయోగించడం చాలా ప్రభావవంతంగా ఉంటుంది. ఇందుకోసం పటిక పొడిని నీటిలో కలిపి పేస్ట్‌లా చేసి మరకపై రాయండి. దీన్ని సున్నితంగా రుద్దండి. ఆ తరువాత నీటితో శుభ్రం చేసుకోండి. దీంతో మరకలు తగ్గుతాయి.
బట్టలపై పసుపు రంగు చెమట మరకలను తొలగించడంలో పటిక నీరు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఒక గిన్నెలో గోరువెచ్చని నీటిని తీసుకుని అందులో పటికను కాసేపు ఉంచాలి. తడిసిన బట్టలపై ఈ నీటిని అప్లై చేస్తూ దానిని శుభ్రం చేయండి.
అలాగే, బట్టలపై నూనె మరకలు ఉంటే పటిక, ఉప్పు మిశ్రమాన్ని తయారు చేసి మరకపై రాయండి. దీన్ని అప్లై చేసి చేతులతో తేలికగా రుద్ది వదిలేయాలి. కొన్ని నిమిషాల తర్వాత మరక తగ్గుతుంది.
తెల్లని బట్టల నుండి మరకలను తొలగించడం చాలా కష్టం. కానీ పటిక నీరు తెల్లని బట్టల నుండి మరకలను కూడా తొలగిస్తుంది. దీన్ని మరక ఉన్న ప్రదేశంలో అప్లై చేసి 20 నిమిషాల పాటు అలాగే ఉంచి, ఆ తర్వాత వాష్ చేసకుంటే సరిపోతుంది. పటికతో బట్టలు శుభ్రం చేయడం సహజమైన, చౌకైన పరిష్కారం. ఇది చాలా మొండి మరకలను కూడా సులభంగా తొలగించడంలో సహాయపడుతుంది.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ApTeachers9.com బాధ్యత వహించదు.)
COMMENTS