Do you have the habit of walking with your hands in your pants pockets?
Psychology: చేతులు ఫ్యాంట్ పాకెట్‌లో పెట్టి నడిచే అలవాటు మీకూఉందా? అయితే మీ వ్యక్తిత్వం ఇదే
సాధారణంగా జేబులో చేతులు పెట్టుకుని నడవడం మీరు చాలా మందిని చూసే ఉంటారు. ఇది సాధారణ విషయం మాత్రమే కాదు.. దీని వెనుక చాలా అర్థాలున్నాయంటున్నారు మానసిక నిపుణులు. ఈ ప్రవర్తన మనకు పెద్ద విషయంగా అనిపించకపోయినా మానసిక, భావోద్వేగ స్థితికి దీనిని ఓ సంకేతంగా గుర్తిస్తారట. అవును. మన ప్రతి కదలిక ఒక్కో సంకేతం పంపుతుంది. ఒక వ్యక్తి నడుస్తున్నప్పుడు వారి చేతులను కదుపుతున్న విధానం కూడా వారి అంతర్గత భావాలను ప్రతిబింబిస్తుంది. కొన్నిసార్లు వీటిని ఆయా వ్యక్తుఉల గమనించకపోవచ్చు. ఈ రకమైన కదలికలు, సంజ్ఞలు అనేక రకాల భావోద్వేగాలు , వైఖరులను ఎదుటి వారికి తెలియజేస్తుంటాయి. ఇంతకీ వాటర్ధం ఏమిటో నిపుణుల మాటల్లో తెలుసుకుందాం..
పాకెట్స్‌లో చేతులు పెట్టుకుని నడిస్తే..
ఒక వ్యక్తి తన జేబులో చేతులు పెట్టుకుని నడిస్తే.. అతడే పరధ్యానం లేకుండా చాలా అలర్ట్‌గా ఉన్నాడని అర్ధం. ఇది ఒక రకంగా ఇతరుల నుంచి దాక్కోవడం లాంటిది. ఈ సంజ్ఞ ప్రత్యేకించి వ్యక్తి సామాజికంగా అసురక్షితంగా భావించినప్పుడు ఈ విధంగా చేతులు దాచుకుంటాడు. ఇలా చేయడం వల్ల భద్రతా భావం ఏర్పడుతుంది. అంటే మానసికంగా టెన్షన్‌ని తగ్గించుకుని ప్రశాంతంగా ఉండేందుకు చేసిన ప్రయత్నమే ఇదని అంటున్నారు నిపుణులు.
కొన్ని సందర్భాల్లో ఇది ఉదాసీనత, నిష్క్రియాత్మకతను కూడా సూచిస్తుంది. ఈ భంగిమ అర్ధాలు పూర్తిగా వ్యక్తిగతం. వ్యక్తి-వ్యక్తి పరస్పర చర్యను నివారించాలనే కోరిక కూడా కావచ్చు. ఉదాహరణకు.. ఎవరైనా చేతులను జేబులో పెట్టుకుని రద్దీగా ఉండే ప్రదేశంలో నడవడం మీరు గమనిస్తే.. ఆ వ్యక్తి దేనిలోనూ పాల్గొనకూడదని, అలాంటి విషయాల పట్ల ఉదాసీనతను ప్రదర్శిస్తున్నాడని అర్ధం చేసుకోవాలి. కొన్నిసార్లు ఈ భంగిమ ఒక వ్యక్తి తన వ్యక్తిగత సరిహద్దులను నిర్వహించడానికి కూడా సహాయపడుతుంది.
COMMENTS