Leave such bad habits.
ఇలాంటి చెడు అలవాట్లను వదిలేయండి..! మీ జుట్టు వద్దంటే ఒత్తుగా, పొడుగ్గా పెరుగుతుంది..
ప్రస్తుతం జుట్టు రాలడం అనేది ఒక సాధారణ సమస్యగా మారింది. దీంతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. కొంతమందిలో, జుట్టు రాలడానికి జన్యుకారణాలైతే మరికొందరిలో వారు వాడుతున్న మందులు కూడా కారణమవుతాయి. కానీ, రోజువారి అలవాట్ల వల్ల కూడా చాలా మందిలో జుట్టు రాలిపోయే సమస్య ఎక్కువగా ఉంది.. మన కొన్ని అలవాట్లు మన జుట్టును బలహీనపరుస్తాయి. క్రమంగా జుట్టు రాలిపోవటం మొదలవుతుంది. కాబట్టి జుట్టు రాలడానికి కారణమయ్యే ఈ చెడు అలవాట్లు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.
వేడి నీటితో తరచుగా స్నానం చేయడం:
సాధారణంగా చలికాలంలో వేడి నీళ్లతో స్నానం చేస్తాం. కానీ, పదే పదే వేడి నీళ్లతో తల స్నానం చేయడం వల్ల తలలోని సహజ నూనెలు తొలగిపోతాయి. దీని వల్ల జుట్టు పొడిబారి బలహీనంగా మారుతుంది. వారానికి రెండు సార్లు మాత్రమే గోరువెచ్చని నీటితో తల స్నానం చేయాలి. అది కూడా చాలా వేడి నీటితో కాదు.
జుట్టును గట్టిగా కట్టుకోవటం చేయరాదు:
జుట్టును జడ లేదా పోనీటైల్‌లో లేదా బన్‌లో గట్టిగా కట్టడం వల్ల జుట్టు మూలాలపై ఒత్తిడి పడుతుంది. దీని కారణంగా జుట్టు రాలడం ప్రారంభమవుతుంది. అందువల్ల ఎప్పుడూ జుట్టును గట్టిగా కట్టుకోవడం సరైనది కాదు.
తరచుగా స్టైలింగ్:
అది షాపింగ్ అయినా లేదా ఆఫీసు అయినా, మనం ఎప్పుడూ జుట్టును స్టైల్ చేయకుండా బయటకు వెళ్లము. ఇందుకోసం హెయిర్ డ్రైయర్, కర్లింగ్ ఐరన్, బ్లోవర్ డ్రైయర్ వంటి వాటిని ఎక్కువగా ఉపయోగించడం వల్ల జుట్టులోని సహజమైన తేమ తొలగిపోతుంది. దీని కారణంగా జుట్టు త్వరగా బలహీనంగా మారుతుంది. ఆ తర్వాత విరిగిపోతుంది. అందువల్ల, ఈ పరికరాల వినియోగాన్ని తగ్గించండి. సరైన హెయిర్ స్ప్రేని ఉపయోగించండి.
సరైన దువ్వెనను ఎంచుకోవాలి:
జుట్టు కోసం హార్డ్ లేదా ఎలా పడితే అలాంటి దువ్వెన ఉపయోగించవద్దు. ఇది జుట్టు రాలడానికి కారణం కావచ్చు. తడి జుట్టును ఎప్పుడూ దువ్వకండి. తడి జుట్టును ఎప్పుడు తేలికగా చేతులతో అల్లుకుని జుట్టు వేసుకోవాలి.
అనారోగ్యకరమైన ఆహారం:
మీ ఆహారంలో ప్రోటీన్, ఐరన్, జింక్, విటమిన్ల లోపం ఉంటే అప్పుడు కూడా జుట్టు రాలే సమస్య పెరుగుతుంది. అందుకే ఎప్పుడూ పౌష్టికాహారం తీసుకోవాలి. దీంతో జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.
తరచూ జుట్టుకు రంగు వేయడం:
మీరు తరచుగా మీ జుట్టుకు రంగులు వేయడం లేదా స్ట్రెయిట్ చేయడం వలన మీ జుట్టు బలహీనంగా మారుతుంది. చివరకు అది విరిగిపోతుంది. మీరు రసాయన చికిత్స చేయవలసి వస్తే, తేలికపాటి, తక్కువ హానికరమైన ఉత్పత్తులను మాత్రమే ఉపయోగించండి.
అధిక ఒత్తిడి, ఆందోళన:
మీకు ఎక్కువ ఒత్తిడి లేదా ఆందోళన ఉంటే, మీ జుట్టు అకాలంగా రాలడం ప్రారంభమవుతుంది. అందువల్ల, ఒత్తిడి, ఆందోళనను తగ్గించుకోవడానికి మీ దినచర్యలో యోగా, ధ్యానం, తేలికపాటి వ్యాయామాలను చేర్చుకోండి.
జుట్టుకు సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం:
మీ తల చర్మం శుభ్రంగా లేకుంటే జుట్టు రాలడం ప్రారంభమవుతుంది. ఎందుకంటే తలపై పేరుకున్న మురికి, నూనె, దుమ్ము జుట్టు రాలడానికి కారణమవుతుంది. అందువల్ల, మీ జుట్టును శుభ్రంగా ఉంచుకోండి. నూనెతో తలంతా పూర్తిగా మసాజ్ చేయండి.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. పలు వార్తా కథనాలు, నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే ఆరోగ్య నిపుణులను సంప్రదించండి.)
COMMENTS