Is this the meaning of barking dogs?
Dog's Cry Reasons: కుక్కల అరుపులకు అర్థం ఇదేనా..? ఇన్ని రోజులు మనకు తెలియకపాయే..
కుక్కలు అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది వాటి విశ్వాసం, స్వచ్ఛమైన స్నేహం. అవి మనతో ఉంటే ఒక ధైర్యం, ఒక భరోసా. కానీ, అవే ముద్దొచ్చే మూగజీవాలైనా రాత్రిపూట వింతగా ఏడుస్తుంటే లేదా నక్కల్లా ఊళ పెడుతుంటే (Dog howling) మనసు కాస్త కలవరపడుతుంది.
కుక్కలు అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది వాటి విశ్వాసం, స్వచ్ఛమైన స్నేహం. అవి మనతో ఉంటే ఒక ధైర్యం, ఒక భరోసా. కానీ, అవే ముద్దొచ్చే మూగజీవాలైనా రాత్రిపూట వింతగా ఏడుస్తుంటే లేదా నక్కల్లా ఊళ పెడుతుంటే (Dog howling) మనసు కాస్త కలవరపడుతుంది. ముఖ్యంగా వీధి కుక్కలు అన్నీ ఒక్కచోట చేరి ఏడిస్తే వెన్నులో వణుకు పుడుతుంది. ఏ పిశాచో లేదా దెయ్యమో వీధిలో తిరుగుతుందేమోనని ఆందోళన కలుగుతుంది. అసలు కుక్కలు ఎందుకిలా ఏడుస్తాయి? రాత్రి వేళల్లో ఆ వింత ఆర్తనాదాలకు కారణం ఏంటి? నిజంగానే వాటికి రాత్రి దెయ్యాలు కనిపిస్తాయా?
జీవ పరిణామ క్రమంలో, కుక్కలు తోడేళ్ల నుంచే ఉద్భవించాయని చెబుతారు. అందుకే వాటికి తోడేళ్లలా అరిచే అలవాటు వారసత్వంగా వచ్చింది. అడవుల్లో తోడేళ్లు తమ గుంపుతో చాలా దూరం వరకు కమ్యూనికేట్ చేయడానికి ఊళ పెడుతూ పెద్దగా అరుస్తాయి. అలాగే కుక్కలు కూడా వేరే కుక్కలతో కమ్యూనికేట్ కావడానికి లేదా దూరంగా వినిపించే శబ్దాలకు స్పందించడానికి ఇలా అరవచ్చు.
కుక్కలకు అసాధారణమైన వినికిడి సామర్థ్యాలు ఉంటాయి. అవి స్పేస్ నుంచి వచ్చే ఇన్‌ఫ్రాసోనిక్ సౌండ్స్ కూడా వినగలవు. ఇవి మానవులు వినలేని శబ్దాలు. ఫ్రీక్వెన్సీ 20 Hz కంటే తక్కువ ఉంటుంది. ఇలాంటి లో-ఫ్రీక్వెన్సీ సౌండ్స్ వినిపించినప్పుడు కూడా కుక్కలు బిగ్గరగా, ఏడుస్తున్నట్లు అరుస్తాయి.
తమ ప్రాంతాన్ని గుర్తించడానికి, ఇతరులు రాకుండా హెచ్చరించడానికి కుక్కలు ఏడ్చినట్టుగా అరుస్తాయి. రాత్రిపూట ఇతర జంతువులు లేదా మనుషులు దగ్గర్లో తిరుగుతుంటే ఈ ప్రవర్తన ఎక్కువగా కనిపిస్తుంది.
కుక్కలకు మనకంటే చాలా ఎక్కువ వినికిడి శక్తి ఉంటుంది. మనం వినలేని శబ్దాలను కూడా అవి పసిగట్టగలవు. సైరన్లు, ఇతర కుక్కలు అరవడం లేదా అడవి జంతువుల అరుపులు వినిపించినప్పుడు అవి అరవడం మొదలుపెడతాయి.
ముఖ్యంగా రాత్రిపూట ఒంటరిగా వదిలేస్తే కొన్ని కుక్కలు ఆందోళన చెందుతాయి, ఒంటరిగా ఫీలవుతాయి. అప్పుడు అవి దృష్టిని ఆకర్షించడానికి లేదా తమ బాధను తెలియజేయడానికి గట్టిగా అరుస్తూ, ఏడుస్తాయి.
కుక్కకు ఆరోగ్యం బాగోలేకపోతే లేదా నొప్పిగా ఉంటే కూడా అరవవచ్చు. ముఖ్యంగా వయసు పైబడిన కుక్కలు అకస్మాత్తుగా అరవడం మొదలుపెడితే, వెంటనే వెటర్నరీ డాక్టర్‌కు చూపించాలి.
కుక్కలు దెయ్యాల్ని చూడగలవా?
కుక్కలకు దెయ్యాలు కనిపిస్తాయనే నమ్మకం చాలా కాలంగా ఉంది. రాత్రిపూట దెయ్యాలని చూసే అవి ఏడుస్తాయని నమ్ముతారు. నిజానికి మనుషులతో పోలిస్తే కుక్కలకు ఇంద్రియాలు ఎక్కువ శక్తివంతంగా పనిచేస్తాయి. కానీ, అవి అతీంద్రియ శక్తులను చూడగలవు అని చెప్పడానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఖాళీ ప్రదేశంలోకి చూడటం లేదా ఉన్నట్టుండి మొరగడం లాంటి ప్రవర్తనలు వాటి చుట్టూ ఉండే వాతావరణంలో చిన్న మార్పులను గుర్తించడం వల్ల జరుగుతాయి. దానికి అతీంద్రియ శక్తులకు ఎలాంటి సంబంధం లేదు.
కుక్కల ఏడుపు చావుకు సూచనా?
కుక్కల ఏడుపు వినిపిస్తే ఏదో కీడు జరుగుతుందని, ముఖ్యంగా యజమాని లేదా వీధిలో ఎవరో ఒకరి ఇంట్లో ఎవరైనా చనిపోతారని కొందరు బలంగా నమ్ముతారు. అయితే ఇది తరతరాలుగా వస్తున్న అపోహ మాత్రమే. రాత్రివేళ కుక్కలు ఏడుపుకు, మరణానికి ఎలాంటి సంబంధం లేదు. ఇది కేవలం ప్రజల్లో ఉన్న ఒక మూఢనమ్మకం మాత్రమేనని గుర్తించాలి.
ఆపడానికి ఏం చేయాలి?
పెంపుడు కుక్క అయితే దానికి కంఫర్టబుల్ స్లీపింగ్ ప్లేస్ ఏర్పాటు చేయాలి. ఒంటరితనంతో బాధపడుతుంటే, మీకు దగ్గరగా పడుకోనివ్వాలి. పగటిపూట కుక్కను శారీరకంగా, మానసికంగా చురుకుగా ఉంచే పనులు చేయించాలి. దీనివల్ల రాత్రిపూట అవి ఏడవకుండా హాయిగా పడుకుంటాయి.
బయటి శబ్దాలు వినిపించకుండా కిటికీలు మూసివేయాలి లేదా వైట్ నాయిస్ మెషీన్లను ఉపయోగించాలి. అకస్మాత్తుగా అరవడం మొదలుపెడితే లేదా ఇతర ఆరోగ్య సమస్యలు కనిపిస్తే, వెంటనే వెటర్నరీ డాక్టర్‌ను సంప్రదించాలి. కుక్క రాత్రిపూట అరవడానికి గల కారణాలను అర్థం చేసుకుంటే, దాన్ని సమర్థవంతంగా పరిష్కరించవచ్చు.
COMMENTS