Did you know that all these are free on a train ticket?
Indian Railways: రైలు టికెట్‌పై ఇవన్నీ ఫ్రీగా ఉంటాయని మీకు తెలుసా..?
ఇండియన్ రైల్వే.. ప్రపంచంలో నాలుగో అతిపెద్ద రవాణా వ్యవస్థ. దేశంలో మొదటి స్థానంలో ఉంది. ప్రయాణికుల కోసం భారతీయ రైల్వే ఎన్నో సదుపాయాలను అందిస్తుంటుంది. మీరు రైలు టికెట్ కొన్న తర్వాత ఎన్నో ఉచిత సదుపాయాలు ఉంటాయన్న విషయం మీకు తెలుసా..? ఈ విషయం చాలా మందికి తెలియదు. మీరు రాజధానితో పాటు శతాబ్ధి వంటి ప్రీమియం ట్రైన్‌లోనే ప్రయాణించాలి. ఈ ఉచిత సదుపాయాలు పొందాలంటే మీరు రిజర్వేన్ చేసుకున్న టికెట్‌పై మాత్రమే వర్తిస్తాయి. మీరు వెళ్లే రైలు కనీసం రెండు గంటలు రైలు ఆలస్యం అయినట్లయితే మీకు ఉచితంగా భోజనం అందుతుంది. అలాగే మీరు ఏదైనా మంచి ఆహారం తినాలి భావిస్తే ఈ కేటరింగ్ సర్వీస్ ద్వారా కూడా ఉచితంగా ఆర్డర్ చేసుకోవచ్చు.
ఉచిత బెడ్‌షిట్: మీరు ఏసీ1, ఏసీ2, ఏసీ3 కోచ్ లలో ప్రయాణిస్తున్నట్లయితే మీకు ఉచితంగా దుప్పటి, ఒక దిండు, రెండు బెడ్ షీట్లు, ఒక టవల్ ను అందిస్తారు. అయితే చాలా మందికి టవల్ ఇస్తారని విషయం తెలిసిదు. కానీ ఇది కూడా అందిస్తారు.
ఉచిత వైద్యం: మీరు రైలులో ప్రయాణిస్తున్నప్పుడు మీకు ఏదైనా అనారోగ్యం సంభవించినట్లయితే ఉచితంగా వైద్య సేవలు పొందవచ్చు. మీకు జ్వరం వచ్చినా టీటీ ని అడిగితే మెడిసిన్ అందుబాటులో ఉంటాయి.
ఉచిత వెయింటింగ్ హాల్ సదుపాయం: మీరు టికెట్ తీసుకున్న తర్వాత మీరు ఎక్కే రైలు ఆలస్యంగా వస్తున్నట్లయితే ఉచితంగా వెయిటింగ్ హాల్‌లో ఉండవచ్చు. ఎలాంటి డబ్బులు వసూలు చేయరు.
లగేజ్ ఉంచేందుకు లాకర్: మీరు రైల్వే స్టేషన్‌లో లగేజీని ఉంచేందుకు ఉచితంగా లాకర్ రూమ్ సదుపాయం పొందవచ్చు. క్లోక్ రూమ్ అలిచే ఈ గదులలో మీరు మీ వస్తువులను గరిష్టంగా 1 నెల వరకు ఉంచుకునేందుకు అవకాశం ఉంటుంది. కాని డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. అయితే మీ టికెట్‌పై రాయితీ ఉంటుంది.
COMMENTS