PAN CARD ACTIVE LOANS
తీసుకున్న లోన్స్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలా? పాన్‌కార్డు ఉంటే చాలు- ఇలా చేయండి!
How To Check Pan Card Active Loans : బ్యాంకులైనా, ఆర్థిక సంస్థలైనా పాన్‌కార్డు ఉంటేనే రుణాలను మంజూరు చేస్తాయి. అందుకే మనం తీసుకునే రుణం వివరాలను పాన్ కార్డుతోనూ తెలుసుకోవచ్చు. మనకు ఉన్న రుణాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవడం వల్ల క్రెడిట్ హిస్టరీపై స్పష్టమైన అవగాహన వస్తుంది. పాన్‌కార్డుతో లింక్ అయి ఉన్న రుణాల సమాచారాన్ని తెలుసుకునేందుకు అందుబాటులో ఉన్న కొన్ని మార్గాల గురించి ఈ కథనంలో తెలుసుకోవచ్చు.
అన్ సెక్యూర్డ్ వ్యక్తిగత రుణాలను పూచీకత్తు లేకుండానే మంజూరు చేస్తారు. సెక్యూర్డ్ వ్యక్తిగత రుణాలను పూచీకత్తుతో మాత్రమే ఇస్తారు. ఈక్రమంలో ఆధార్ కార్డుతో పాటు పాన్ కార్డును కూడా దరఖాస్తుదారుడు సమర్పించాల్సి ఉంటుంది. అందువల్లే మనం తీసుకునే రుణాల చిట్టా ఆయా కార్డులలోనూ నిక్షిప్తం అవుతుంది. పాన్‌కార్డుతో లింక్ అయి ఉన్న రుణాల వివరాలను తెలుసుకునేందుకు మనం క్రెడిట్ బ్యూరో సర్వీసుల నుంచి క్రెడిట్ రిపోర్టులను తీసుకోవాలి. మనం రుణం తీసుకున్న ఫిన్‌టెక్ యాప్‌లను సంప్రదించి ఆ సమాచారాన్ని తెలుసుకోవచ్చు. మనకు లోన్‌ను మంజూరు చేసిన బ్యాంకు లేదా ఆర్థిక సంస్థను నేరుగా సంప్రదించి ఈ వివరాలను చెప్పమని అడగొచ్చు.
క్రెడిట్ బ్యూరోల నుంచి
పాన్‌కార్డుతో లింక్ అయిన రుణాల సమాచారం మీకు ఏ క్రెడిట్ బ్యూరో నుంచి కావాలో దాని వెబ్‌సైట్‌లోకి వెళ్లండి.
మీరు కొత్త యూజర్ అయితే ఆ వెబ్‌సైటులో రిజిస్టర్ చేసుకోండి.
మీ పేరు, పాన్ నంబరు, చిరునామా ధ్రువ పత్రాలు, ఇతర డాక్యుమెంట్లను నమోదు చేయండి.
రిజిస్ట్రేషన్ చేసుకునే క్రమంలో మీ ఫోనుకు ఓటీపీ వస్తుంది. దాన్ని నమోదు చేసి వేరిఫై చేసుకోవాలి.
వేరిఫికేషన్ పూర్తయ్యాక పాన్ కార్డుతో లింక్ అయి ఉన్న రుణాల సమాచారాన్ని మీరు చూడగలుగుతారు.
ఫిన్‌టెక్ యాప్స్ ద్వారా
మీరు లోన్ తీసుకున్న ఫిన్‌టెక్ యాప్‌లోకి వెళ్లి రిజిస్టర్ చేసుకోండి.
బ్యాంకు ఖాతా, పాన్ నంబరు వివరాలను సమర్పించి కేవైసీని పూర్తి చేసుకోండి.
రిజిస్ట్రేషన్ వివరాల ఆధారంగా యాప్‌లోకి లాగిన్ కండి.
యాప్‌లోకి వెళ్లి మీరు తీసుకున్న రుణం వివరాలను చెక్ చేయండి.
రుణం తీసుకునే క్రమంలో పాన్ కార్డును సమర్పించారా లేదా అనేది తనిఖీ చేయండి.
నేరుగా బ్యాంకు నుంచి
మీరు నేరుగా బ్యాంకు/ఆర్థిక సంస్థ కార్యాలయానికి వెళ్లి రుణం తీసుకునే సమయంలో పాన్ కార్డును ఇచ్చారా లేదా అనేది తెలుసుకోవచ్చు.
ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా కూడా ఈ వివరాలు మీకు లభిస్తాయి.
బ్యాంకు కస్టమర్ కేర్‌కు కాల్ చేసి కూడా ఈ సమాచారాన్ని అడగొచ్చు.
బ్యాంకుకు కాల్ చేసినప్పుడు మీ పూర్తి పేరు, పాన్ నంబరు, బ్యాంకుఖాతా సంఖ్య, లోన్ అకౌంటు నంబరు వంటి వివరాలు ఇవ్వండి.
ఏదైనా గుర్తింపు కార్డు వివరాలు లేదా ఓటీపీ ధ్రువీకరణను సమర్పించాలని సదరు బ్యాంకు కస్టమర్ కేర్ అధికారి మిమ్మల్ని అడిగే అవకాశం ఉంటుంది.
వెరిఫికేషన్ పూర్తయ్యాక మీ లోన్‌తో పాన్ లింక్ అయి ఉందా లేదా అనేది చెబుతారు.
మొబైల్ బ్యాంకింగ్
మీరు రుణం తీసుకున్న బ్యాంకు లేదా ఆర్థిక సంస్థకు మొబైల్ యాప్ ఉంటుంది. దానిలోకి లాగిన్ కండి.
పాన్ కార్డు నంబరు, బ్యాంకు ఖాతా నంబరు ద్వారా లాగిన్ ఐడీని క్రియేట్ చేసుకోండి.
వెరిఫికేషన్ పూర్తి కాగానే యాప్‌లోకి లాగిన్ అవుతారు.
మీ రుణ వివరాల సెక్షన్‌లో పాన్ కార్డు లింక్ అయి ఉందా లేదా అనేది చెక్ చేసుకోవచ్చు
COMMENTS