EV Station Business
EV Station: ఈ బిజినెస్‌కి డిమాండ్ ఎక్కువ కాంపిటేషన్ తక్కువ.. జస్ట్ రూ.65 వేలు ఉంటే సరిపోతుంది..
EV Station: బిజినెస్ చేయాలనుకుంటున్నారా అయితే ఈ వ్యాపారం కోసం తెలుసుకోండి. చాలా తక్కువ ఖర్చుతో ఈ బిజినెస్‌కి డిమాండ్ ఎక్కువ కాంపిటేషన్ తక్కువ.. జస్ట్ రూ.65 వేలు ఉంటే సరిపోతుంది..
ప్రస్తుత కాలంలో ఎలక్ట్రిక్ వాహనాలు (EVs) ప్రపంచ వ్యాప్తంగా మరింత ప్రజాదరణ పొందుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం EVs వినియోగాన్ని ప్రోత్సహించేందుకు కొన్ని కీలక చర్యలు తీసుకుంటోంది. అయితే, EV తయారీదారులు ఎదుర్కొంటున్న ఒక ముఖ్యమైన సవాలు, దేశవ్యాప్తంగా ఉన్న EV ఛార్జింగ్ స్టేషన్ల కొరత. ఈ సమస్యను దృష్టిలో పెట్టుకొని, EV ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయడం వాణిజ్య రంగంలో మంచి అవకాశంగా మారింది. అయితే, ఈ వ్యాపారం ప్రారంభించేందుకు కొన్ని ప్రాధమిక దశలు పాటించడం అవసరం.
ఏర్పాటు విధానం:
భారత ప్రభుత్వం ప్రకారం, EV ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేయడానికి ప్రత్యేకమైన లైసెన్స్ అవసరం లేదు. అయితే, పవర్ మినిస్ట్రీ ఇచ్చిన సాంకేతిక ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలి. భారత ప్రభుత్వ మార్గదర్శకాలు, EV ఛార్జింగ్ స్టేషన్లు వ్యవస్థాపించేందుకు కొన్ని కీలక సూచనలు ఉన్నాయి వాటిలో
చార్జింగ్ స్టేషన్ల స్థానం : పట్టణాల్లో ప్రతి 3 కి.మీ., జాతీయ రహదారుల్లో 25 కి.మీ, బరువు వాహనాలకు 100 కి.మీ.
సింగిల్ పార్ట్ టారిఫ్: 2025 మార్చి 31 వరకు EV ఛార్జింగ్ స్టేషన్లలో విద్యుత్ టారిఫ్ సగటు సరఫరా ఖర్చును మించకుండా ఉండాలి.
ఆన్‌లైన్ సేవలు: పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లు కోసం ఆన్‌లైన్ నెట్‌వర్క్ సర్వీస్ ప్రొవైడర్‌తో ఒప్పందం కుదుర్చుకోవాలి.
ప్రాసెస్: మీ ప్రాంతం ఆధారంగా వేగవంతమైన ఛార్జర్లు, తేలికపాటి ఛార్జర్లు వంటి మోడళ్లను ఎంపిక చేయాలి. హైవేలను అనుసరించి, రెస్టారెంట్ల దగ్గర వేగవంతమైన ఛార్జర్లు అత్యవసరం. కొన్ని రాష్ట్రాలు EV ఛార్జింగ్ స్టేషన్లకు సబ్సిడీలు లేదా తక్కువ ధరల విద్యుత్ టారిఫ్ వంటి ప్రోత్సాహకాలు అందిస్తాయి. ఛార్జింగ్ స్టేషన్ డిజైన్, ప్రమోషన్, నిర్వహణలో సహకరించగల భాగస్వామిని ఎంపిక చేయడం ముఖ్యం. EV ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటుకు రూ. 1 లక్ష నుంచి రూ. 50 లక్షల వరకు ఖర్చు అవుతుంది. ఛార్జర్ మోడల్, భూమి లీజు, ఇతర అవసరాలపై ఖర్చులు ఆధారపడి ఉంటాయి.
ఛార్జర్ ఖర్చులు: భారత్ AC – 001 రూ. 65,000, భారత్ DC – 001 రూ. 2,47,000, CCS ఛార్జర్ రూ. 14,00,000 1 ఖర్చు అవుతుంది. FAME India Scheme Phase II కింద రూ. 800 కోట్లు మంజూరు చేస్తాయి. పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్ల కోసం 60% ఖర్చును ప్రభుత్వం భరిస్తోంది. EV ఛార్జింగ్ స్టేషన్లు నగరాలు, హైవేలు, కార్యాలయాలు, హోటళ్ల వద్ద అందుబాటులో ఉంటే, ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతుంది. EV ఛార్జింగ్ స్టేషన్ల విస్తరణ పర్యావరణ పరిరక్షణలో సహాయపడుతుంది, కాబట్టి దీనికి సంబంధించి ప్రభుత్వం ఇంకా మరిన్ని ప్రోత్సాహకాలు అందిస్తోంది. EV ఛార్జింగ్ స్టేషన్లను ప్రముఖ కంపెనీలతో భాగస్వామ్యం చేసి ఫ్రాంచైజీగా స్థాపించవచ్చు. ఈ ఫ్రాంచైజీలు సులభంగా స్థాపించడానికి సాంకేతిక సహాయం, మార్కెటింగ్ సపోర్ట్ అందిస్తాయి. EV ఛార్జింగ్ స్టేషన్ల స్థాపన అనేది వ్యాపారంలో మంచి అవకాశాన్ని తీసుకొస్తుంది. సరైన ప్రణాళిక, సాంకేతిక ప్రమాణాలు, ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించడం ద్వారా ఈ వ్యాపారంలో విజయవంతం కావచ్చు. EV రంగం వేగంగా పెరుగుతోంది, అందుకే ఇందులో ముందడుగు పెట్టడం మంచిది.
COMMENTS