He doesn't speak a single word.. but he has been giving IAS coaching for several years..
Trending: ఒక్క మాట మాట్లాడడు.. కానీ కొన్నేళ్లుగా ఐఏఎస్ కోచింగ్ ఇస్తున్నాడు.. ఈ వింత మనిషి కథేంటంటే..
అందరూ ‘చాయ్‌వాలే బాబా (Chai Wale Baba)’గా పిలిచే ఆ వ్యక్తి పేరు దినేశ్ స్వరూప్ బ్రహ్మచారి. ఆయన గత 40 సంవత్సరాలుగా ఫ్రీగా సివిల్స్ కోచింగ్ ఇస్తున్నారు.
చదువు ఎంత ఖరీదుగా మారిందో చెప్పాల్సిన అవసరం లేదు. ఎల్‌కేజీకే లక్షలు కుమ్మరించాల్సిన పరిస్థితి. ఇక సివిల్స్ వంటి అత్యున్నత స్థాయి ఉద్యోగాల కోసం ఇచ్చే కోచింగ్‌కు అయ్యే ఖర్చు అంతాఇంతా కాదు. అయితే ఓ వ్యక్తి బాగాగా మారి సన్యాసం తీసుకున్నా సరే, UPSCకి ఫ్రీగా కోచింగ్ ఇస్తున్నాడు. అంతడి మెంటార్‌షిప్ ఎంతోమంది జీవితాలకు ఆశాదీపంగా మారింది. అందరూ ‘చాయ్‌వాలే బాబా (Chai Wale Baba)’గా పిలిచే ఆ వ్యక్తి పేరు దినేశ్ స్వరూప్ బ్రహ్మచారి.
ఎప్పుడూ కాషాయ దుస్తులు ధరించి పొడవాటి గడ్డం, జుట్టుతో కనిపించే ఈ ‘చాయ్‌వాలే బాబా’ (Chai Wale Baba) తన జీవితాన్ని IAS కోచింగ్‌కే అంకితం చేశారు. అందరికీ సమాన అవకాశాలు కల్పించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నారు. ఎలాంటి బ్యాగ్రౌండ్ నుంచి వచ్చిన వారికైనా గైడెన్స్ ఇస్తున్నారు. ఎవరికీ రిసోర్సెస్ ఒక పరిమితి కాకూడదనేదే తన లక్ష్యమని చెబుతున్నారు.
మాట మాట్లాడకుండానే..
కోచింగ్ ఇవ్వాలంటే గంటల తరబడి క్లాసులు చెప్పాల్సిందేగా అనుకుంటారు అందరూ. కానీ, ఈ బాబా మాత్రం అలా కాదు. అసలు ఆయన నోరు తెరవనే తెరవరు. ఎప్పుడూ దేవుడి దీక్షలో ఉంటూ మౌనవ్రతం పాటిస్తారు. కేవలం సైగల ద్వారానే అభ్యర్థులను గైడ్ చేస్తారు. వాట్సప్ ద్వారా నోట్స్ ఇస్తారు. ఇతరత్రా ఆదేశాలు, మెసేజ్‌లు కూడా వాట్సప్ ద్వారానే. అయినప్పటికీ.. వేలాది మంది ఆయన దగ్గర మెంటార్‌షిప్ తీసుకుంటున్నారు. ఏ డౌట్ ఉన్నా సరే, ఆయనకు వాట్సప్ చేస్తే సరిపోతుంది. వెంటనే ఆన్సర్ రిప్లై వస్తుంది.
కేవలం చాయ్ మాత్రమే
ఈ బాబాకు సంబంధించిన మరో విశేషమేమంటే.. ఆయన అసలు ఎలాంటి ఘనాహారం తినరు. కేవలం రోజుకు 10 కప్పుల చాయ్ మాత్రమే తాగుతారు. అందుకే ఆయన్ని అందరూ చాయ్‌వాలే బాబాగా పిలుస్తారు. గత 40 ఏళ్లుగా ఆయన ఇదే జీవనశైలిని అనుసరిస్తుండటం విశేషం.
ఏ సహాయం కావాలన్నా రెడీ
‘‘నేను బాబాతో ఐదారేళ్లుగా ప్రయాణం చేస్తున్నాను. మేమంతా ఆయన శిష్యులం. ఎప్పుడు ఏ సాయం కావాలన్నా ఆయన మాకు గైడెన్స్ అందిస్తారు. ఎప్పుడూ మౌనంగా ఉండే ఆయన సైగలు, సంకేతాలు, వాట్సప్ మెసేజ్‌ల ద్వారా మమ్మల్ని గైడ్ చేస్తారు. ఏమైనా డౌట్ ఉంటే మెసేజ్ చేస్తే చాలు, ఆన్సర్ రిప్లై ఇస్తారు. నోట్స్ కూడా వాట్సప్ ద్వారానే పంపుతారు’’ అని ఓ అభ్యర్థి వెల్లడించారు.
అందుకే మౌనం
చాయ్ వాలే బాబా బీఎస్సీ గ్రాడ్యుయేట్. ఆయన గత 40 సంవత్సరాలుగా ఫ్రీగా సివిల్స్ కోచింగ్ ఇస్తున్నారు. విద్యార్థులను ఎడ్యుకేట్ చేయడమే తన లక్ష్యమని బాబా వెల్లడించారు. మౌనంగా ఉండడం వల్ల శక్తిని కూడగట్టుకోవచ్చని వివరించారు. తద్వారా సమాజానికి మంచి చేసే అవకాశం లభిస్తుందని తెలిపారు.
ప్రపంచంలోనే అత్యంత కఠినమైన పరీక్షల్లో సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ఒకటి. ఏటా లక్షలాది మంది హాజరవుతుంటారు. తన శక్తియుక్తులన్నింటి కూడగట్టుకొని ప్రీపేర్ అవుతుంటారు. కానీ, కొంత మంది మాత్రమే సక్సెస్ అవుతారు. ఈ క్రమంలో కొంత మంది సొంతంగా ప్రిపేర్ అయితే, మరికొంత మంది కోచింగ్ తీసుకుంటుంటారు. అయితే, ఇంతటి కఠిన పరీక్షలో మెంటార్‌షిప్ పాత్ర చాలా కీలకమని చాలా మంది అభ్యర్థులు చెబుతుంటారు.
సొంతంగా ప్రిపరేషన్‌తో కొట్టే సత్తా కొంతమందిలోనే ఉంటుంది. వారికి కూడా సమయం పడుతుంది. మరి ఇలాంటి ఉన్నతస్థాయి ఉద్యోగానికి అవసరమయ్యే కోచింగ్‌ను ఉచితంగానే అందించడం అంటే మామూలు విషయం కాదు. అదీ ఎలాంటి ఆహారం తీసుకోకుండా, మాట మాట్లాడకుండా అభ్యర్థులను గైడ్ చేస్తున్న చాయ్‌వాలే బాబాకు ‘సెల్యూట్ చేయాల్సిందే’.
COMMENTS