Bird Lover Turns His House In To A Bird Sanctuary In Karimnagar
Telangana: పిచ్చుకల కోసం తన ఇంటినే.. ఈ కరీంనగర్ యువకుడి కృషిని అభినందించాల్సిందే..
కరీంనగర్ లో ని కిసాన్ నగర్ చెందిన అనంతుల రమేష్ ఇంటి ఆవరణలో ఎటు చూసినా పిచ్చుకలు కనిపిస్తుంటాయి. వాటి కోసం అతను ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశాడు. మొదట ఒక్కటి, రెండు పక్షులు ఇంటి అవరణకు వచ్చే వి. వీటికి గూడు లేక. ఆహారం లేక ఇబ్బందిపడ్డాయి. ఇది రమేష్ గమనించాడు. దీంతో పిచ్చుకల కోసం గూళ్లు ఏర్పాటు చేశాడు. వాటికి కావాల్సిన ఆహారం కూడా ఏర్పాటు చేశాడు. ఇంటి ఆవరణలో చెట్లు కూడా ఉండటంతో క్రమంగా వీటి సంఖ్య పెరిగిపోయింది.. వేసవి కాలంలో… నీటిని అదనంగా ఏర్పాటు చేశాడు. దీంతో పిచ్చుకలన్నీ ఇక్కడికే వస్తున్నాయి. దాదాపుగా 300 నుంచీ 400 వరకు పిచ్చుకలు ఈ ఇంటి అవరణలో కనిపిస్తాయి. వీటికి ఆహారంగా వివిధ రకాల గింజలను ఏర్పాటు చేశారు. కొన్ని పక్షులు సహజంగానే.. ఇక్కడ గూళ్లు ఏర్పాటు చేసుకున్నాయి. రమేష్ కూడా వాటి కోసం డబ్బాలు ఏర్పాటు చేసి వాటిలో.. ఆహారాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. దీంతో ఉదయం ఆరు గంటలకు ఈ ఇంటి నిండా ఎటు చూసినా పక్షులే దర్శనమిస్తున్నాయి. వాటి అరుపులతో ఇంట్లో వాతావరణం ఆహ్లాదకరంగా మారుతుంది. వివిధ ప్రాంతాలకు వెళ్లిన తరువాత.. సాయంత్రం ఆరు తరువాత… మళ్లీ గూటికి చేరుకుంటాయి. ఈ ప్రాంతంలో ఇతనిని పిచ్చుక రమేష్ అని పిలుస్తుంటారు.
అంతేకాదు పాఠశాల విద్యార్థులు పిచ్చుకలను చూడటానికి కోసమే ప్రత్యేకంగా ఈ ఇంటికి వస్తున్నారు . సెల్ ఫోన్లో పిచ్చుకల ఫోటోలు తీసుకుని మురిసిపోతున్నారు. కాసేపు.. ఈ ప్రాంతంలో సరదాగా గడుపుతున్నారు. పిచ్చుకల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశానని రమేష్ చెబుతున్నారు. వాటికి ఆహారంతో పాటు.. నీటిని అందిస్తున్నానని చెబుతున్నారు.
కాగా వేసవి కాలంలో పిచ్చుకల కోసం అధికంగా తాగు నీటిని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందంటున్నారు రమేష్. ఈ ప్రాంతం లో వీటి సంఖ్య రోజు రోజు రోజుకూ పెరుగుతుందని హర్షం వ్యక్తం చేస్తున్నాడు. పిచ్చుకలు ఇంట్లోకి వస్తే చాలా సంతోషంగా ఉంటుందని రమేష్ చెబుతున్నారు.
COMMENTS