Why is 'Rupees Only' written on the cheque? What happens if you don't write?
Bank Cheque: చెక్కుపై ‘రూపాయిలు’ అని ఎందుకు రాస్తారు? రాయకపోతే ఏమవుతుంది?
బ్యాంక్ చెక్కు ద్వారా చెల్లింపు చేయడానికి సంబంధించి అనేక నియమాలు ఉన్నాయి. కానీ చాలా మందికి వాటి గురించి తెలియదు. బ్యాంకు కొన్నిసార్లు చెల్లింపు చేయడానికి నిరాకరించడానికి ఇదే కారణం. చెక్కులపై సంతకాల విషయంలో తీసుకున్న జాగ్రత్తల గురించి అందరికీ తెలుసు. అయితే చెక్కులపై పదాలలో ఉన్న కొన్నింటి అర్థం ఏంటో తెలుసా? చెక్కుపై మొత్తం సంఖ్యలతో పాటు పదాలలో రాస్తుంటాము. చెక్కుపై పదాలతో మొత్తాన్ని రాసిన తర్వాత ‘రూపాయిలు మాత్రమే’ అదే ఇంగ్లీష్‌లో అయితే ఓన్లీ (Repees Only) అని రాస్తారు. కానీ, కొందరు మాత్రం డబ్బును అంకెల్లో రాసి అక్షరాల్లో రాయడం మర్చిపోతారు. చెక్కుపై రూపాయలు మాత్రమేనని ఎందుకు రాస్తారో తెలుసా?
చెక్కుపై రూపాయిల ముందు ‘మాత్రమే’ అని ఎందుకు రాయాలి?
చెక్‌పై సంతకం చేసేటప్పుడు ఎల్లప్పుడూ “రూపాయలు” తర్వాత మాత్రమే రాయాలి. ఎందుకంటే చెక్ ట్యాంపరింగ్ నిరోధించడానికి ఇది ఒక ముఖ్యమైన పదం. మీరు మొత్తం లేకుండా కేవలం “రూ” అని రాస్తే చెల్లించాల్సిన మొత్తాన్ని పెంచుకునేందుకు ఆస్కారం ఉంటుంది. దీని వల్ల మీరు రాసిన దానికంటే ఎక్కువ విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. అందుకే అంకెల్లో లేదా పదాలను జోడించవచ్చు.
చెక్‌పై మొత్తాన్ని అంకెల్లోనే కాకుండా అక్షరాలలో రాస్తే మంచిది. అంకెల తర్వాత చివర పదాలతో రాయడం వలన ఎవరైనా చెక్కును మార్చడం, పెద్ద మొత్తాన్ని క్లెయిమ్ చేయడం కష్టం అవుతుంది.
కరెన్సీని “రూపాయిలు మాత్రమే” అని రాయడం వలన ఉద్దేశించిన మొత్తం గురించి ఎటువంటి గందరగోళం ఉండదని నిర్ధారిస్తుంది.
చెక్కుల విషయంలో మోసాన్ని నిరోధించడానికి భద్రతా కారణాల దృష్ట్యా బ్యాంకింగ్ వ్యవస్థల్లో ఇది ఒక ప్రామాణిక విధానం.
అయితే ఇప్పుడు ఇంటర్నెట్ బ్యాంకింగ్ యుగంలో చెక్కుల ద్వారా లావాదేవీలు తగ్గిపోయాయి. కానీ, మీరు ఏదైనా పరిస్థితిలో చెక్ జారీ చేస్తే, దానికి సంబంధించిన నియమాలను తెలుసుకోవడం ముఖ్యం. అందుకే మీరు మొత్తాన్ని అంకెలను వేసిన తర్వాత కూడా ఆ మొత్తాన్ని అక్షరాలలో రాయడం మర్చిపోవద్దు. అక్షరాలలో చివరగా రూపాయలు మాత్రమేనని రాయడం మంచిది.
COMMENTS