SBI PO 2025 Notification
ఏదైనా డిగ్రీ అర్హతతో.. 600 గవర్నమెంట్ బ్యాంక్ ఉద్యోగాలు.. ప్రారంభం నుంచే మంచి జీతం!
SBI PO Recruitment 2025 : దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (State Bank of India), సెంట్రల్ రిక్రూట్‌మెంట్ అండ్ ప్రమోషన్ డిపార్ట్‌మెంట్, కార్పొరేట్ సెంటర్.. భారీ ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ 600 ప్రొబేషనరీ ఆఫీసర్ల (Probationary Officers) పోస్టులను భర్తీ చేయనుంది. ఈ ప్రొబేషనరీ ఆఫీసర్ల నియమకాలకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ డిసెంబర్ 27వ తేదీ నుంచి ప్రారంభం అవుతుంది.
2025 జనవరి 16 దరఖాస్తు చేసుకోవడానికి చివరితేది. ఈ పోస్టులకు సంబంధించిన అభ్యర్థులను ప్రిలిమ్స్, మెయిన్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. Probationary Officer ఉద్యోగాల ఎంపికైతే రెండేళ్లు ప్రొబేషనరీ పీరియడ్ ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు దేశ వ్యాప్తంగా ఉన్న ఎస్‌బీఐ శాఖల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. అలాగే.. నెలకు రూ.48,480 నుంచి రూ.85,920 వరకు వేతనం ఉంటుంది. అభ్యర్థులు పూర్తి వివరాలను అధికారిక వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. అలాగే అప్లయ్ చేసుకోవడానికి అప్లికేషన్ లింక్ ఇదే.
ఇతర ముఖ్యమైన సమాచారం :
ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులు : 600
అర్హతలు: ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. డిగ్రీ చివరి సంవత్సరం ఫైనల్ పరీక్షలు రాసిన అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
వయోపరిమితి : దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థుల వయసు 01.04.2024 నాటికి 21 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీత భత్యాలు: నెలకు రూ.48,480 నుంచి రూ.85,920 వరకు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: రూ.750 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు చెల్లింపు మినహాయింపు ఉంటుంది).
దరఖాస్తు విధానం : ఆన్‌లైన్ విధానంలో అప్లయ్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఎంపిక విధానం: ఫేజ్ 1- ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, ఫేజ్ 2- మెయిన్ ఎగ్జామినేషన్, ఫేజ్ 3- సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ ఎక్సర్‌సైజ్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
ముఖ్యమైన తేదీలు :
ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభతేది : డిసెంబర్ 27, 2024
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది : జనవరి 16, 2025
ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కాల్ లెటర్ల డౌన్‌లోడ్ : 2025, ఫిబ్రవరి చివరి వారంలో..
స్టేజ్ 1- ఆన్‌లైన్ ప్రిలిమినరీ పరీక్ష తేదీలు : మార్చి 8, 15, 2025
ప్రిలిమినరీ పరీక్ష ఫలితాల ప్రకటన : ఏప్రిల్ 2025
మెయిన్ ఎగ్జామినేషన్ కాల్ లెటర్ డౌన్‌లోడ్ : 2025, ఏప్రిల్ రెండో వారంలో..
స్టేజ్ 2- ఆన్‌లైన్ మెయిన్ ఎగ్జామ్ : 2025, ఏప్రిల్/ మే నెలలో
మెయిన్ పరీక్ష ఫలితాల ప్రకటన : మే/ జూన్ 2025
ఫేజ్-3 కాల్ లెటర్ డౌన్‌లోడ్ : మే/ జూన్, 2025
ఫేజ్ 3- సైకోమెట్రిక్ పరీక్ష : మే/ జూన్, 2025
ఇంటర్వ్యూ, గ్రూప్ ఎక్సర్‌సైజ్ తేదీలు : మే/ జూన్, 2025
తుది ఫలితాల ప్రకటన : మే/ జూన్, 2025.
Important Links:
FOR WEBSITE & APPLY CLICKHERE.
FOR LATEST JOB NOTIFICATIONS CLICKHERE
COMMENTS