Just pay Rs. 50 and apply for a new PAN card at your home!
PAN Card: కేవలం రూ.50 చెల్లిస్తే చాలు మీ ఇంటికే కొత్త పాన్ కార్డ్.. దరఖాస్తు చేయండిలా!
PAN Card: పర్మినెంట్ అకౌంట్ నంబర్ (PAN) కార్డు అనేది అందరికీ తెలిసిందే. ఏ ఆర్థిక లావాదేవీ చేయాలన్నా ఇది తప్పనిసరి. ముఖ్యంగా వస్తువులను అమ్మడం, కొనడం, విసాకి అప్లై చేయాలన్నా, అతి ముఖ్యంగా ఇన్ కమ్ ట్యాక్స్ రిటర్న్(ఐటీఆర్) దాఖలుకు పాన్ కార్డు తప్పనిసరిగా ఉండాల్సిందే. ఎక్కువ మొత్తంలో బ్యాంకులో డబ్బులు డిపాజిట్ చేయాలన్నా పాన్ తప్పనిసరి ఇవ్వాల్సిందే. ఇది పది సంఖ్యలతో ఉంటుంది. ప్రతి పాన్ కార్డు జీవిత కాల వ్యాలిడిటీతో ఇన్ కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ మంజూరు చేస్తుంది.
ట్యాక్స్ పేయర్లతో పాటు రూ.50 వేలకు మించి ఆర్థిక లావాదేవీలు నిర్వహించే వారు సైతం పాన్ కార్డును చూపించాల్సి ఉంటుంది. దీంతో చాలా మంది పాన్ కార్డు తీసుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవలే పాన్ 2.0 ప్రాజెక్టును ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ పాజెక్టులో భాగంగా క్యూఆర్ కోడ్‌తో కొత్త పాన్ కార్డు ప్రింటింగ్ మొదలు పెట్టింది. తమ పాన్ కార్డు రీప్రింట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. మరి అది ఎలాగో చూద్దాం.
కొత్త పాన్ కార్డు:
మీరు క్యూఆర్ కోడ్‌తో ఉండే కొత్త పాన్ కార్డు పొందాలనుకుంటే ఈజీగా దరఖాస్తు చేసుకోవచ్చు. కేవలం రూ.50 చెల్లిస్తే మీ ఇంటికే కొత్త పాన్ కార్డ్ పోస్టు ద్వారా వచ్చేస్తుంది.
NSDL ద్వారా పాన్ కార్డ్ రీప్రింట్ ప్రక్రియ:
- ముందుగా ఎన్ఎస్‌డీఎల్ వెబ్‌సైట్లోకి వెళ్లి అందులో పాన్ రీప్రింట్ పేజీలోకి వెళ్లాల్సి ఉంటుంది.
- మీ పాన్ కార్డ్, ఆధార్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్ తదితర వివరాలు నమోదు చేసి సబ్మిట్ చేయాలి.
- స్క్రీన్ పై కనిపించే వివరాలను చెక్ చేసుకోవాలి. అన్నీ సరిగ్గా ఉంటే ఓటీపీ కోసం జనరేట్ ఓటీపీ ఆప్షన్ సెలెక్ట్ చేయాలి.
- అప్పుడు మీకు రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ లేదా ఈ-మెయిల్ ఐడీకి ఓటీపీ వస్తుంది. దానిని ఎంటర్ చేయాలి.
- పాన్ కార్డ్ రీప్రింట్ కోసం రూ.50 చెల్లించాలి. ఆన్‌లైన్ ద్వారానే చెల్లించవచ్చు. పేమెంట్ చేసిన తర్వాత అక్నాలెడ్జ్ రిసిప్ట్ వస్తుంది. దీనిని భద్రపరుచుకోవాలి.
- 15-20 రోజుల్లో మీ రిజిస్టర్డ్ అడ్రస్‌కి కొత్త పాన్ కార్డు డెలివరీ అవుతుంది.
- అలాగే దరఖాస్తు చేసిన 24 గంటల తర్వాత ఎన్ఎస్‌డీఎల్ వెబ్‌సైట్లో ఇ-పాన్ అందుబాటులో ఉంటుంది. దానిని సైతం డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
UTIITSL ద్వారా పాన్ రీప్రింట్ ప్రాసెస్:
- ముందుగా మీరు UTIITSL వెబ్‌సైట్‌లో పాన్ రీప్రింట్ పేజీలోకి వెళ్లాలి.
- రీప్రింట్ పాన్ కార్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేయాలి.
- ఆ తర్వాత మీ పాన్, డెట్ ఆఫ్ బర్త్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ నొక్కాలి.
- పేమెంట్, ఓటీపీ వాలిడేషన్ వంటి ప్రాసెస్ ఫాలో కావాలి.
- ఎన్ఎస్‌డీఎల్ వెబ్‌సైట్‌లో మాదిరిగానే ప్రాసెస్ ఉంటుంది.
- ఈ ప్రక్రియ విజయవంతంగా పూర్తి చేస్తే మీకు రీప్రింట్ అయిన కొత్త పాన్ కార్డ్ ఇంటికి వస్తుంది.
COMMENTS