If you want tomatoes to stay fresh for a long time.. try this
Tomatoes: టమాటాలు ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే.. ఇలా చేసి చూడండి
ప్రతి ఇంటి వంటలలో వినియోగించే అత్యంత ముఖ్యమైన కూరగాయలలో టమాట ఒకటి. ఎలాంటి వంటకాలు చేసినా టమాట తప్పనిసరి. ఇది వేస్తే రుచి బాగుంటుంది. అంతే కాకుండా ఈ టమాటాలను వంటల్లోనే కాకుండా సలాడ్స్, శాండ్‌విచ్‌లు, బర్గర్‌లు, పిజ్జాల తయారీలో కూడా విరివిగా ఉపయోగిస్తుంటారు. కానీ వీటిని ఎక్కువ కాలం నిల్వ చేయడం చాలా కష్టమైన పని. నిల్వలో కాస్త తేడా వచ్చినా టమోటాలు త్వరగా పాడవుతాయి. కాబట్టి టమాటాలను ఎక్కువ కాలం చెడిపోకుండా ఉండాలంటే ఈ కింది చిట్కాలు పాటిస్తే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..
- టమాటాలను మార్కెట్ నుంచి తీసుకువచ్చిన తర్వాత వాటిని కడగడం, ఆ వెంటనే ఫ్రిజ్‌లో పెట్టడం మానుకోవాలి. తడిగా ఉంటే, బాగా ఆరబెట్టి, ఆపై ఫ్రిజ్లో ఉంచడం మంచిది.
- ఇతర కూరగాయలతో టమోటాలు ఉంచకూడదు. కూరగాయల బరువు టమోటా మీద పడటంతో అవి పాడయ్యే అవకాశం ఉంది. అంతే కాకుండా ఇతర పండ్లు, కూరగాయలతో కలిపి ఉంచితే కుళ్లిపోయే అవకాశం కూడా ఎక్కువ.
- టొమాటోలను ఫ్రిజ్‌లో ఉంచేటప్పుడు వాటిని పేపర్‌లో చుట్టడం మర్చిపోవద్దు. ఇలా ఉంచితే పొడిగా ఉండి ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి.
- వంటకు ముందు పసుపు నీటిలో టమోటాలు కడగడం అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే మార్కెట్ నుంచి తెచ్చిన టమాటాను పసుపు నీళ్లలో కడిగి ఆరబెట్టాలి. ఇలా చేస్తే టమాటాలు తాజాగా ఉంటాయి.
- ప్లాస్టిక్ సంచుల్లో టమాటాలు నిల్వ చేయవద్దు. టమాటాలకు తేమ తగిలితే త్వరగా కుళ్ళిపోతాయి. కాబట్టి టమాటాలను ప్లాస్టిక్ బ్యాగులకు బదులు గాలి చొరబడని డబ్బాలు, బుట్టల్లో నిల్వ ఉంచడం మంచిది.
- వీటిని వంట కోసం ఉపయోగించినప్పుడు, ముందుగా పండిన టమోటాలను ఉపయోగించండి. మిగిలిన టమోటాలు ఉంటే, వాటిని ఫ్రిజ్‌లో నిల్వ చేయండి.
- టమాటాలు ఎక్కువ సేపు తాజాగా ఉండాలంటే వాటి తొనలు తీసెయ్యాలి. అంతే కాకుండా, సూర్యరశ్మికి దూరంగా ఉంచటం కూడా అంతే ముఖ్యం.
- టమాటాలను కొనుగోలు చేసేటప్పుడు, పచ్చి, పండని టమాటాలను కొనాలి. ఇవి ఎక్కువ కాలం తాజాగా ఉంటాయి.
- బదులుగా అతిగా పండిన టమాటాలను కొనుగోలు చేస్తే, వాటిని మార్కెట్ నుంచి తీసుకొచ్చాక సరిగ్గా శుభ్రం చేయాలి. ఆ తర్వాత ముక్కలుగా కోసి మిక్సీలో మెత్తగా రుబ్బుకుని పేస్ట్‌లా చేసుకోవాలి. దీనిని గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేసి ఫ్రిజ్‌లో ఉంచినా మంచిదే.
COMMENTS