High official quota: In this quota, the train ticket is 100% compliant.. The application procedure is the same..!
High official quota: ఈ కోటాలో రైలు టిక్కెట్ వందశాతం కన్ఫార్మ్.. దరఖాస్తు విధానం ఇదే..!
మన దేశంలో రైలు అనేది అత్యంత సురక్షితమైన, చౌకయిన, వేగవంతమైన ప్రయాణం సాధనం. దేశంలోని నలుమూలలకూ రైలు మార్గాలు ఉన్నాయి. ఎక్కువ మంది రైళ్లలోనే వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తారు. అందుకనే దేశంలో రైల్వే స్టేషన్లన్నీ ప్రయాణికులతో ఎప్పుడూ కిటకిటలాడుతూ ఉంటాయి. రైలులో సాధారణంగా దూర ప్రాంతాలకు ప్రయాణం చేస్తారు. కనీసం 24 గంటలకు పైగా కూర్చోవాల్సి ఉంటుంది. జనరల్ బోగీలు ఉన్నా వాటిలో నిలబడి ప్రయాణం చేయడం సాహసమే. దీంతో ముందుగా టిక్కెట్ రిజర్వేషన్ చేసుకోవడం అవసరం.
అత్యవసరంగా ప్రయాణం చేయాల్సి వచ్చినప్పుడు, రిజర్వేషన్ టిక్కెట్ కన్ఫామ్ కానప్పుడు హెచ్ కోటా కింద దరఖాస్తు చేసుకోవచ్చు. నిబంధనలను అనుసరించి రైల్వే అధికారులు చర్యలు తీసుకుంటారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, న్యాయమూర్తులు, రైల్వే ఉన్నతాధికారులకు ఈ కోటా కింద బెర్తులు అందజేస్తారు. కొన్ని ప్రత్యేక పరిస్థితులలో సామాన్యులు కూాడా పొందే అవకాశం ఉంది. నిబంధనలకు మేరకు సీనియర్ సిటిజన్ల కూడా ప్రత్యేక అవకాశం ఉంది. మీరు సాధారణ టికెట్ తీసుకున్నా, వెయిటింగ్ జాబితాలో ఉన్న ఈ హెచ్ వో కోటా కింద రిజర్వేషన్ బెర్తు పొందే అవకాశం ఉంటుంది. దాదాపు అన్ని రైళ్లలో కొన్నిసీట్లు ఈ కేటగిరీ కింద రిజర్వ్ చేసి ఉంటాయి. కాబట్టి మీరు దరఖాస్తు చేసుకోగానే, నిబంధనలను అనుసరించి మీకు టికెట్ ను కన్ఫార్మ్ చేస్తారు.
హెచ్ ఆర్ కోటా టిక్కెట్ల కోసం దరఖాస్తు చేసుకోవాలంటే కొన్ని నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి. ప్రయాణం చేయడానికి ముఖ్యమైన కారణం ఉండాలి. దాన్ని నిర్ధారణ చేసే డాక్యుమెంట్ ను మీ వద్ద కచ్చితంగా ఉంచుకోవాలి. ప్రయాణానికి ఒక్క రోజు ముందుగానే దరఖాస్తు చేసుకోవాలి. దీని కోసం అత్యవసర కోటా (ఈక్యూ) ఫారంను చీఫ్ రిజర్వేషన్ సూపర్ వైజర్ కు అందజేయాలి. అత్యవసర పరిస్థితికి సంబంధించి అన్ని పత్రాలతో హెచ్ వో కోటా కింద టిక్కెట్ కోసం దరఖాస్తు సమర్పించాలి. దరఖాస్తుపై గెజిటెడ్ అధికారి సంతకం కూడా అవసరమవుతుంది. మీ దరఖాస్తును డివిజినల్, జోనల్ కార్యాలయంలో ఉద్యోగులు పరిశీలిస్తారు. వారి ఆమోదం పొందిన తర్వాత టిక్కెట్ కన్ఫార్మ్ అవుతుంది.
COMMENTS