Are you sweating in the cold? Find out how much risk
వణికే చలిలోనూ చమటలు పడుతున్నాయా? ఎంత ప్రమాదమో తెలుసుకోండి
చలికాలం దాదాపు ప్రారంభమైనట్లే. వాతావరణం రోజురోజుకూ మారిపోతోంది. కొన్ని చోట్ల రాత్రివేళల్లోనే కాకుండా ఉదయం పూట కూడా చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. దీంతో వెచ్చగా ఉండేందుకు రగ్గులు, స్వెటర్లు కప్పుకుంటున్నారు జనాలు. అయితే ఇంత చలి ఉన్నా కొందరు రాత్రిపూట చెమటతో తడిసి పోతుంటారు. అవును, కొందరికి రాత్రిపూట ఎంత చలి ఉన్నా చెమటలు పడుతుంటాయి. పదే పదే ఈ లక్షణం కనిపిస్తే తేలిగ్గా తీసుకోవడం సరికాదంటున్నారు నిపుణులు. చల్లని వాతావరణంలోనూ రాత్రి చెమటలు పడితే.. ఇది కొన్ని తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు సంకేతం అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి, మీరూ ఈ రకమైన సమస్యతో బాధపడుతుంటే వెంటనే నిపుణుడిని సంప్రదించండి. చలికాలంలో కూడా చెమటలు పట్టడం వెనుక అనేక కారణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. హార్మోన్ల అసమతుల్యత, ఇన్ఫెక్షన్ లేదా వెచ్చని బట్టలు ధరించడం ఈ సమస్యకు సాధారణ కారణాలు. కానీ ఈ సమస్య పదేపదే కొనసాగితే, ఇది కొన్ని తీవ్రమైన వ్యాధుల లక్షణం కావచ్చు. అవి ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం..
TB (క్షయ)
రాత్రిపూట చెమటలు పట్టడం అనేది TB ప్రారంభ లక్షణం. కాబట్టి మీకు కూడా ఈ రకమైన సమస్య పదేపదే ఎదురైతే వైద్యుడిని సంప్రదించండి. లేదంటే ఈ ఇన్ఫెక్షన్ ఊపిరితిత్తులపై ప్రభావం చూపుతుంది. సకాలంలో చికిత్స చేయకపోతే ఇది కూడా ప్రమాదకరమే సుమా.
హాడ్కిన్ లింఫోమా క్యాన్సర్
ఇది శోషరస కణుపులను ప్రభావితం చేసే ఒక రకమైన క్యాన్సర్. రాత్రిపూట ఎక్కువ చెమట పట్టడం ఈ వ్యాధికి సంకేతం. దీని ప్రారంభ లక్షణాలు బరువు తగ్గడం, జ్వరం.
హైపర్ థైరాయిడిజం
రాత్రిపూట ఎక్కువగా పనిచేసినప్పుడు కూడా ఇలా చెమటలు పడతాయి. ఈ పరిస్థితి హృదయ స్పందన రేటును పెంచుతుంది. కాబట్టి ఇది శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడంలో సమస్యలను కలిగిస్తుంది.
మెనోపాజ్ లేదా హార్మోన్ల మార్పులు
మహిళల్లో మెనోపాజ్ సమయంలో హార్మోన్ల మార్పులు సాధారణం. ఇలాంటి సమయంలోనూ చలిలో కూడా చెమటలు పడుతుంటాయి.
గుండె సంబంధిత సమస్యలు
రాత్రిపూట చెమటలు పట్టడం గుండెపోటు వంటి గుండె సమస్యలకు సంకేతం. ఇది తరచుగా సంభవిస్తే, దానిని నిర్లక్ష్యం చేయకూడదు.
మరైతే ఏం చేయాలి?
శీతాకాలంలో రాత్రిళ్లు నిద్ర సమయంలో తరచుగా చెమటలు పడుతూ ఉంటే, దానిని నిర్లక్ష్యం చేయకండి. వైద్యుడిని సంప్రదించి అవసరమైన పరీక్షలు చేయించుకోవాలి. అలాగే ప్రతిరోజూ సమతుల్య ఆహారం తీసుకోవాలి. నీరు పుష్కలంగా త్రాగాలి. హైడ్రేటెడ్ గా ఉండడం మర్చిపోవద్దు. ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా లేదా ధ్యానం చేయాలి. రాత్రిపూట చల్లని నీరు తాగడం కూడా మంచిది. అలాగే పడుకునేటప్పుడు వదులుగా, తేలికైన, కాటన్ లేదా పైజామా వంటి దుస్తులు ధరించాలి. నడక, స్విమ్మింగ్, డ్యాన్స్, సైక్లింగ్ మొదలైన వాటి వ్యాయామాలు ప్రతిరోజూ చేయాలి. నిద్ర సమయంలో తేలికపాటి దుప్పట్లను ఉపయోగించాలి.
COMMENTS