116 Anganwadi Jobs with 10th Class Qualification.. No Written Exam
AP Anganwadi Jobs: పదో తరగతి అర్హతతో 116 అంగన్‌వాడీ ఉద్యోగాలు.. ఎలాంటి రాత పరీక్ష లేదు
ఐసీడీఎస్ ప్రాజెక్టు కింద అన్నమయ్య జిల్లాలో.. 116 అంగన్‌వాడీ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 11 ప్రాజెక్టుల పరిధిలో అంగన్‌వాడీ వర్కర్ పోస్టులు 11, మినీ అంగన్‌వాడీ వర్కర్ పోస్టులు 12, అంగన్‌వాడీ హెల్పర్ పోస్టులు 93 ఈ నోటిఫికేషన్ కింద భర్తీ చేయనున్నారు.
ఆసక్తి కలిగిన వారు డిసెంబర్ 24 నుంచి ఎక్కడికక్కడ సీడీపీఓలు అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు.
దరఖాస్తులకు జనవరి 2, 2025వ తేదీ తుది గడువుగా నిర్ణయించారు.
బి.కొత్తకోట, చిట్వేల్, ఎల్‌ఆర్ పల్లి, మదనపల్లి, పీలేర్, రైల్వే కోడూరు, రాజంపేట, రాయచోటి, టి.సండుపల్లి, తంబలపల్లి, వాల్మీకిపురం ప్రాజెక్టుల పరిధిలో ఈ పోస్టులను భర్తీ చేస్తారు.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు తప్పనిసరిగా 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
స్థానికంగా నివాసిస్తున్న వివాహిత మహిళలు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు.
అభ్యర్ధుల వయస్సు తప్పనిసరిగా 21 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఇంటర్వ్యూ, మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎలాంటి రాత పరీక్ష ఉండదు.
ఎంపికైతే నెలకు అంగన్‌వాడీ వర్కర్ పోస్టులకు రూ.11500, మినీ అంగన్‌వాడీ వర్కర్ పోస్టులకు రూ.7000, అంగన్‌వాడీ హెల్పర్ పోస్టులకు రూ.7000 చొప్పున జీతంగా చెల్లిస్తారు.
ఆసక్తి కలిగిన వారు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. నింపిన దరఖాస్తులను జిల్లాలోని సంబంధిత ఐసీడీఎస్ ప్రాజెక్ట్ కార్యాలయంలో అందజేయాలి.
బయోడేటాతో పాటు విద్యార్హతలు, ఇతర సర్టిఫికెట్లు జిరాక్స్ కాపీలపై గెజిటెడ్ ఆఫీసర్‌తో సంతకం చేయించి ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయంలో అప్లికేషన్ అందజేయాల్సి ఉంటుంది. రిజర్వేషన్ రోస్టర్, ఇతర వివరాల కోసం ఈ కింది అధికారిక నోటిఫికేషన్ చూడొచ్చు.
Important Links:
FOR NOTIFICATION CLICKHERE.
FOR LATEST JOB NOTIFICATIONS CLICKHERE
COMMENTS