District Court Job Recruitment
10th అర్హతతో రికార్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు వెంటనే అప్లై చేసుకోండి
Telangana Nalgonda district court typist assistant record assistant job notification all details : నిరుద్యోగులకు శుభవార్త కేవలం టెన్త్ పాస్ అయిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అప్లై చేస్తే సొంత జిల్లాలోని సొంత రాష్ట్రంలోని ఉద్యోగం వస్తుంది. జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ, నల్గొండ యూనిట్‌లో ఉద్యోగ అవకాశాలు ప్రకటించబడ్డాయి. ఈ నోటిఫికేషన్ ద్వారా టైపిస్ట్-కమ్-అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తిగల అభ్యర్థులు నిర్దేశిత సమయంలోపు దరఖాస్తు చేసుకోవాలని నల్గొండ జిల్లా న్యాయమూర్తి మరియు నోటిఫికేషన్ చైర్మన్ తెలియజేశారు.
పోస్ట్ పేరు:
- టైపిస్ట్-కమ్-అసిస్టెంట్.
- రికార్డ్ అసిస్టెంట్.
విద్య అర్హత:
టైపిస్ట్-కమ్-అసిస్టెంట్: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఏదైనా డిగ్రీ. ఇంగ్లీష్ టైపింగ్ హయ్యర్ గ్రేడ్ (45 w.p.m. వేగంతో) ఉత్తీర్ణత. కంప్యూటర్ ఆపరేషన్స్‌లో జ్ఞానం అవసరం.
రికార్డ్ అసిస్టెంట్: SSC లేదా దానికి సమానమైన అర్హత ఉండాలి.
వయోపరిమితి:
సాధారణ (OC/EWS) : 18 సంవత్సరాలు to 34 సంవత్సరాలు.
SC/ST/BC/EWS : 18 సంవత్సరాలు to 39 సంవత్సరాలు.
వికలాంగులు : 18 సంవత్సరాలు to 44 సంవత్సరాలు.
దరఖాస్తు రుసుము:
సాధారణ వర్గం (OC/BC): రూ. 800.
SC/ST వర్గం: రూ. 400.
రుసుమును డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో “సెక్రటరీ, జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ, నల్గొండ” పేరిట చెల్లించాలి.
ఎలా దరఖాస్తు చేసుకోవాలి:
- అభ్యర్థులు district.ecourts.gov.in/nalgonda వెబ్‌సైట్ నుండి దరఖాస్తు ఫారమ్ డౌన్‌లోడ్ చేసుకోవాలి.
- దానిని పూరించి అవసరమైన డాక్యుమెంట్లతో కలిపి క్రింది చిరునామాకు పంపాలి:
- చైర్మన్, జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ, న్యాయ సేవా సదన్, జిల్లా కోర్ట్ ఆవరణ, నల్గొండ.
- దరఖాస్తులను రిజిస్టర్డ్ పోస్ట్/కొరియర్ ద్వారా మాత్రమే పంపాలి.
కావలసిన డాక్యుమెంట్ వివరాలు:
- విద్యార్హత సర్టిఫికేట్లు.
- జనన తేదీ ధృవీకరణ పత్రం.
- కుల ధృవీకరణ పత్రం (అవసరమైతే).
- కంప్యూటర్ మరియు టైపింగ్ పరీక్షల సర్టిఫికేట్లు.
- డిమాండ్ డ్రాఫ్ట్.
ముఖ్యమైన తేదీ:
దరఖాస్తుల ప్రారంభ తేదీ : 16-11-2024.
దరఖాస్తుల చివరి తేదీ : 02-12-2024.
ముఖ్యమైన సూచనలు:
- అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శిస్తూ నియామక ప్రక్రియ గురించి సమాచారం పొందాలి.
- పరీక్షా హాల్ టిక్కెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాలి.
- నోటిఫికేషన్ చైర్మన్ ఏ సమయంలోనైనా నోటిఫికేషన్‌ను రద్దు చేసే హక్కు కలిగి ఉంటారు.
Important Links:
FOR NOTIFICATION CLICKHERE.
FOR APPLY CLICKHERE.
FOR LATEST JOB NOTIFICATIONS CLICKHERE
COMMENTS