Old vehicle is more than 15 years old.. What should you do.. Everyone must know
Be Alert : Old వాహనం 15 ఏళ్లు దాటిందా.. మీరు ఏం చేయాలి.. తప్పనిసరిగా ప్రతి ఒక్కరు తెలుసుకోండి.
Old Vehicle And Car : ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో ప్రతి కుటుంబానికి కనీసం ఒక వాహనం అవసరం అనిపిస్తుంది. ప్రతి ప్రయాణానికి బైక్ లేదా కార్ అవసరం పడుతుంది, అందువల్ల వాహనాల కొనుగోలు అధికమవుతోంది. కానీ వాహనాల సంఖ్య పెరగడం వల్ల రోడ్లపై రద్దీతో పాటు గాలి, శబ్ద కాలుష్యం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 15 ఏళ్లు దాటిన వాహనాలపై కీలక నిర్ణయం తీసుకున్నారు.
రాష్ట్రంలో వాహనాల కాలం పొడిగింపు, కాలుష్య నియంత్రణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్త మోటర్ వెహికల్ పాలసీని ప్రకటించారు. ఈ పాలసీ ప్రకారం, వ్యక్తిగత వాహనాలు 15 ఏళ్లు, వాణిజ్య వాహనాలు 8 ఏళ్లు దాటినవి ఇక నుంచి స్క్రాప్ లోకి పంపించాలి. ఈ కొత్త పాలసీ ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అమలు కానుంది.
తెలంగాణ రాష్ట్రంలో వాహనాల స్థితి:
తెలంగాణ వ్యాప్తంగా 15 ఏళ్ల పైబడిన వాహనాలు సుమారు 21 లక్షల వరకూ ఉన్నాయని అంచనా. వీటిలో 9 లక్షల వాహనాలు హైదరాబాద్ నగరంలో ఉన్నాయి. వీటిలో అధిక శాతం బైకులు అని సమాచారం. రోడ్లపై తిరుగుతున్న పాత వాహనాల కారణంగా కాలుష్యం పెరిగిపోతోంది.
15 ఏళ్లు దాటిన వాహనాలు – తదుపరి చర్యలు :
పాత వాహనాలు ఇకపై రోడ్లపై తిరగడానికి అనుమతి ఉండదు. కానీ ఫిట్‌నెస్ టెస్ట్‌లో పాస్ అయితే వాటిని కొన్ని ప్రత్యేక పన్నులు చెల్లించి ఉపయోగించవచ్చు. గ్రీన్ ట్యాక్స్ పేరిట రూ. 5,000 చెల్లించి 5 సంవత్సరాలు, ఆ తర్వాత మరోసారి ఫిట్‌నెస్ టెస్ట్ చేసి రూ. 10,000 చెల్లించి మరో ఐదేళ్లు వాడుకోవచ్చు. ఫిట్‌నెస్ లేకుంటే మాత్రం తప్పనిసరిగా స్క్రాప్‌లోకి పంపించాల్సి ఉంటుంది.
వాహనదారులకు అందుబాటులో ఉన్న ప్రత్యామ్నాయాలు :
15 ఏళ్లు దాటిన వాహనాలను ఇతర జిల్లాల్లో వినియోగించుకోవచ్చు లేదా అక్కడి మార్కెట్లో అమ్ముకోవచ్చు. పాత వాహనం స్క్రాప్ చేసేందుకు ఇవ్వడం ద్వారా కొత్త వాహనం కొనుగోలుపై కొంత పన్ను మినహాయింపు కూడా లభిస్తుంది.
ప్రభుత్వ మరియు ప్రైవేట్ వాహనాలు :
కేంద్ర ప్రభుత్వం 15 ఏళ్ల కాల పరిమితి విధానం తెచ్చింది. కొన్ని మినహాయింపులు ఉన్నప్పటికీ, ప్రభుత్వ విభాగాలకు చెందిన పాత వాహనాలను కూడా దశల వారీగా స్క్రాప్ చేయనున్నారు. దీంతో ప్రభుత్వ వాహనాలు, ఆర్టీసీ బస్సులు కూడా స్క్రాప్ పాలసీ కిందకు రావచ్చు.
ఆర్థిక పరిస్థితులపై ప్రభావం :
కొత్త పాలసీ వాహనదారుల్లో కొన్ని ఆందోళనలు తెచ్చింది. ముఖ్యంగా, ఆర్థికంగా బలహీన వర్గాల వారికి కొత్త వాహనం కొనడం కష్టం అవుతుందని భావిస్తున్నారు. ఈ పాలసీపై తెలంగాణ ప్రభుత్వం మరింత స్పష్టత ఇవ్వాలని వాహనదారులు కోరుతున్నారు.
తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల కాలుష్య నియంత్రణకు దోహదం జరుగుతుంది, అయితే వాహనదారుల ఆర్థిక పరిస్థితిని కూడా దృష్టిలో ఉంచి, మరిన్ని ఆప్షన్లు కల్పించాలని కోరుకుంటున్నారు.
COMMENTS