IDBI Bank Executive: 1000 Executive Posts in IDBI Bank.
IDBI Bank Executive: ఐడీబీఐ బ్యాంకులో 1000 ఎగ్జిక్యూటివ్ పోస్టులు.
ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఐడీబీఐ బ్యాంక్ లిమిటెడ్)… ఒప్పంద ప్రాతిపదికన 2025-26 సంవత్సరానికి దేశవ్యాప్తంగా ఉన్న ఐడీబీఐ శాఖల్లో ఎగ్జిక్యూటివ్ (సేల్స్ అండ్ ఆపరేషన్స్) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతోంది. డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు నవంబర్ 16వ తేదీలోగా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
ఖాళీల వివరాలు:
ఎగ్జిక్యూటివ్: 1000 (యూఆర్- 448; ఎస్టీ- 94; ఎస్సీ- 127; ఓబీసీ- 231; ఈడబ్ల్యూఎస్- 100)
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. కంప్యూటర్/ ఐటీ సంబంధిత అంశాల్లో ప్రావీణ్యం కలిగి ఉండాలి.
వయోపరిమితి: 01-10-2024 నాటికి 20 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీత భత్యాలు: నెలకు రూ.29,000 నుంచి రూ.31,000.
దరఖాస్తు రుసుము: రూ.1050. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.250.
ఎంపిక ప్రక్రియ: ఆన్‌లైన్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ప్రీ రిక్రూట్‌మెంట్ మెడికల్ టెస్ట్ ఆధారంగా.
ఆన్‌లైన్ పరీక్ష అంశాలు: లాజికల్ రీజనింగ్, డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్‌ప్రెటేషన్ (60 ప్రశ్నలు- 60 మార్కులు), ఇంగ్లిష్ లాంగ్వేజ్ (40 ప్రశ్నలు- 40 మార్కులు), క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ (40 ప్రశ్నలు- 40 మార్కులు), జనరల్/ ఎకానమీ/ బ్యాంకింగ్ అవేర్‌నెస్/ ఐటీ/ కంప్యూటర్/ (60 ప్రశ్నలు- 60 మార్కులు).
మొత్తం ప్రశ్నల సంఖ్య: 200. మొత్తం మార్కులు 200.
పరీక్ష కాల వ్యవధి: 120 నిమిషాలు.
ముఖ్య తేదీలు…
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్/ దరఖాస్తు/ సవరణ తేదీలు: 07-11-2024 నుంచి 16-11-2024 వరకు.
ఆన్‌లైన్ దరఖాస్తు రుసుము చెల్లింపు తేదీలు: 07-11-2024 నుంచి 16-11-2024 వరకు.
ఆన్‌లైన్ పరీక్ష తేదీ: 01-12-2024.
ముఖ్యాంశాలు:
- ఐడీబీఐ బ్యాంక్ లిమిటెడ్… ఒప్పంద ప్రాతిపదికన ఎగ్జిక్యూటివ్ (సేల్స్ అండ్ ఆపరేషన్స్) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతోంది.
- డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు నవంబర్ 16వ తేదీలోగా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
Important Links:
FOR NOTIFICATION CLICKHERE.
FOR WEBSITE CLICKHERE.
FOR LATEST JOB NOTIFICATIONS CLICKHERE
COMMENTS